AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blue Lakes In World: ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన బ్లూ లేక్స్.. అందం చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

ఈ ప్రపంచం ఎన్నో వింతలు, మరెన్నో అద్భుతాల సమాహారం. అందమైన జలపాతాలు, అలరించే అడవులు, చిత్రకారుణి కుంచెను మించిన అపూర్వమైన దృశ్యాలు ఎన్నో ఎన్నెన్నో ప్రకృతి దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. వీటిని చూస్తే మనసుకు సంతోషం కలగడమే కాకుండా ప్రశాంతత కూడా లభిస్తుంది.

Jyothi Gadda
|

Updated on: Mar 10, 2023 | 5:41 PM

Share
 లడఖ్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఇలాంటి అనేక సరస్సులు ఉన్నాయి. అవి కనిపంచే నీలం రంగు కన్నులను కట్టిపడేస్తుంది. ఈ సరస్సు దృశ్యం ఎంతో అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం కూడా అలాంటి బ్లూ లేక్స్ పర్యటనకు వెల్దాం..

1 / 5
Crater Lake, Oregon: క్రేటర్ అమెరికాలో అతిపెద్ద సరస్సు.  దీని లోతు 1,943 అడుగులు, ప్రభుత్వం దాని చుట్టూ ఒరెగాన్ ఏకైక జాతీయ ఉద్యానవనాన్ని సృష్టించింది. ఈ సరస్సు లోతైన నీలం రంగుతో ప్రత్యేక ఆకర్షణగా పర్యాటకుల్ని మెస్మరైజ్‌ చేస్తుంది. సరస్సులో నీరు మంచు, వర్షం నుండి వస్తుంది.

2 / 5
Lake Baikal, Russia: రష్యాలోని బైకాల్ సరస్సు రంగు కూడా ముదురు నీలం రంగులో ఉంటుంది. ఈ సరస్సు లోతు 5,300 అడుగులు. అంతేకాదు..ఇది 400 మైళ్ల పొడవు ఉంటుంది. ఈ సరస్సులో 27 ద్వీపాలు, 1500 రకాల జీవ జాతులు కనిపిస్తాయి.

3 / 5
Lake Pukaki, New Zealand: చుట్టూ పెద్ద పెద్ద పర్వత శ్రేణులతో ఏర్పడింది పుకాకి సరస్సు. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగరంలో ఉంది. ఈ సరస్సు రంగు కూడా నీలం వర్ణంలోనే కనిపిస్తుంది. దీని కారణంగా దాని అందం మరింత పెరుగుతుంది. గ్లేసియల్ ఫ్లోర్ అని పిలువబడే పుకాకి సరస్సులో అనేక రకాల కణాలు కనిపిస్తాయి.

4 / 5
Torch Lake, Michigan: మిచిగాన్ టార్చ్ లేక్ 19 మైళ్ల పొడవు ఉంటుంది. హౌస్‌బోట్ యాత్రను ఆస్వాదించడానికి ప్రజలు ఇక్కడకు వస్తుంటారు.  టార్చ్ లేక్ దాని చుట్టుపక్కల వాతావరణం కంటే చాలా అందంగా కనిపిస్తుంది.

5 / 5