Purnam Boorelu: ఉగాది స్పెషల్ .. ఆంధ్రా స్టైల్‌లో టేస్టీ పూర్ణం బూరెలు.. ఈజీ రెసిపీ మీకోసం

అందరికీ ఇష్టమే.. అయితే తయారు చేసుకోవడం కొందరి కష్టం.. త‌యారీ విధానం అంద‌రికీ తెలిసిన‌ప్ప‌టికీ కొంద‌రు వీటిని ఎంత ప్ర‌య‌త్నించినా చ‌క్క‌గా, రుచిగా త‌యారు చేసుకోలేక పోతుంటారు.ఈ రోజు ఉగాది సందర్భంగా టేస్టీ టేస్టీ పూర్ణం బూరెల‌ తయారు గురించి తెలుసుకుందా.. 

Purnam Boorelu: ఉగాది స్పెషల్ .. ఆంధ్రా స్టైల్‌లో టేస్టీ పూర్ణం బూరెలు.. ఈజీ రెసిపీ మీకోసం
Poornam Boorelu
Follow us
Surya Kala

|

Updated on: Mar 22, 2023 | 11:21 AM

పండగలు, శుభకార్యాలు ఏమైనా సరే భోజన ప్రియుల దృష్టి బూరెల వైపే ఉంటుంది. ఇప్పటి తరంలో చాలామందికి ఈ పూర్ణం బూరెలను తయారు చేయడం రాదు.. కానీ ఒకప్పుడు ఈ పూర్ణం బూరెలు లేకుండా ఎటువంటి పండగ, ఫంక్షన్ పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. అందరికీ ఇష్టమే.. అయితే తయారు చేసుకోవడం కొందరి కష్టం.. త‌యారీ విధానం అంద‌రికీ తెలిసిన‌ప్ప‌టికీ కొంద‌రు వీటిని ఎంత ప్ర‌య‌త్నించినా చ‌క్క‌గా, రుచిగా త‌యారు చేసుకోలేక పోతుంటారు.ఈ రోజు ఉగాది సందర్భంగా టేస్టీ టేస్టీ పూర్ణం బూరెల‌ తయారు గురించి తెలుసుకుందా..

త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

మినపప్పు – ఒక కప్పు

ఇవి కూడా చదవండి

బియ్యం -పావు కప్పు

శనగపప్పు – ఒక కప్పు

బెల్లం తురుము – ఒక కప్పు

యాలకుల పొడి – కొంచెం

వంట సోడా – కొంచెం

ఉప్పు- ఒక టీ స్పూన్

నెయ్యి- కొంచెం

నూనె – వేయించడానికి సరిపడా

నీరు- రెండు కప్పులు

తయారీ విధానం: 

బూరె తోపు కి రెడీ చేసుకోవడానికి.. ముందుగా మినపప్పు , బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి వేర్వేరుగా నానబెట్టాలి. సుమారు 5 గంటల తర్వాత మినపప్పు, బియ్యం వేసి మిక్సీ వేసుకోవాలి. నీరు పోయకుండా కొంచెం గట్టిగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి.

పూర్ణం కోసం .. ఒక గిన్నె తీసుకుని శుభ్రం చేసుకున్న శనగ పప్పును వేసుకుని బాగా కడగాలి. తర్వాత కొంచెం నీరు పోసి నానబెట్టుకోవాలి. ఒక గంట తర్వాత నానిన శంగపప్పుని కుక్కర్ లో వేసి 5 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. తర్వాత శనగపప్పుని నీరు లేకుండా వడకట్టుకుని వేరే గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు ఆ శనగపప్పుని పప్పుగుత్తెతో మెత్తగా మెదుపుకోవాలి. అందులో తగిన బెల్లం వేసి.. గ్యాస్ స్టౌ మీద పెట్టి.. స్విమ్ లో వేడి చేస్తూ.. బెల్లం కరిగి.. ముద్ద అయ్యేవరకూ కలుపుతూ ఉండండి..

నీరు లేకుండా శనగపప్పు, బెల్లం మిశ్రమం గట్టి పడేవరకూ ఉడికించి కొంచెం నెయ్యి, యాలకుల పొడి వేసి స్టౌ మీద నుంచి దింపేసుకోవాలి. పూర్ణం చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి.. అప్పుడు కావలిసిన సైజ్ లో ఉండలు గా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.

బూరెలు .. ఇప్పుడు తోపు కోసం రెడీ చేసుకున్న మినపప్పు, బియ్యం పిండి ని తీసుకుని బాగా కలుపుకుని.. కొంచెం వంట సోడా, ఉప్పు వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు క‌ళాయి తీసుకుని స్టౌ మీద పెట్టి.. వేయించడానికి సరిపడా నూనెను తీసుకుని మాదిరిగా వేడి చేయాలి. ఇప్పడూశనగ పిండి పూర్ణం ఉండలు ఒకొక్కటి తీసుకుని మినపప్పు తోపులో వేసి.. ఉండగా తీసుకోవాలి.. వీటిని వేడెక్కిన నూనె వేసుకోవాలి. ఇలా కొన్ని వేసుకున్న తర్వాత.. మీడియం మంటపై వేయించండి.. ఎర్రగా వేగిన తర్వాత ఒక టిష్యు పేపర్ వేసిన గిన్నెలోకి తీసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ శనగపప్పు పూర్ణం బూరెలు రెడీ.. వీటిలో రంద్రం చేసి.. కొంచెం నెయ్యి వేసుకుని తింటే.. ఆహా ఏమి రుచి అని అనాల్సిందే..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.