Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suji Gulab Jamun Recipe: హొలీ, ఉమెన్స్ డే స్పెషల్.. సుజి రవ్వతో టేస్టీ టేస్టీ గులాబీ జామున్ రెసిపీ మీ కోసం..

ఎక్కువమంది బయట దొరికే ఇనిస్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తో త‌యారుచేస్తారు. కానీ సుజీ రవ్వతో కూడా రుచికరమైన గులాబ్ జామున్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని చాలా ఈజీగా రుచికరంగా తయారు చేసుకోవచ్చు.

Suji Gulab Jamun Recipe: హొలీ, ఉమెన్స్ డే స్పెషల్.. సుజి రవ్వతో టేస్టీ టేస్టీ గులాబీ జామున్ రెసిపీ మీ కోసం..
Suji Gulab Jamun
Follow us
Surya Kala

|

Updated on: Mar 07, 2023 | 7:21 PM

హిందువుల ముఖ్యమైన పండగల్లో ఒకటి హొలీ.. ఈ ఏడాది ఈ పండుగతో పాటు ఉమెన్స్ డే కూడా ఒకేసారి వచ్చాయి.  దీంతో తామే స్వయంగా రుచికరమైన స్వీట్ ను తయారు చేసి.. తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల నోటిని తీపి చేయాలనీ భావిస్తారు. అయితే ఓ వైపు పండగ హడావి.. తక్కువ సమయంలో రుచిగా ఈజీగా చేసుకునే స్వీట్ వైపు దృష్టి సారిస్తారు. వెంటనే గులాబ్ జామున్ ను చేస్తే బాగుటుంది అని అనుకుంటారు. అయితే  ఎక్కువమంది బయట దొరికే ఇనిస్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తో త‌యారుచేస్తారు. కానీ సుజీ రవ్వతో కూడా రుచికరమైన గులాబ్ జామున్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని చాలా ఈజీగా రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ఈరోజు ఉప్మా రవ్వ (సుజీ) గులాబ్ జామున్  త‌యారీ విధానం గురించి తెలుసుకుందాం.

త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు

బొంబాయి రవ్వ- ఒక కప్పు

ఇవి కూడా చదవండి

పాలు – 3 క‌ప్పులు

పాల పొడి – 2 టేబుల్ స్పూన్స్

పంచ‌దార – 2 క‌ప్పులు

నెయ్యి – ఒక స్పూన్

నూనె – వేయించడానికి సరిపడా

త‌యారీ విధానం: గులాబ్ జామున్ తయారీ కోసం ముందుగా పంచదార పాకం రెడీ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని స్టౌ మీద పెట్టి.. మూడు కప్పుల నీరు. రెండు కప్పుల పంచదార వేసి మరిగించాలి. పంచదార కరిగి జిగురుగా వచ్చే వరకూ వేడి చేసి.. తర్వాత స్టవ్ మీద నుంచి దించి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి.. ఉప్మా రవ్వ వేసి.. దోరగా వేయించాలి. తర్వాత ఒక గిన్నెలో తీసుకుని అదే బాణలిలో పాలు, పాలపొడి కొంచెం నెయ్యి వేసి కలిపి.. తర్వాత ఆ పాలను మరిగించాలి.. అనంతరం వేయించిన రవ్వ వేస్తూ కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాణలి కి అంటుకోకుండా ముద్ద అయ్యేవరకూ స్విమ్ లో కలుపుతూ ఉండాలి. అనంతరం ఈ మిశ్రమం ఒక ప్లేట్ లోకి తీసుకుని గోరు వెచ్చగా అయిన తర్వాత.. నెయ్యిని చేతికి రాసుకుని పిండిని తీసుకుని అందంగా గుండ్రంగా చిన్న చిన్న ఉండలు చుట్టుకోవాలి.

తర్వాత స్టవ్ వేలించి కళాయి పెట్టి.. వేయించడానికి సరిపడా నూనె వేసుకుని వేడి చేయాలి. నూనె వేడి ఎక్కిన అనంతరం.. రెడీ చేసుకున్న రవ్వ ఉండలను వేసి వేయించాలి. మీడియం మంట మీద వేయించి.. ఆ ఉండలు గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత.. ముందుగా రెడీ చేసిన పాకంలో వేసుకోవాలి. ఇవి పాకంలో నానిన తర్వాత సుజి ర‌వ్వ గులాబ్ జామున్ రెడీ. ఇవి రుచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తమన్నా సినిమాకు ప్రీమియర్లు లేవ్..
తమన్నా సినిమాకు ప్రీమియర్లు లేవ్..
జగన్నాథుడు దర్శనం తర్వాత భక్తులు మూడోమెట్టుపై అడుగుపెట్టరో తెలుసా
జగన్నాథుడు దర్శనం తర్వాత భక్తులు మూడోమెట్టుపై అడుగుపెట్టరో తెలుసా
జేఈఈ మెయిన్‌ 2025 తుది ర్యాంకుల విడుదల నేడే.. డైరెక్ట్ లింక్ ఇదే
జేఈఈ మెయిన్‌ 2025 తుది ర్యాంకుల విడుదల నేడే.. డైరెక్ట్ లింక్ ఇదే
వ్యక్తిగతంగా ఇబ్బందిపడుతున్నానన్న నజ్రియా.. రియాక్ట్ అయిన సమంత
వ్యక్తిగతంగా ఇబ్బందిపడుతున్నానన్న నజ్రియా.. రియాక్ట్ అయిన సమంత
టైమ్ మెషీన్ కావాలా నాయనా.. 1959లో 10 గ్రాములు బంగారం ధర ఎంతంటే..?
టైమ్ మెషీన్ కావాలా నాయనా.. 1959లో 10 గ్రాములు బంగారం ధర ఎంతంటే..?
ఛార్ ధామ్ యాత్రలో కేదార్‌నాథ్ డోలి యాత్ర ప్రాముఖ్యత ఏమిటో తెలుసా
ఛార్ ధామ్ యాత్రలో కేదార్‌నాథ్ డోలి యాత్ర ప్రాముఖ్యత ఏమిటో తెలుసా
నా ఫ్యామిలీ ప్రెజర్ చేస్తున్నారు..
నా ఫ్యామిలీ ప్రెజర్ చేస్తున్నారు..
నేడు, రేపు చిరుజల్లులు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!
నేడు, రేపు చిరుజల్లులు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!
పరుగులు తీస్తున్న పుత్తడి.. అదే బాటలో పయనిస్తున్న వెండి
పరుగులు తీస్తున్న పుత్తడి.. అదే బాటలో పయనిస్తున్న వెండి
ఏప్రిల్ 21లోగా బడిపిల్లలకు ప్రోగ్రెస్ కార్డులు..వేసవి సెలవుల తేదీ
ఏప్రిల్ 21లోగా బడిపిల్లలకు ప్రోగ్రెస్ కార్డులు..వేసవి సెలవుల తేదీ