Skinskin care: మెరిసే చర్మం కోసం టమాటా ప్యాక్‌ని ట్రై చేయండి… అద్భుతం చూస్తారు..! కానీ, బీకేర్ ఫుల్..!!

నిమ్మరసం, టమాటా కలిపి పెదవులపై రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదాలు గులాబీ రంగులోకి మారటమే కాకుండా మెరిసిపోతాయి. అయితే, టమాటాలను చర్మానికి ఉపయోగించేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.

Skinskin care: మెరిసే చర్మం కోసం టమాటా ప్యాక్‌ని ట్రై చేయండి... అద్భుతం చూస్తారు..! కానీ, బీకేర్ ఫుల్..!!
Tomato On Skin
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 22, 2023 | 8:27 PM

టమాటాలను అందరూ ఇష్టపడతారు. టమాటాలను ప్రతి ఇంట్లోనూ కూరలు, సలాడ్లలో ఉపయోగిస్తారు. కొద్దిగా తీపి, పుల్లని రుచి కలిగిన టమాటాలు అందరికీ ఇష్టమైనవి. టమాటాలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్లు, మినరల్స్, ఐరన్, కాల్షియం, పొటాషియం, క్రోమియం మొదలైన వాటిని కలిగి ఉన్న టమాటాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ, మీకు తెలుసా? టమాటా సౌందర్య సంరక్షణకు కూడా మంచివి. టమాటాలు చర్మానికి చాలా మేలు చేస్తాయి. అనేక చర్మ సమస్యలను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. టమాటాలను చర్మానికి ఎలా ఉపయోగించాలో..? దాని ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

1. చర్మం సహజమైన మెరుపును పొందడానికి టమాటాలను ఉపయోగించవచ్చు. టమాటాలను సన్నగా పేస్ట్‌గా చేసుకోవాలి. తయారు చేసిన టమాటా పేస్ట్‌ను చర్మంపై అప్లై చేసుకోండి. 15-20 నిమిషాల తర్వాత కడగాలి. కానీ, మీ చర్మం చాలా సున్నితంగా ఉంటే, కొన్నిసార్లు మీరు ఒక రకమైన అలెర్జీ లేదా అసౌకర్యాన్ని అనుభవిస్తారు. అలా ఉంటే, వెంటనే దానిని కడిగేయండి.

2. పెదాలపై పొడిబారిన చర్మాన్ని తొలగించేందుకు టమాటా మంచిది. నిమ్మరసం, టమాటా కలిపి పెదవులపై రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదాలు గులాబీ రంగులోకి మారటమే కాకుండా మెరిసిపోతాయి.

ఇవి కూడా చదవండి

3. చర్మపు మచ్చలను తొలగించే టమాటాలు: చర్మపు మచ్చలను తొలగించడంలో టమాటాలు సహకరిస్తాయి. టమాటా ,అలోవెరా జెల్ మిశ్రమాన్ని మచ్చలపై అప్లై చేయండి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా నిరంతరం చేస్తుంటే చర్మంపై మచ్చలు పోయి అందంగా తయారవుతాయి.

4. కళ్ల కింద నల్లటి మచ్చలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంటే, దానికి కూడా పరిష్కారం చిన్న టమాటాతో సరిపోతుంది. అంటే, నల్లమచ్చల మీద కొంచెం టమాటా రసాన్ని ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా రోజూ చేయడం వల్ల చర్మంపై ఉన్న నల్లటి మచ్చలు తొలగిపోతాయి.

అయితే, టమాటాలను చర్మానికి ఉపయోగించేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మీకు ఏదైనా అసౌకర్యం అనిపిస్తే, వెంటనే టమోటా పేస్ట్‌ను కడగాలి. ఎందుకంటే నిపుణుల అభిప్రాయం ప్రకారం, టమోటాలు సున్నితమైన చర్మానికి హాని కలిగిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!