PM Modi Varanasi Tour: మార్చి 24న ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన..

ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 24వ తేదీన వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు రూ. 1780 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

PM Modi Varanasi Tour: మార్చి 24న ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన..
Pm Modi
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 22, 2023 | 7:26 PM

ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 24వ తేదీన వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు రూ. 1780 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అంతకు ముందు.. రుద్రకాష్ కన్వెన్షన్ సెంటర్‌లో వన్ వరల్డ్ టీబీ సమ్మిట్‌లో పాల్గొని, ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ. వారణాసి పర్యటనలో భాగంగా.. వారణాసి కాంట్ స్టేషన్ నుంచి గోదోలియా వరకు ప్యాసింజర్ రోప్‌వేకి శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ.

ప్రధాని మోదీ వారణాసి షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్చి 24న వారణాసిలో పర్యటిస్తారు. ఆ రోజున ఉదయం 10:30 గంటలకు, రుద్రకాష్ కన్వెన్షన్ సెంటర్‌లో వన్ వరల్డ్ టిబి సమ్మిట్‌లో ప్రధాని ప్రసంగిస్తారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం మైదానంలో రూ. 1,780 కోట్ల విలువైన వివిధ ప‌థ‌కాల‌ల‌కు శంకుస్థాప‌న చేస్తారు.

ఇవి కూడా చదవండి

వన్ వరల్డ్ టీబీ సమ్మిట్..

ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా.. వన్ వరల్డ్ టిబి సమ్మిట్‌లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు. ఈ సమ్మిట్‌ను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, స్టాప్ TB సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. 2001లో స్థాపించబడిన స్టాప్ టిబి పార్టనర్‌షిప్‌.. ఐక్యరాజ్యసమితి హోస్ట్ చేసిన సంస్థ. ఇది టిబి బారిన పడిన ప్రజల గొంతుకను ప్రపంచానికి వినిపిస్తోంది. కాగా, భారతదేశ వార్షిక టీవీ నివేదిక 2023ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేదికగా విడుదల చేయనున్నారు. ఈ సదస్సుకు 30కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..