ఆస్పత్రి బిల్లు చూసి కుప్పకూలిన యువకుడు..హోటల్‌కు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు..
ఆసుపత్రి బిల్లుకు భయపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన... ఇకపై అతని తల్లిదండ్రులు నా కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం తనకు ఇష్టం లేదని లేఖలో రాసుకున్నాడు. అందుకే తన జీవితాన్ని ముగించుకుంటున్నట్టుగా చెప్పాడు. తన మరణానికి ముందు,
ఆసుపత్రి బిల్లుకు భయపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఓ హోటల్‌లో 24 ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమైంది. ఆసుపత్రి బిల్లుకు భయపడి అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తి మృతదేహం హోటల్ కనిపించటంతో కలకలం రేపింది. 24 ఏళ్ల యువకుడి మృతదేహం ఒక హోటల్ గుర్తించారు పోలీసులు. ఆక్సిజన్ సిలిండర్ తో అతడు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. సిలిండర్‌లోని ఆక్సిజన్‌ను ఎక్కువగా తీసుకోవడంతో అతడు మృతి చెందినట్లు తెలిసింది. అతని శరీరమంతా ప్లాస్టిక్ కవర్‌తో చుట్టేసుకున్నాడు. అతని ముఖాన్ని కూడా కవర్ చేసుకుని చిన్న ఆక్సిజన్ సిలిండర్‌కు కనెక్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
మృతుడు 24 ఏళ్ల నితేష్‌గా గుర్తించారు పోలీసులు. రోజురోజుకు పెరుగుతున్న తన వ్యాధికి చికిత్స పొందుతున్నాడు నితేష్. ఈ క్రమంలో ఆస్పత్రి బిల్లుకు జడిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నార్త్ ఢిల్లీలోని ఆదర్శ నగరాలో ఒక హోటల్‌ను బుక్ చేసుకున్న నితేష్ హోటల్‌కి వచ్చేప్పుడు ఒక చిన్న బ్యాగ్ వెంటతెచ్చుకున్నాడని, కానీ, ఊహించని రీతిలోఅతడు ఒళ్లంతా ప్లాస్టిక్ కవర్ చుట్టేసుకుని విగత జీవిగా పడివున్నాడు. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటే, హృదయ స్పందన మందగిస్తుంది. ఇది ఆక్సిజన్ విషానికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు.
నితీష్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న డెత్ నోట్‌ను ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైద్యం కోసం ఇప్పటికే లక్షల రూపాయలు ఖర్చు చేశానని, ఇకపై అతని తల్లిదండ్రులు నా కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం తనకు ఇష్టం లేదని లేఖలో పేర్కొన్నాడు. దీంతో తన జీవితాన్ని ముగించుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తన మరణానికి ముందు, అతను చనిపోవటానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయో అని గూగుల్‌లో సెర్చ్ చేశాడు. నొప్పి లేకుండా చనిపోవడానికి వీడియోలను చూశాడు. అనంతరం ఆక్సిజన్‌ను ఎక్కువగా పీల్చి చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు నిర్దారించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..