నాన్న చివరి కోరిక తీర్చేందుకు ఎవరూ చేయని పని చేసిన కొడుకు.. ఇది నా బాధ్యత అంటూ..
సామాజిక కార్యకర్త, డీఎంకేలో క్రియాశీలక సభ్యుడు పెరువంగూర్‌కు చెందిన ఆయన కుమారుడు వి రాజేంద్రన్ (65) గత రెండేళ్లుగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నెల రోజుల క్రితం బాత్‌రూమ్‌లో జారిపడి ఆరోగ్యం విషమించింది. అయితే,..
పెళ్లి అనేది జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు. ఒక శుభ సందర్భంలో అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి జీవించాలని నిర్ణయించుకుంటారు. అది కష్టాలైనా, సంతోషమైనా సరే కలకలం కలిసే ఉండాలనుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వారికి శుభాకాంక్షలు చెబుతారు. ఇక పెళ్లిలో ముహూర్తం చూసి, శుభ ఘడియ తెలుసుకుని వధువు మెడలో తాళి కడతాడు వరుడు..ఇలా పెళ్లి తంతూలో ప్రతిదీ విశేషమే. అలాగే, పెళ్లిపై ప్రతిఒక్కరూ ఎన్నో కలలు, ఆశలు పెట్టుకుంటారు. ఎలాంటి డెకరేషన్ ఏర్పా్ట్లు చేయాలి. ఎంత పెద్ద హాల్లో కళ్యాణం చేయాలని, ఇంట్లో మెహిందీ, సంగీత్ వంటి వేడుకల కోసం ఇంట్లో మండపాన్ని అంగరంగ వైభవంగా అలంకరించాలని భావిస్తారు. అయితే వీటన్నింటికీ భిన్నంగా ఓ వ్యక్తి అంత్యక్రియల్లో వివాహం చేసుకున్నాడు.
అవును, నమ్మడానికి కష్టంగా అనిపించినా ఇది నిజం. చెన్నైలోని కళ్లకురిచ్చిలో ఒక వ్యక్తి తన తండ్రి చివరి కోరికగా నాన్న అంత్యక్రియల్లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు.తండ్రి మృత దేహం ఎదుటే ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుని తండ్రి చివరి కోరికను తీర్చాడు. సోమవారం మధ్యాహ్నం కళ్లకురిచ్చి సమీపంలో ఈ ఘటన జరగగా అదే రోజు సాయంత్రం తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే ప్రవీణ్ తన తండ్రి ఆఖరి కోరికను తీర్చాలని నిర్ణయించుకుని అంత్యక్రియలకు ముందే పెళ్లి చేసుకున్నట్టుగా మృతుడు రాజేంద్రన్ సమీప బంధువు, పెరువంగూరుకు చెందిన పిపిఎస్ ఎళయరాజా తెలిపారు. రాజేంద్రన్ అంత్యక్రియలకు హాజరైన సౌర్నమాల్యా, ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించి ఒప్పించాడు ప్రవీణ్. వారి అంగీకారంతో ప్రవీణ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వెంటనే పెళ్లి జరిపించారు.
రాజేంద్రన్ కోరిక మేరకు బౌద్ధ పద్ధతిలో ఆచార వ్యవహారాలను అనుసరించినట్లు సమాచారం. అనంతరం రాజేంద్రన్ భౌతికకాయాన్ని అంతిమయాత్ర కోసం శ్మశాన వాటికకు తరలించారు. అంత్యక్రియల్లో పెళ్లి గురించి ప్రవీణ్ మాట్లాడుతూ కొంతమంది గ్రామస్థులు, బంధువులు మాట్లాడే మాటలకు భయపడనని చెప్పాడు. ఎందుకంటే కొడుకుగా తండ్రి కోరిక తీర్చటం నా బాధ్యత అని చెప్పాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..