Easy Kitchen Tips: పాలు పొంగిపోతున్నాయా.. కుక్కర్ శుభ్రం చేయడంలో ఇబ్బందులా ఈ సింపుల్ చిట్కాలు మీకోసం..

తాను వంట చేసే సమయంలో అరగంట పట్టే పనులు.. క్షణాల్లో జరిగిపోతే బాగుండును అని కోరుకుంటుంది. అయితే కొన్ని పనులు అనుకున్నట్లు జరగవు.. పాలు మరిగిస్తుంటే.. అవి పొంగిపోవడం, కుక్కర్ వినియోగం వంటి అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఈ సమస్యలకు కొన్ని సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టవచ్చు.

Easy Kitchen Tips: పాలు పొంగిపోతున్నాయా.. కుక్కర్ శుభ్రం చేయడంలో ఇబ్బందులా ఈ సింపుల్ చిట్కాలు మీకోసం..
Kitchen
Follow us
Surya Kala

|

Updated on: Mar 10, 2023 | 10:29 AM

దేశాన్ని ఏలే అధినేత మహిళ కూడా ఒక ఇంటికి ఇల్లాలే. ఓ వైపు విధులను నిర్వహిస్తూనే.. మరోవైపు ఇంటి ఇల్లాలుగా బాధ్యతగా ఉండడం ప్రతి మహిళకు ఇష్టమే. నేటి మహిళలు కాలంతో పోటీ పడుతూ.. తన వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ.. వంటింటి మహారాణులుగా రాణిస్తుంటారు. అయితే తన బహుపాత్రాభినయంలో సమయం అదా చేసుకోవడానికి ప్రతి మహిళ ఆసక్తిని చూపిస్తుంది. తాను వంట చేసే సమయంలో అరగంట పట్టే పనులు.. క్షణాల్లో జరిగిపోతే బాగుండును అని కోరుకుంటుంది. అయితే కొన్ని పనులు అనుకున్నట్లు జరగవు.. పాలు మరిగిస్తుంటే.. అవి పొంగిపోవడం, కుక్కర్ వినియోగం వంటి అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఈ సమస్యలకు కొన్ని సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. ఈ వంటింటి అద్భుతమైన టిప్స్ మీ సమస్యకు పరిష్కారం చూపించడమే కాదు.. సమయాన్ని ఆదా చేస్తాయి..

ప్రతి ఇంట్లోనూ రోజూ పాలను వినియోగిస్తారు. అసలు పాలుని ఉపయోగించని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. అయితే స్టవ్ మీద గిన్నెలో పాలుని పోసి వేడి చేస్తూ.. పాలు పొంగకుండా చూస్తూనే ఉంటారు. అయితే పాలు .. హఠాత్తుగా గిన్నె మీద నుంచి పొంగుతాయి. అలా పొంగిన పాలు పొయ్యి, కిచెన్ ప్లాట్‌ఫారమ్ నుంచి చుట్టుపక్కల ప్రాంతానికి చేరుకుంటాయి. అప్పుడు వంటగదిని శుభ్రం చేయాలంటే అత్యధిక శ్రమ పడాల్సిందే.  సమయం , శ్రమ వృద్ధా అనిపించకమానదు ఎవరికైనా.. అయితే ఇలా పాలు పొంగకుండా చేసే సింపుల్ చిట్కాలు మీ కోసం..

1.పాలు వేడి చేయడానికి ఎంచుకున్న పాత్రను తీసుకొని దాని అంచుల వద్ద కొద్దిగా నూనె రాయండి. ఇలా గిన్నె అంచులకు నూనె రాయడంతో పాలు ఎంత మరిగిన గిన్నె ఉపరితలం దాటకుండా చేస్తుంది. పాలు గిన్నె లోపల మాత్రమే మరుగుతాయి.

ఇవి కూడా చదవండి

2. ఇంట్లో చెక్క గరిటె ఉంటె.. ఆ చెక్క గరిటెను తీసుకుని పాలు మరిగించే గిన్నె మీద అడ్డంగా పెట్టండి. అప్పుడు పాలు మరిగిన అవి గిన్నె దాటి పొంగకుండా ఆ చెక్క గరిటె నిరోధిస్తుంది.

ప్రస్తుతం ప్రెజర్ కుక్కర్లు లేని వంట ఇంటి ఉందంటే అతిశయోక్తి కాదు. కుక్కలు అత్యంత ప్రజాదరణ పొందాయి  ప్రెషర్ కుక్కర్ లో పప్పు ఉడికించడం సులభం. అయితే పప్పు చేసిన అనంతరం ఆ కుక్కర్ ను శుభ్రం చేయడం కొంచెం శ్రమతో కూడుకున్న పని. కనుక కుక్కర్ లో పప్పు వండే ముందు ఇలా చేస్తే.. సులభంగా శుభ్రం చేయవచ్చు.

ముందుగా మీ కుక్కర్ మూత నుండి విజిల్ తొలగించండి. టిష్యూ పేపర్‌కు రంధ్రం చేసి బిలం పైపు ద్వారాలో పెట్టండి. అనంతరం విజిల్ తీసిన చోటి నుంచి వెనక్కి తీయండి. ఇలా చేయడం వలన టిష్యూ పేపర్ కుక్కర్ విజిల్ రంద్రం లోని అదనపు నీటిని పీలుస్తుంది. శుభ్రం చేయడం ఈజీ అవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..