Viral News: గుర్రు పెట్టి నిద్రపోయిన మహిళ.. పొద్దున్నే నిద్ర లేచి పక్కలో చూస్తే గుండె గుభేల్

ఒక మహిళ తన మంచం మీద ఆరు అడుగుల పొడవైన విషపూరిత పామును చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆ పాము చూసేందుకు.. భారీ పొడవుతో గోధుమరంగులో కనిపించిందని మహిళ వాపోయింది. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించింది. అయితే,

Viral News: గుర్రు పెట్టి నిద్రపోయిన మహిళ.. పొద్దున్నే నిద్ర లేచి పక్కలో చూస్తే గుండె గుభేల్
Eastern Brown Snake
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 23, 2023 | 5:57 PM

రాత్రంతా హాయిగా నిద్రపోయి తెల్లవారుజామున బెడ్‌షీట్లు తీస్తుండగా పాము కనపడితే ఎలా ఉంటుంది..? కానీ, ఒక చోట మాత్రం అచ్చం అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఉదయం నిద్రలేచిన ఆ ఇంటివారు దుప్పట్లు మడతపెడుతుండగా భారీ విష సర్పం ప్రత్యక్షమైంది. దాంతో ఒక్కసారిగా వారు ఉలిక్కిపడ్డారు. ఈ షాకింగ్‌ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఒక మహిళ ఉదయం నిద్ర లేచి బెడ్‌షీట్ తీస్తుండగా తన మంచంలో 6 అడుగుల పొడవైన విషపూరిత పాము కనిపించింది. పాము కనిపించగానే భయంతో అరుస్తూ ఇంట్లోంచి బయటకు పరుగులుతీసింది మహిళ.

క్వీన్స్‌లాండ్‌కు చెందిన ఒక మహిళ తన మంచం మీద ఆరు అడుగుల పొడవైన విషపూరిత పామును చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆ పాము చూసేందుకు.. భారీ పొడవుతో గోధుమరంగులో కనిపించిందని మహిళ వాపోయింది. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించింది. అయితే, రాత్రంతా ఆ పాము అక్కడే ఉందా అనేది ఇప్పుడు ఆ మహిళకున్న పెద్ద సందేహం.

స్నాక్ క్యాచర్ జాకరీ రిచర్డ్ వెంటనే ఆమె ఇంటికి చేరుకున్నారు. అప్పటికీ అక్కడే మంచంపైనే ఉన్న పామును బందించాడు. సురక్షితంగా దాన్ని సమీప అడవిలో విడిచిపెట్టాడు. అయితే, బయటవాతావరణంలో అధికవేడి కారణంగా ఇంట్లోకి ప్రవేశించి ఉండొచ్చునని, బెడ్‌రూమ్‌ చల్లగా ఉండటంతో అది అక్కడే హాయిగా పడుకుని ఉంటుందని స్నేక్‌ చెప్పాడు. పామును పట్టుకున్న తర్వాత, రిచర్డ్ దానిని సురక్షితమైన ప్రాంతంలో సమీప ఇళ్లకు దూరంగా పొదలోకి వదిలాడు. అయితే, పట్టుబడిన పాము తూర్పు బ్రౌన్ ప్రపంచంలో రెండవ అత్యంత విషపూరితమైన పాముగా చెప్పాడు. దీని విషంలో శక్తివంతమైన న్యూరోటాక్సిన్ ఉంటుంది. ఈ పాము ఎవరినైనా కాటేస్తే, దాని విషం గుండె, ఊపిరితిత్తులను స్తంభింపజేస్తుంది. దాంతో ఆ వ్యక్తి ఊపిరాడక మరణిస్తాడు. ఆస్ట్రేలియాలో పాము కాటు వల్ల అత్యధిక మరణాలు సంభవించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు