Telugu News » Photo gallery » To prevent calcium deficiency in your children, you should include these in your diet Telugu lifestyle News
మీ పిల్లల్లో కాల్షియం లోపం రాకుండా ఉండాలంటే, డైట్ లో వీటిని చేర్చాల్సిందే..
Madhavi | Edited By: Ravi Kiran
Updated on: Mar 11, 2023 | 7:45 AM
కాల్షియంలోపం అనేది కొన్ని కోట్లాది మంది పిల్లల్లో కనిపించే సాధారణ సమస్య. పిల్లల్లో కాల్షియం లోపం ఏర్పడటం వల్ల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ఎముకల సాంద్రత కూడా తగ్గుతుంది. ఎప్పుడూ కూడా నీరసంగా కనిపిస్తుంటారు.
Mar 11, 2023 | 7:45 AM
కాల్షియంలోపం అనేది కొన్ని కోట్లాది మంది పిల్లల్లో కనిపించే సాధారణ సమస్య. పిల్లల్లో కాల్షియం లోపం ఏర్పడటం వల్ల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ఎముకల సాంద్రత కూడా తగ్గుతుంది. ఎప్పుడూ కూడా నీరసంగా కనిపిస్తుంటారు. ఎన్నో సమస్యలు వారిలో తలెత్తుతాయి. అందుకే పిల్లల్లో ఏర్పడ్డ కాల్షియం లోపాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లల్లో కాల్షియం లోపం రాకుండా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలను వారి డైట్ లో చేర్చాల్సిందే.
1 / 10
సోయాబీన్స్ :
సోయాబీన్స్ లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో దాదాపు 100గ్రాములకు 250ఎంజీ కంటే ఎక్కువ కాల్షియం లభిస్తుంది. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది మొక్కల ఆధారిత ప్రొటీన్. అందుకే ఇతర ప్రొటీన్ల కంటే ఎక్కువ ప్రయోజనకరంగా పరిగణిస్తారు. పిల్లల్లో ప్రొటీన్స్ లోపాన్ని సోయా ఫుడ్స్ ద్వారా సులభంగా తీర్చవచ్చు.
2 / 10
పాలకూర:
పాలకూర కాల్షియం యొక్క గొప్ప మూలం. పాలకూరలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి, కే, పోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇవి చిన్నారుల ఎదుగుదలకు ఎంతగానో సహాయపడతాయి.
3 / 10
బ్రొకలి:
పిల్లలు బ్రొకలిని తినేందుకు అస్సలు ఆసక్తి చూపరు. కానీ బ్రొకలీలో ఎన్నో ఆరోగ్యకరమైన లక్షణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, కె, పొటాషియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది చిన్నారుల ఎదుగుదలకు సహాయపడుతుంది.
4 / 10
పెరుగు:
మీ బిడ్డ ఎదుగుదలకు పెరుగు చాలా అవసరం. పెరుగులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. మీ బిడ్డ రోజువారీ అవసరాలను తీర్చడానికి రోజుకో స్పూన్ పెరుగు తప్పకుండా తినిపించాలి. ఇందులో ఉండే కాల్షియం పిల్లలు ఎదుగుదలలో తోడ్పడుతుంది.
5 / 10
బాదం:
రాత్రి పడుకునే ముందు బాదం పప్పులు నానబెట్టాలి. వీటిని ఉదయాన్నే ఒక గుప్పెడు తీసుకుంటే ఎముకలకు, మెదడుకు ఎంతో మేలు చేస్తుంది. మీ చిన్నారులకు వీటిని క్రమం తప్పకుండా ఇచ్చేలా చూడండి.
6 / 10
చీజ్:
ఇంట్లో తయారుచేసిన చీజ్ పిల్లలకు ఆహారంలో ఇవ్వండి. ఈ పాల ఉత్పత్తిలో కేవలం కాల్షియం మాత్రమే కాకుండా ఇతర అనేక పోషకాలు ఉంటాయి. ఇవి పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పతాయి.
7 / 10
బీన్స్, కాయధాన్యాలు :
కాయధాన్యాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి పిల్లలను చురుకుగా ఉంచేలా చేస్తాయి. ప్రతిరోజూ వీటిని ఆహారంలో చేర్చినట్లయితే వారికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో సహాయపడతాయి.
8 / 10
చియా విత్తనాలు :
మీ పిల్లలకు చియా సీడ్ ఫుడ్డింగ్ ను అలవాటు చేయండి. వీటి ద్వారా కాల్షియం పొందవచ్చు.
9 / 10
గింజలు , విత్తనాలు :
వీటిని తినేందుకు పిల్లలు ఆసక్తి చూపిస్తారు. మీ పిల్లలకు అప్పడప్పుడు ఆహారంలో చేర్చడం మర్చిపోవద్దు. వారికి రుచితోపాటు పోషకాలన్నీ అందిస్తాయి.