IRCTC Tour: ఈజిప్టు పిరమిడ్‌ల వీక్షణం, నైలు నదిలో విహారం చేయాలనుకుంటున్నారా .. IRCTC స్పెషల్ ప్యాకేజీ వివరాలు మీకోసం

నైలు నది వర ప్రసాదం అయిన ఈజిప్ట్‌ను సందర్శించడం కోసం సరికొత్త ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ 10 రాత్రులు,  11 పగళ్లు ఉండనుంది. ఈ టూర్ మార్చి 28న ప్రారంభంకానుంది. ప్యాజేకేజీ  కోల్‌కతా నుండి ముంబైకి విమానం ద్వారా చేరుకోవాలి.

IRCTC Tour: ఈజిప్టు పిరమిడ్‌ల వీక్షణం, నైలు నదిలో విహారం చేయాలనుకుంటున్నారా .. IRCTC స్పెషల్ ప్యాకేజీ వివరాలు మీకోసం
Irctc Egypt Tour Package
Follow us

|

Updated on: Mar 10, 2023 | 12:36 PM

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) దేశీయంగానే కాదు అంతర్జాతీయంగా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి టూర్ ప్యాకేజీలను క్రమం తప్పకుండా ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా నైలు నది వర ప్రసాదం అయిన ఈజిప్ట్‌ను సందర్శించడం కోసం సరికొత్త ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ 10 రాత్రులు,  11 పగళ్లు ఉండనుంది. ఈ టూర్ మార్చి 28న ప్రారంభంకానుంది. ప్యాజేకేజీ  కోల్‌కతా నుండి ముంబైకి విమానం ద్వారా చేరుకోవాలి. అనంతరం ముంబై నుంచి ప్రయాణికులను ఈజిప్ట్ రాజధాని కైరోకు తీసుకువెళతారు. భారత దేశం నుంచి బయలుదేరినది మొదలు.. తిరిగి మన దేశానికి చేరుకునే వరకూ అన్ని ఏర్పాట్లను IRCTC చేస్తుంది. టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలోకి వెళ్తే..

మార్చి 29న కైరో చేరుకున్న తర్వాత.. అక్కడ ప్రయాణీకులను ఓ ప్రతినిధి కలుస్తాడు. అనంతరం వారిని వారు బస చేసే హోటల్‌కి తీసుకువెళతారు. పర్యాటకులు రెడీ అయిన తర్వాత పిరమిడ్‌లలో లైట్ అండ్ సౌండ్ షోని వీక్షించి సాయంత్రం హోటల్ కు తిరిగి రావాలి. రాత్రి భోజనం చేసి.. అక్కడే హోటల్ లో బస చేయాల్సి ఉంటుంది. మర్నాడు అల్పాహారం చేసిన తర్వాత.. ప్రయాణికులు ఈజిప్టు నగరమైన అలెగ్జాండ్రియాను సందర్శించడానికి వెళ్లారు. పాంపీ పిల్లర్స్, అలెగ్జాండ్రియా లైబ్రరీ , అల్ మోర్సీ అబుల్ అబ్బాస్ మసీదులను దర్శించవచ్చు.

తరువాత  పర్యాటకులు కైరోకు తిరిగి వెళ్లి విందు చేయాల్సి ఉంటుంది. మార్చి 31న అల్పాహారం తర్వాత.. పర్యాటకులు కైరోను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ గైడ్‌ అందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు. ఈజిప్షియన్ మ్యూజియం , ఖాన్ ఎల్ ఖలీలీ బజార్‌లను చూస్తారు. అంతేకాదు ఖుఫు, ఖఫ్రే , మెన్‌కౌర్ పిరమిడ్‌లను కూడా సందర్శించే ఏర్పాట్లు చేసింది IRCTC .

సాయంత్రం రైలులో ప్రయాణం చేస్తూ.. అస్వాన్‌కు చేరుకున్నారు. రాత్రి ప్రయాణం చేసి.. పర్యాటకులు ఏప్రిల్ 1వ తేదీన అస్వాన్‌కు చేరుకుంటారు.  అక్కడ వారు ఫిలే ఆలయాన్ని సందర్శిస్తారు. మూడు రోజుల పాటు నైలు నదిలో విహారయాత్ర చేస్తారు. అక్కడ అన్ని భోజనాలు ప్యాకేజీలో భాగంగా ఏర్పాటు చేస్తారు.

ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 5 వరకు మూడు రోజుల పాటు పర్యాటకులు ఈజిప్టులోని వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తారు. ఏప్రిల్ 6వ తేదీన పర్యాటకులు భారత దేశానికి తిరుగుపయనం కోసం విమానాశ్రయం చేరుకుంటారు. IRCTC పర్యాటకులు విమానాశ్రయానికి తీసుకువెళ్లి.. అక్కడ విమానం ఎక్కించి తిరిగి భారత్ కు పర్యాటకులను సురక్షితంగా చేరుస్తుంది.

ప్యాకేజీ  టికెట్ ధరలు 

ఈ ప్యాకేజీ సింగిల్ బుకింగ్‌కు రూ.2,01,100,

డబుల్ బుకింగ్‌కు రూ.1,75,000, ]

ట్రిపుల్ బుకింగ్‌కు రూ.1,72,600,

పిల్లలకు రూ.1,34,000.

గమనిక: ఈ టూర్ ప్యాకేజీ కింద వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా డబుల్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అంతేకాదు అన్ని COVID-19 మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంది.

ఆసక్తి ఉన్నవారు IRCTC అధికారిక వెబ్‌సైట్‌లో ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు లేదా మరింత సమాచారం కోసం 8595904074, 8595904072, 8595938067, 8595904079 నంబర్‌లకు కాల్ చేయవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమాయకంగా కాళ్లు మొక్కి.. పద్దతిగా మర్డర్ చేసిండు.! వీడియో వైరల్..
అమాయకంగా కాళ్లు మొక్కి.. పద్దతిగా మర్డర్ చేసిండు.! వీడియో వైరల్..
హర హర అంటే.. బుడ బుడ నీరు బయటకొస్తుంది.! వీడియో వైరల్..
హర హర అంటే.. బుడ బుడ నీరు బయటకొస్తుంది.! వీడియో వైరల్..
కెనడా నిర్ణయం భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపనుందా.? వీడియో..
కెనడా నిర్ణయం భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపనుందా.? వీడియో..
అక్కడికి రాగానే వాహనాలు గాల్లోకి ఎగురుతాయి.. ఎలా.? వీడియో వైరల్..
అక్కడికి రాగానే వాహనాలు గాల్లోకి ఎగురుతాయి.. ఎలా.? వీడియో వైరల్..
కేవలం రూ.3 వేలకే విమాన ప్రయాణం.! కొత్తగా 2 విమాన సర్వీసులు..
కేవలం రూ.3 వేలకే విమాన ప్రయాణం.! కొత్తగా 2 విమాన సర్వీసులు..
బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో దాక్కోమని చెప్పి ఊపిరి తీసింది.!
బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో దాక్కోమని చెప్పి ఊపిరి తీసింది.!
ఈ గింజల్ని రోజూ గంజిలో కాసింత కలుపుకుని తాగితే చాలు.! సర్వరోగాలకు
ఈ గింజల్ని రోజూ గంజిలో కాసింత కలుపుకుని తాగితే చాలు.! సర్వరోగాలకు
ఉపవాసంలో ఈ పండ్లను అస్సలు తినకూడదు.! అత్తిపండ్లు నాన్ వెజ్ ఆ.?
ఉపవాసంలో ఈ పండ్లను అస్సలు తినకూడదు.! అత్తిపండ్లు నాన్ వెజ్ ఆ.?
మోమోస్ దెబ్బకు ప్రాణమే పోయింది.! హైదరాబాద్ వాసులకి జాగ్రత్త..
మోమోస్ దెబ్బకు ప్రాణమే పోయింది.! హైదరాబాద్ వాసులకి జాగ్రత్త..
డ్యాన్స్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ కి నారా లోకేష్ బంపర్ ఆఫర్.!
డ్యాన్స్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ కి నారా లోకేష్ బంపర్ ఆఫర్.!