AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్పైడర్‌మ్యాన్ దోస.. చేసిన ఆంటీకి సెల్యూట్‌ చేస్తున్న ప్రజలు.. వీడియో వైరల్‌

అయితే ఇది మామూలు దోసె కాదు. దాని పేరు 'స్పైడర్‌మ్యాన్ దోస'. అదేంటి అనుకుంటున్నారా..? వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా మంది ఈ దోసెను ఒక్కసారి రుచి చూడాలనుకుంటున్నారు.

Viral Video: స్పైడర్‌మ్యాన్ దోస.. చేసిన ఆంటీకి సెల్యూట్‌ చేస్తున్న ప్రజలు.. వీడియో వైరల్‌
Spider Man Dosa
Jyothi Gadda
|

Updated on: Mar 22, 2023 | 7:46 PM

Share

సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో అప్పుడప్పుడు వెరైటీ వంటలు కూడా ఉంటాయి. ప్రస్తుతం అలాంటిదే ఒక ఆంటీ వేసిన దోసలు నెటిజన్లను ఊరిస్తున్నాయి. ఈ వెరైటీ దోసెలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. చాలా మంది ఈ దోసెను ఒక్కసారి రుచి చూడాలనుకుంటారు. దోసె అనకూడదని కొందరైతే లాటిస్ శాండ్‌విచ్ అంటున్నారు. అయితే ఇది మామూలు దోసె కాదు. దాని పేరు ‘స్పైడర్‌మ్యాన్ దోస’.అవునా..? అదేంటి అనుకుంటున్నారా..? వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

భారతదేశంలోని స్ట్రీట్ ఫుడ్స్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. అది గోల్ గప్పాస్ అయినా, లేదా ఫాంటా మ్యాగీ అయినా. సోషల్ మీడియా ఫుడ్ బ్లాగర్ల వీడియోలతో నిండిపోయి ఉంటుంది. వారి దృష్టిని ఆకర్షించడానికి దుకాణదారులు వాటి పేర్లను కూడా వినూత్నంగా రూపొందిస్తుంటారు. ఈ రోజుల్లో మార్కెట్‌లో అలాంటి దోసె గురించి చర్చ జరుగుతోంది. ఇది చూసి ప్రజలు గందరగోళానికి గురయ్యారు. అయితే ఇది మామూలు దోసె కాదు. దాని పేరు ‘స్పైడర్‌మ్యాన్ దోస’. అదేంటి అనుకుంటున్నారా..? వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా మంది ఈ దోసెను ఒక్కసారి రుచి చూడాలనుకుంటారు. దోసె అనకూడదని కొందరైతే లాటిస్ శాండ్‌విచ్ అంటున్నారు. ఈ దోసెకు మీరు ఏ పేరు పెట్టాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి?

ఇవి కూడా చదవండి

Spider Man Dosa1

ఈ వీడియోను ‘నమస్తే ఇండియా’ (@namasteiindia) పేరుతో ఇన్‌స్టాగ్రామ్ పేజీ పోస్ట్ చేశారు. దీనికి క్యాప్షన్‌ను కూడా రాశారు..’స్పైడర్‌మ్యాన్ దోసా’ క్లిప్‌కి ఇప్పటివరకు 6 లక్షలకు పైగా లైక్‌లు, 16 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. వినియోగదారులందరూ దీనిపై ఫీడ్‌బ్యాక్ కూడా ఇచ్చారు. దోసెతో ఏం చేశావు అని కొందరు రాశారు? కొందరు ఈ దోసెను రుచికరమైనది అంటున్నారు. ఈ దోసెను ఒకసారి ప్రయత్నించి చూస్తే తప్పకుండా ఇష్టపడతారని కొందరు చెప్పారు. మరికొందరు ఈ దోసె పేరును చాలా ప్రత్యేకమైనదిగా అభివర్ణించారు. దీన్ని దోస శాండ్‌విచ్ అని ఎందుకు అంటారని ఒక వ్యక్తి అడిగాడు. ఇంతకీ విషయం ఏంటంటే..

వైరల్ వీడియోలో ఒక మహిళ దోస పిండిని సాలీడు వెబ్ లాగా రెండు గ్రిడిల్స్‌పై వేయటం కనిపిస్తుంది. ఆమె రెండు దోసెలపై నూనె, గుడ్డు పోసి, తర్వాత ఒక దోసెపై మసాలా, పనీర్‌ను స్ప్రెడ్ చేస్తుంది. మసాలా దోస ఉడికిన వెంటనే, ఆమె దాని మీద సాదా దోసె వేసి, ఒక ప్రత్యేక రకమైన దోసెను తయారు చేస్తుంది. చివరగా, ఆమె దోసను నాలుగు భాగాలుగా కట్ చేసి, దాని మీద టొమాటో సాస్ సహాయంతో అందమైన స్మైలీని తయారు చేసి, అందంగా వడ్డిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..