Toursit Places: కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్తున్నారా? ఈ అద్భుతమైన ప్రదేశాలు సందర్శించడం మర్చిపోకండి
చాలా మంది ప్రతి సంవత్సరం సెలవు రోజుల్లో కుటుంబం అంతా కలిసి ఏదైనా టూర్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. ఈ సమయంలో మీరు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు. మంచి మానసిక ఆరోగ్యానికి బిజీ..
Updated on: Mar 10, 2023 | 5:26 PM

చాలా మంది ప్రతి సంవత్సరం సెలవు రోజుల్లో కుటుంబం అంతా కలిసి ఏదైనా టూర్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. ఈ సమయంలో మీరు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు. మంచి మానసిక ఆరోగ్యానికి బిజీ షెడ్యూల్ నుంచి విరామం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీరు కొన్ని అద్భుతమైన ప్రదేశాల కోసం వెతుకుతున్నట్లయితే, మీరు ఇక్కడ కొన్ని అద్భుతమైన ప్రదేశాలను సూచిస్తున్నాము. ఇక్కడికి వెళ్లి మీరు ఎంతో ఆనందంగా గడపవచ్చు.

కేరళ - ఇక్కడి తేయాకు తోటలు మీ మనసును ఆకట్టుకుంటాయి. పర్వతాలు, బ్యాక్ వాటర్స్, ఆహ్లాదకరమైన వాతావరణం మీ మనసుకు విశ్రాంతినిస్తాయి. కేరళలో మీరు మున్నార్, తేక్కడి వంటి అనేక ప్రదేశాలకు సందర్శన కోసం వెళ్ళవచ్చు.

అండమాన్ మరియు నికోబార్ ద్వీపం - అండమాన్ - నికోబార్ చాలా ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. పచ్చని అడవుల్లో బీచ్‌లో నడవాలంటే ఉండే మజా వేరు. మీకు అడ్వెంచర్ యాక్టివిటీస్ అంటే ఇష్టం ఉంటే ఇక్కడ స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ కూడా చేయవచ్చు.

కాశ్మీర్‌ను భూమిపై స్వర్గం అంటారు. కాశ్మీర్ అందమైన దృశ్యాలు మీ మనసును ఆకర్షిస్తాయి. ఇక్కడ మీరు పడవ ప్రయాణం చేయవచ్చు. ఇది కాకుండా మీరు ఇక్కడ అనేక సాహస కార్యక్రమాలను కూడా ఆస్వాదించవచ్చు.

ఊటీ - మీరు ఊటీలో సందర్శనా కోసం కూడా వెళ్ళవచ్చు. పచ్చని అడవులు, మంత్రముగ్దులను చేసే టీ తోటలు, సహజ సరస్సులు, ఆహ్లాదకరమైన వాతావరణం మిమ్మల్ని ఆహ్లాదపరుస్తాయి. ఈ ప్రదేశంలో మీరు మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు.




