AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour Package: వేసవి విడిదిగా ఈ ప్రాంతాలు బెస్ట్ ఎంపిక.. హ్యాపీ హిమాచల్ టూర్ ప్యాకేజీ వివరాలు మీకోసం

అందమైన పర్యాటనకు తిరుగులేని ఆకర్షణ హిమాచల్ ప్రదేశ్‌లోని లోయలు, పర్వతాలు, హిమపాతం. ప్యాకేజీ మీ ప్రాధాన్యతలను బట్టి ప్రామాణిక, డీలక్స్ హోటల్ వసతి రెండింటినీ అందిస్తుంది. ఈ ప్యాకేజీలో భాగంగా ఆరు రోజుల పాటు బ్రేక్‌ఫాస్ట్‌లను, ఆరు రాత్రులు పసందైన విందును ఆస్వాదించవచ్చు.

IRCTC Tour Package: వేసవి విడిదిగా ఈ ప్రాంతాలు బెస్ట్ ఎంపిక.. హ్యాపీ హిమాచల్ టూర్ ప్యాకేజీ వివరాలు మీకోసం
Happy Himachal Tour
Surya Kala
|

Updated on: Mar 02, 2023 | 9:28 AM

Share

వేసవి వినోదంగా అందమైన ఆహ్లదకరమైన ప్రదేశాలకు వెళ్లాలనుకునే పర్యాటకులకు ఐఆర్ సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హిమగిరి సొగసులతో అలరారే హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించాలనుకునే పర్యాటకుల కోసం IRCTC హ్యాపీ హిమాచల్ ప్యాకేజీతో టూర్ ని అందిస్తోంది. ఈ టూర్ లో భాగంగా సిమ్లా, మనాలి, చండీగఢ్ తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. హ్యాపీ హిమాచల్ టూర్ ప్యాకేజీ  ఆరు రాత్రులు .. ఏడు పగళ్లు ఉండనుంది. మొత్తం ఏడు రోజుల పాటు ఈ పర్యటనను ఆస్వాదించవచ్చు.

ఈ అందమైన పర్యాటనకు తిరుగులేని ఆకర్షణ హిమాచల్ ప్రదేశ్‌లోని లోయలు, పర్వతాలు, హిమపాతం. ప్యాకేజీ మీ ప్రాధాన్యతలను బట్టి ప్రామాణిక, డీలక్స్ హోటల్ వసతి రెండింటినీ అందిస్తుంది. ఈ ప్యాకేజీలో భాగంగా ఆరు రోజుల పాటు బ్రేక్‌ఫాస్ట్‌లను, ఆరు రాత్రులు పసందైన విందును ఆస్వాదించవచ్చు. ఆయా ప్రాంతాల్లో పర్యటించే ప్రయాణీకుల కోసం AC టెంపోలను అందుబాటులో ఉంచనుంది. వీటిల్లో ప్రయాణం చేయవచ్చు. ఇక ప్యాకేజీలో భాగంగా ప్రయాణ బీమా సౌకర్యం కూడా అందుబాటులో ఉంచింది IRCTC.

ఇవి కూడా చదవండి

టూర్ ప్యాకేజీ ధరలు: 

ప్రయాణిస్తున్న వ్యక్తుల సంఖ్యను బట్టి ప్యాకేజీ ధర మారుతుంది. పిల్లలకు ప్రత్యేక రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

సింగిల్ పర్సన్ రూ.58,550,

ఇద్దరు వ్యక్తులు రూ.44,200,

ముగ్గురు వ్యక్తులు రూ.42,300 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 5-11 ఏళ్లలోపు పిల్లలకు బెడ్‌తో రూ.36,300, బెడ్ లేకుండా రూ.35,200, 2-4 ఏళ్లలోపు పిల్లలకు రూ.27,400లుగా నిర్ణయించారు.

IRCTC ఈ టూర్ ప్యాకేజీ గురించి ట్వీట్ చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన ప్రదేశాలను సందర్శించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పర్యాటకులను కోరింది. ఈ టూర్ ప్యాకేజీని అధికారిక IRCTC వెబ్‌సైట్ ద్వారా లేదా వారి టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ ఆఫీసులు , ప్రాంతీయ కార్యాలయాల ద్వారా ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం, IRCTC వెబ్‌సైట్‌ని సందర్శించండి.

హ్యాపీ హిమాచల్ ప్యాకేజీ అనేది హిమాచల్ ప్రదేశ్ అందాలను అన్వేషించడానికి మీకు ఒక అద్భుతమైన అవకాశం. IRCTC ప్యాకేజీలో హోటల్ బసలు, భోజనం, ప్రయాణం , బీమా సదుపాయాలున్నాయి. ఇది ప్రయాణికులకు సమగ్రమైన , అనుకూలమైన ఎంపిక. IRCTC హ్యాపీ హిమాచల్ ప్యాకేజీతో హిమాచల్ ప్రదేశ్లోని అద్భుతాలను వీక్షించే ఈ అవకాశాన్ని మిస్ చేయకండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..