AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రపంచంలోనే అతిపెద్ద అరటిపండు..! పసిబిడ్డ బరువుతో గిన్నిస్‌ రికార్డ్‌..!!

ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అరటిపండు. ఈ పండు దాదాపు ఒక పసిబిడ్డ బరువుంది. ఏ ఒక్కరూ ఈ అరటిపండును పూర్తిగా తినటం వారి సామర్థ్యానికి మించినదే అవుతుంది. అయితే,..

Viral Video: ప్రపంచంలోనే అతిపెద్ద అరటిపండు..! పసిబిడ్డ బరువుతో గిన్నిస్‌ రికార్డ్‌..!!
Worlds Biggest Banana
Jyothi Gadda
|

Updated on: Mar 23, 2023 | 5:40 PM

Share

Viral Video: శరీరానికి తక్షణ శక్తినిచ్చే ఆరోగ్యకరమైన పండ్లలో అతి ముఖ్యమైనది అరటిపండు అని మనందరికీ తెలిసిందే. అలాంటి ఒక అరటిపండు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అరటిపండును చూసి మీరు కూడా ఒక్క క్షణంకు గురవుతారు. ఎందుకంటే ఒక మనిషి ఈ మొత్తం అరటిపండును తినలేడు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అరటిపండు. ఈ పండు దాదాపు ఒక పసిబిడ్డ బరువుంది. ఏ ఒక్కరూ ఈ అరటిపండును పూర్తిగా తినటం వారి సామర్థ్యానికి మించినదే అవుతుంది. అయితే, ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ భారీ అరటిపండు గురించి తెలుసుకోండి..

మనక్ గుప్తా అనే వినియోగదారు ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఇది చిన్న పిల్లల బరువుతో సమానంగా ఉందని చెప్పారు. వీడియోలో ఈ భారీ అరటిపండును చేతిలో పట్టుకుని తినడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఒక వ్యక్తి పూర్తిగా తినడం సాధ్యం కాదు. ఈ వీడియో ఆస్ట్రేలియన్ ద్వీపం పాపువా న్యూ గినియాలోని కొన్ని ప్రాంతాలను చూపిస్తుంది. అక్కడ ఈ రకమైన అరటి మొక్కను పెంచుతారు. దాని నుండి వచ్చే అరటి పండ్లు ఒక మూర పొడవు ఉంటాయి. ప్రస్తుతం ఈ భారీ అరటిపండు గిన్నిస్ బుక్‌లో నమోదైంది.

ఇవి కూడా చదవండి

న్యూ పాపువా గినియాకు చెందిన ఈ అరటి మొక్కలను ప్రపంచంలోనే అతిపెద్ద అరటి మొక్కగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నమోదు చేసింది. ఈ మొక్క నుండి వచ్చే అరటి బరువు సుమారు 3 కిలోలు. ఇది నవజాత శిశువుతో సమానం. అయితే, ఈ పండు పండడానికి 5 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి పెద్దగా వ్యాపారం లేదు. ఈ మొక్క ట్రంక్ 15 మీటర్ల ఎత్తు ఉంటుందని, ఆకులు కూడా భూమి నుండి 20 మీటర్ల ఎత్తులో ఉన్నాయని చెబుతారు.

అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద అరటిపండుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ 38 సెకన్ల వీడియోను 88 వేలకు పైగా వీక్షించారు. అయ్యబాబోయ్‌ ఇంతపెద్ద అరటిపండా అని కొందరు నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్ పెట్టారు. 5 ఏళ్లలో పండే ఈ అరటిపండు తినడానికి కనీసం 5 రోజులు పడుతుందంటూ మరో వినియోగదారు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Horoscope Today: వారికి ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బంది ఉండదు..
Horoscope Today: వారికి ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బంది ఉండదు..
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!