IRCTC Tour: వారణాసి, అయోధ్యతో పాటు నేపాల్‌ని పర్యటించాలనుకుంటున్నారా.. తక్కువ ధరతో IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ..మీకోసం

భారత్ నేపాల్ అష్ట యాత్ర 31 మార్చి, 2023 నుండి ప్రారంభంకానుంది . ఈ పర్యటనలో భాగంగా భారతదేశంలోని అయోధ్య, వారణాసి , ప్రయాగ్‌రాజ్ లతో పాటు నేపాల్‌లోని పశుపతినాథ్ (ఖాట్మండు) వంటి ప్రదేశాలను కవర్ చేస్తుంది

IRCTC Tour: వారణాసి, అయోధ్యతో పాటు నేపాల్‌ని పర్యటించాలనుకుంటున్నారా.. తక్కువ ధరతో IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ..మీకోసం
Bharat Nepal Ashtha Yatra Tour
Follow us
Surya Kala

|

Updated on: Mar 14, 2023 | 9:06 AM

శ్రీరామ నవమి పర్వదినం ఈ ఏడాది మార్చి 30వ తేదీన జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమైన తీర్ధ యాత్ర చేయాలనుకునే ఆసక్తిగల పర్యాటకుల కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.  10 రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనను  “భారత్ నేపాల్ అష్ట యాత్ర” టూర్ పేరుతో పర్యాటకుల కోసం తీసుకొచ్చింది. యాత్రికులు పది రోజుల యాత్రలో ఉత్తర భారతంలోని పుణ్యక్షేత్రాల సందర్శనతో పాటు నేపాల్‌లో కూడా పర్యటించవచ్చు.

భారత్ నేపాల్ అష్ట యాత్ర 31 మార్చి, 2023 నుండి ప్రారంభంకానుంది . ఈ పర్యటనలో భాగంగా భారతదేశంలోని అయోధ్య, వారణాసి , ప్రయాగ్‌రాజ్ లతో పాటు నేపాల్‌లోని పశుపతినాథ్ (ఖాట్మండు) వంటి ప్రదేశాలను కవర్ చేస్తుంది. రైలు జలందర్ నుండి బయలుదేరుతుంది. ఢిల్లీ సఫ్దర్‌జంగ్ నుండి బోర్డింగ్ ఉంటుంది.

ఈ 10 రోజుల పర్యటనలో కవర్ చేయబడే గమ్యస్థానాలు: రామ జన్మభూమి ఆలయం, హనుమాన్ గర్హి, సరయుఘాట్, అయోధ్యలోని నందిగ్రామ్,  ఖాట్మండులోని పశుపతినాథ్ ఆలయం, దర్బార్ స్క్వైర్, స్వయంభూనాథ్ స్థూపం, తులసి మానస్ ఆలయం, సంకట్మోచన్ ఆలయం, కాశీ విశ్వనాథ్ కారిడార్,  ఆలయం, వారణాసిలోని వారణాస్‌ఘాట్‌లో గంగా ఆరతి, గంగా – యమునా సంగమం, ప్రయాగ్‌రాజ్‌లోని హనుమాన్ దేవాలయం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

బోర్డింగ్, డి-బోర్డింగ్‌ సౌకర్యం : జలంధర్ సిటీ, లూథియానా, చండీగఢ్, అంబాలా, కురుక్షేత్ర, పానిపట్, ఢిల్లీ, ఘజియాబాద్, అలీఘర్, తుండ్లా, ఇటావా, కాన్పూర్.

IRCTC  ప్యాకేజీలో భాగంగా 3AC తరగతిలో 600 సీట్లను అందిస్తుంది. 600 సీట్లలో 300 స్టాండర్డ్, మిగతా 300 సుపీరియర్‌గా ఉంటాయి.

ప్యాకేజీ ధరల వివరాలు:

మొత్తం 9 రాత్రులు, 10 పగళ్లుగా ఉంటే ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీలో.. సింగిల్ ఆక్యుపెన్సీ ధర సుపీరియర్ సీట్ల కోసం రూ. 41,090.. స్టాండర్డ్ కి రూ. 36,160 చెల్లించాల్సి ఉంటుంది.

ఇద్దరు లేదా ముగ్గురు కోసం రూ. సుపీరియర్ సీట్ల కోసం రూ. 31,610.. స్టాండర్డ్ కి రూ. 27,815 చెల్లించాల్సి ఉంటుంది.

5 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లల కోసం  సుపీరియర్ సీటు కి రూ. 28,450.. స్టాండర్డ్ కి రూ. 25,035 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ భారత్ నేపాల్ అష్ట యాత్ర కోసం IRCTC భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలుని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రత్యేక పర్యాటక రైలు లో 3AC తరగతిలో ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.  సుపీరియర్ ప్యాకేజీ కోసం AC రూమ్‌లను .. స్టాండర్డ్ కోసం నాన్-ఏసీ రూమ్‌లను అందుబాటులో ఉంచనుంది. వీటిల్లో  నైట్స్ బస, వాష్ ఎన్ చేంజ్ రూమ్‌లు ఉన్నాయి.

టూర్ మొత్తం ఛార్జీలో రైలు ప్రయాణం, రాత్రిపూట హోటళ్లలో బస, రైలులో భోజనం (వెజ్), వివిధ ప్రాంతాల నుంచి ట్రాన్స్‌ఫర్స్, ప్రయాణ బీమా, భద్రతా ఛార్జీలు, పన్నులు వంటివి కలిసి ఉంటాయి

IRCTC వెబ్‌సైట్ ప్రకారం, ఆలయ దర్శనం, స్మారక చిహ్నాల సందర్శన కోసం COVID-19 టీకా సర్టిఫికేట్ తప్పనిసరి. పర్యటన సమయంలో ప్రయాణీకులందరూ టీకా ధృవీకరణ పత్రాన్ని హార్డ్ కాపీలో లేదా ఫోన్‌లో తీసుకెళ్లాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..