Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Health: పీరియడ్స్‌ నొప్పి భరించలేకపోతున్నారా..? ఈ చిట్కాలతో చక్కటి రిలీఫ్‌..!

మిశ్రమాన్ని మీడియంలో వేడి చేసి మంచి వాసన వచ్చే వరకు మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి అందులో తేనె కలిపి తాగాలి. ఇది మీ శరీరానికి విశ్రాంతినిస్తుంది.

Women's Health: పీరియడ్స్‌ నొప్పి భరించలేకపోతున్నారా..? ఈ చిట్కాలతో చక్కటి రిలీఫ్‌..!
Relieving Periods Pain
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 23, 2023 | 10:18 PM

చాలా మంది మహిళలు బహిష్టు సమయంలో వెన్నునొప్పి, కడుపు నొప్పి, కాళ్ల తిమ్మిరితో బాధపడుతుంటారు. రుతుక్రమం వల్ల కనీసం ఐదు రోజులపాటు బలహీనంగా మారిపోతారు. కాబట్టి, మీ శరీరానికి ఏదైనా ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యం. ఈ కాలంలో ఏం తాగాలి. ఏం తినాలనే గందరగోళం చాలామందిలో ఉంటుంది. భయపడకండి, ఋతు నొప్పిని తగ్గించే 5 పానీయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. ఈ పానీయాలు తాగడం ద్వారా రుతు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

చామంతి పూలతో తయారుచేసే టీ మంచి సువాసనతో పూల రుచిని కలిగి ఉంటుంది. చామంతి టీ పలు అనారోగ్య సమస్యలకు ఔషధంగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. టీ బ్రూ హిప్యూరేట్, గ్లైసెమిక్ వంటి సమ్మేళనాలతో నిండి ఉంటుంది. ఇది కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే బహిష్టు సమయంలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది.

అల్లం టీ: ఒక కప్పు స్పైసీ అల్లం టీతో రుతుక్రమంలో వచ్చే నొప్పికి వీడ్కోలు చెప్పండి. అల్లం ఒక సహజ శోథ నిరోధకంగా, నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. బహిష్టు సమయంలో త్రాగడానికి ఇది అనువైన పానీయం. మరిగే నీటిలో కొన్ని సన్నని అల్లం ముక్కలను వేసి 5 నిమిషాలు మరిగించి ఆ తర్వాత వేడి వేడిగా తాగండి.

ఇవి కూడా చదవండి

గ్రీన్ స్మూతీస్: కొన్ని కివీ పండు, కొత్తిమీర, తాజా పుదీనా ఆకులు, కొన్ని అల్లం ముక్కలను కలుపుకుని స్మూతీని తయారు చేసుకోవాలి. ఇది మీకు ఋతు తిమ్మిరి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

పిప్పరమింట్ టీ: పిప్పరమింట్ టీతో ఋతు తిమ్మిరి నుండి ఉపశమనం పొందవచ్చు. పుదీనా టీ తయారు చేయడానికి తాజా పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించుకోవాలి. బహిష్టు సమయంలో వేడి వేడిగా తాగడం వల్ల నొప్పిని ఉపశమనం కలుగుతుంది. పిప్పరమింట్ టీ ఒత్తిడి, అలసటను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

దాల్చిన చెక్క టీ: దాల్చిన చెక్క అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే మసాలా టీ. ఇది ఋతుస్రావం సమయంలో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. నీటిలో ఒక దాల్చిన చెక్క, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి, మిశ్రమాన్ని మీడియంలో వేడి చేసి మంచి వాసన వచ్చే వరకు మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి అందులో తేనె కలిపి తాగాలి. ఇది మీ శరీరానికి విశ్రాంతినిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ..