Ramadan 2023: రంజాన్ స్పెషల్ .. వెర్మిసెల్లీ ఖీర్‌ను ట్రై చేయండి.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం

సెహ్రీ, ఇఫ్తార్‌లలో వెర్మిసెల్లీ ఖీర్ ను చేర్చుకోవచ్చు. ఆరోగ్యకరమైన వెర్మిసెల్లీ ఖీర్ రెసిపీ ఇక్కడ ఉంది. మీరు కూడా రంజాన్‌ మాసంలో ఈ వెర్మిసెల్లిని తప్పకుండా ప్రయత్నించండి. ఇది మీకు శక్తిని అందిస్తుంది.

Ramadan 2023: రంజాన్ స్పెషల్ .. వెర్మిసెల్లీ ఖీర్‌ను ట్రై చేయండి.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం
Vermicelli Kheer
Follow us

|

Updated on: Mar 24, 2023 | 10:03 AM

నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం మొదలైంది. ముస్లింలు ఈ మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో ఉపవాసం దీక్షను చేస్తే.. తమ ప్రార్ధనలు  అల్లా స్వీకరిస్తాడని నమ్మకం. ఉపవాస సమయంలో ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితిలో సెహ్రీ, ఇఫ్తార్ల సమయంలో పోషకాహారాన్ని చేర్చుకోవాల్సి ఉంది. సెహ్రీ, ఇఫ్తార్‌లలో వెర్మిసెల్లీ ఖీర్ ను చేర్చుకోవచ్చు. ఆరోగ్యకరమైన వెర్మిసెల్లీ ఖీర్ రెసిపీ ఇక్కడ ఉంది. మీరు కూడా రంజాన్‌ మాసంలో ఈ వెర్మిసెల్లిని తప్పకుండా ప్రయత్నించండి. ఇది మీకు శక్తిని అందిస్తుంది. ఆరోగ్యకరమైన వెర్మిసెల్లి ఖీర్‌ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

వెర్మిసెల్లి ఖీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్ధాలు:

పాలు-ఒక లీటరు

ఇవి కూడా చదవండి

వెర్మిసెల్లి-1/2 కప్పు

ఖర్జూరాలు-1 కప్పు

యాలకుల పొడి-అర టీస్పూన్

నెయ్యి-3 టేబుల్ స్పూన్లు

వెన్న-4 టేబుల్ స్పూన్లు

పిస్తా-1/4 కప్పు

జీడిపప్పు-1/4 కప్పు

బాదం-1/4 కప్పు

ఎండుద్రాక్ష-3 టేబుల్ స్పూన్లు

రోజ్ వాటర్-1 టీస్పూన్

కుంకుమపువ్వు-3 నుండి 4 రేకులు

వెర్మిసెల్లి ఖీర్ తయారీ విధానం: ముందుగా స్టౌ వెలిగించి పాన్‌ పెట్టండి. వేడి ఎక్కిన తర్వాత 1 టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. అందులో కొంచెం వెర్మిసెల్లీని వేసి దోరగా వేయించాలి.  అనంతరం సేమ్యాను ఒక ప్లేట్‌లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాణలిలో నెయ్యి వేయాలి.  ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ,  ఎండుద్రాక్ష వేసి వీటిని వేయించాలి. ఆ తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అప్పుడు వాటిని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని ఖర్జురాలను తీసుకోండి. వాటి విత్తనాలను తీసి.. వేడి నీటిలో వేసి కొద్దీ సమయం ఉంచండి. తరువాత ఈ ఖర్జూరాలను పేస్ట్ చేసుకోండి.

ఇప్పుడు ఒక దళసరి గిన్నె స్టౌ మీద పెట్టి అందులో పాలు వేసి వేడి చేయండి. ఈ పాలు సగానికి తగ్గే వరకు వేడి చేయండి. గిన్నెకు అంటుకోకుండా ఒక గరిటెతో కలుపుతూ ఉండండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయండి.. ఆ పాలల్లో వేయించిన సేమ్యా, రోజ్ వాటర్, ఖర్జూరం పేస్ట్ ..  తాజా వెన్నె జోడించండి.

ఇప్పుడు మళ్ళీ గ్యాస్ వెలిగించి పాలు స్టౌ మీద పెట్టి.. వేడి చేసి.. అందులో డ్రై ఫ్రూట్స్ ,. యాలకుల పొడి , కుంకుమపువ్వు ను  జోడించండి. చిక్కగా అయ్యే వరకు ఉడికించండి. అంతే టేస్టీ టేస్టీ ఖీర్ రెడీ..  డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసిన తర్వాత సర్వ్ చేయాలి.   సెహ్రీ లేదా ఇఫ్తార్ సమయంలో వేడి వేడి ఖీర్ వడ్డించవచ్చు. ఇందులో ఉపయోగించే డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉపవాస దీక్ష సమయంలో శక్తిని అందిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..