IRCTC Tour: అందమైన లడఖ్‌ను సందర్శించాలనుకుంటున్నారా.. IRCTC సరికొత్త టూర్ ప్యాకేజీ..పూర్తి వివరాలు మీకోసం

ప్యాకేజీలో లడఖ్ లోని అందమైన దృశ్యాలు చూడవచ్చు. అంతేకాదు సాహసాలు ఇష్టపడేవారికి ట్రెక్కింగ్ , సాంస్కృతిక కార్యక్రమాలు, సాహస క్రీడల వరకు అనేక రకాల కార్యకలాపాలను చూడవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ వివరాల్లోకి వెళ్తే.. 

IRCTC Tour: అందమైన లడఖ్‌ను సందర్శించాలనుకుంటున్నారా..  IRCTC సరికొత్త టూర్ ప్యాకేజీ..పూర్తి వివరాలు మీకోసం
Leh Ladakh Travel
Follow us

|

Updated on: Mar 09, 2023 | 9:33 AM

వేసవిలో అందమైన ప్రకృతిలో ఒడిలో సేదదీరాలనుకుంటున్నారా.. అయితే ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. భారతదేశంలోని అత్యంత అద్భుతమైన, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన లేహ్-లడఖ్‌కు IRCTC టూరిజం కొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ పర్యటన ఆరు రాత్రులు, ఏడు పగళ్ల పాటు కొనసాగనుంది. ఈ ప్యాకేజీలో లడఖ్ లోని అందమైన దృశ్యాలు చూడవచ్చు. అంతేకాదు సాహసాలు ఇష్టపడేవారికి ట్రెక్కింగ్ , సాంస్కృతిక కార్యక్రమాలు, సాహస క్రీడల వరకు అనేక రకాల కార్యకలాపాలను చూడవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ వివరాల్లోకి వెళ్తే..

IRCTC టూరిజం కొత్త టూర్ ప్యాకేజీ మే 4న హైదరాబాద్ నుంచి ప్రారంభమవుంటుంది. ముందుగా ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రమానికి చేరుకోవాలి. ఇక్కడ నుంచి లేహ్‌కు వెళ్లే విమానంలో  పర్యటన ప్రారంభమవుతుంది. లెహ్ కు చేరుకున్న తర్వాత.. ప్రయాణీకులు హోటల్‌లో బస చేస్తారు. ఇక్కడ విశ్రాంతి తీసుకున్న తర్వాత అందమైన ఎత్తైన ప్రదేశాలు,  ప్రకృతికి అలవాటు పడటానికి సమయం ఉంటుంది.

లేహ్ లోని చుట్టూ ఉన్న పర్వతాలు, లోయలలోని అందమైన దృశ్యాలు, అందమైన తెల్లని గోపురం గల బౌద్ధ స్థూపం, శాంతి స్థూపాన్ని సందర్శించడంతో పర్యటన ఉత్సాహంగా ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ పర్యటనలో భాగంగా లేహ్-లడఖ్ ప్రాంతంలోని పురాతన ఆశ్రమాలైన హేమిస్, థిక్సే, షేలతో సహా అనేక ఇతర అందమైన ప్రదేశాలను దర్శించవచ్చు.  ఇవన్నీ అద్భుతమైన వాస్తుశిల్పం, సాంస్కృతిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందాయి.

నుబ్రా లోయ, పాంగోంగ్ సరస్సు , ఖర్దుంగ్లా పాస్‌ల సందర్శనలతో ఈ ప్రాంతం సహజ సౌందర్యాన్ని చూస్తూ.. ప్రకృతిని ఆస్వాదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. యాత్రికులు రివర్ రాఫ్టింగ్, ఒంటె రైడింగ్ , ATV రైడ్‌లు వంటి సాహస క్రీడలలో పాల్గొనే అవకాశం ఉంది. వీటితో పాటు.. లేహ్-లడఖ్ చుట్టూ ఉన్న అందమైన లోయలు, పర్వతాల్లో ట్రెక్కింగ్ చేయవచ్చు. టూర్ ప్యాకేజీలో అన్ని రిటర్న్ విమాన ఛార్జీలు, వసతి, భోజనం, సైట్ సీయింగ్ ధరలు అన్నీ కలిసి ఉన్నాయి.

టూర్ ప్యాకేజీ ధరలు: 

టూర్ ప్యాకేజీ ధర ఒక్కొక్కకి అయితే రూ. 54,500

ఇద్దరుకు టూర్ ప్యాకేజీ ధర: రూ. 47,830

5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు టూర్ ప్యాకేజీని రూ. 45, 575

2 నుంచి 4 ఏళ్ల పిల్లలు కలవారికి టూర్ ప్యాకేజీ ధర రూ. 41,750

0-2 సంవత్సరాల వయస్సు గల పిల్లల ఛార్జీ బుకింగ్ సమయంలో IRCTC కార్యాలయంలో కస్టమర్స్ నగదు రూపంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. Download Package Details మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!