Water Bottles: బాటిళ్లు కావవి.. బ్యాక్టీరియాకు పుట్టినిళ్లు.. రీయూజ్ చేశారా.. ప్రాణంమీదకు తెచ్చుకున్నట్టే..!

స్టీల్, ప్లాస్టిక్, మెటల్... మెటీరియల్ ఏదైనా వాడే వాటర్ బాటిళ్లు క్లీన్ చేయడం అనేది దినచర్యగా మార్చుకోవాలి. వాటర్ బాటిల్‌ను కనీసం రోజుకు ఒకసారి సబ్బుతో, వేడి నీళ్లతో కడగాలి. వారానికి ఒకసారి తప్పనిసరిగా శానిటైజ్ చేయాలి. కడిగిన తర్వాత ఎండలో కొంతసేపు ఆరనివ్వాలి. అలా చేయడం ద్వారా వాసనతో పాటే అందులోని బ్యాక్టీరియా కూడా నాశనమౌతుంది.

Water Bottles: బాటిళ్లు కావవి.. బ్యాక్టీరియాకు పుట్టినిళ్లు.. రీయూజ్ చేశారా.. ప్రాణంమీదకు తెచ్చుకున్నట్టే..!
Reusable Water Bottle
Follow us

|

Updated on: Mar 26, 2023 | 6:42 AM

చేతిలో బాటిల్… ఆ బాటిల్‌లో మంచినీళ్లలా కనిపించే విషం. మనం చాలా సేఫ్ అనుకుంటున్న వాటర్ బాటిల్… ఒక విషపు సీసా అనే విషయం మనకు తెలీదు. మనం తాగుతున్నది మంచి నీళ్లు కాదు… చెడు బ్యాక్టీరియా అని మనం ఎప్పుడూ ఊహించి ఉండం. కానీ… ఇది నిజ్జంగా నిజం. మంచినీళ్ల బాటిల్‌లో మృత్యువే పొంచివుంది. ముఖ్యంగా… రాబోయే సమ్మర్ సీజన్‌లో ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలంటున్నారు డాక్టర్లు.

యూజ్ అండ్ త్రో బాటిళ్లు… ఒక్కసారి ఖాళీ కాగానే బైట పారేయాల్సిన బాటిళ్లు… వీటిని మళ్లీమళ్లీ వాడుకోవడం మన మధ్యలో చాలామందికుండే అలవాటు. దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువగా ఈ వన్‌టైమ్ బాటిళ్లే కనిపిస్తాయి. ఒకసారి వాడి పడేయాల్సిన ఇటువంటి బాటిళ్లను పదేపదే ఉపయోగిస్తే డేంజరస్ ఇన్ఫెక్షన్‌కు గురైనట్టే. ప్రాణంమీదకు తెచ్చుకున్నట్టే. అమెరికన్ రిసెర్చర్లు తేల్చిన చేదునిజమిది.

సమ్మర్ సీజన్ వచ్చేసింది. వాటర్‌ బాటిల్‌ వెంటలేనిదే బైటికెళ్లలేని పరిస్థితి. లేదంటే బైట షాపుల్లో నీళ్ల బాటిల్ కొనుక్కుని, దాన్ని తాగి పడెయ్యకుండా ఇంటికి తెచ్చుకునే వాళ్లు కూడా ఉంటారు. అవే మన పాలిట డేంజర్‌ బాటిళ్లవుతాయి. మనం చాలా సురక్షితం అని గట్టిగా నమ్మే ఈ వాటర్ బాటిళ్లలో ఎంత బ్యాక్టీరియా పేరుకుపోయి ఉంటుందో తెలిస్తే.. షాకైపోతాం. టాయిలెట్ సీట్‌పై ఉండే బాక్టీరియా కంటే ఇది 40వేల రెట్లు అధికంగా ఉంటుంది. అంతేకాదు కంప్యూటర్ మౌస్‌తో పోలిస్తే బాటిళ్లపై నిల్వ ఉండే క్రిములు 4 రెట్లు ఎక్కువ.. పెంపుడు జంతువుల నీటి గిన్నె కంటే 14 రెట్లు ఎక్కువ.. వంటగదిలోని సింక్‌తో పోలిస్తే రెండు రెట్ల బ్యాక్టీరియా నీళ్ల బాటిళ్లలో ఉంటుంది.

రీయూజ్ బాటిళ్లలో నీళ్లు తాగితే మనపై యాంటీ-బాక్టీరియా మందుల ప్రభావం తగ్గుతుంది. కడుపునొప్పి, అసిడిటీ, విరేచనాలు, వాంతులు, వికారం వంటి సమస్యలు రావచ్చు. రక్తపోటు పెరగొచ్చు, తగ్గొచ్చు. యూరినల్ ఇన్ఫెక్షన్లు రిపీటయ్యే ప్రమాదం ఉంది. బాలికల్లో హార్మోన్ మార్పులు అకాలంగా ఉండవచ్చు. గుండెపోటుకు గురయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువట.

వన్‌టైమ్ యూజ్ బాటిళ్లు మాత్రమే కాదు… మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని గంటకోసారైనా బైటికి తీసి తాగే వాటర్ బాటిళ్లతో కూడా ముప్పు పొంచివుంది. సరైన రీతిలో శుభ్రం చెయ్యకుండా వాడితే… అందులో విషపూరిత బ్యాక్టీరియా చేరే ఛాన్సుంది. బాటిల్ పైభాగం, మూత, అడుగుభాగం అన్ని చోట్లా రెండు రకాల బ్యాక్టీరియా పేరుకుపోతుంది. ఒకటి గ్రామ్ నెగటివ్ బాక్టీరియా, రెండు బాసిల్లస్ బాక్టీరియా. గ్రామ్-నెగటివ్ బ్యాక్టీరియా ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. బాసిల్లస్ బ్యాక్టీరియా జీర్ణాశయ సమస్యలకు దారితీస్తుంది. పరిశోధనల తర్వాత తేలిన నిజం ఇది.ఇది చాలా ప్రమాదకమైన బ్యాక్టీరియా. బాటిళ్లను పదేపదే వాడడం, శుభ్రంగా చుకోకపోవడం వల్లే ఈ బ్యాక్టీరియా పెరుగుతుంది.మరి… ఈ ముప్పు నుంచి తప్పించుకునే మార్గమే లేదా? అంటే లేకేం ఉంది అంటున్నారు ఎక్స్‌పర్ట్‌లు. ఇంట్లో ఇతర పాత్రలను ఎంత జాగ్రత్తగా ఉపయోగిస్తారో, వాటర్ బాటిల్‌ను అంతే శుభ్రంగా ఉంచుకోవాలన్నది ప్రధాన సూచన. వేసవిలోనే కాదు… ఏ సీజన్లోనైనా వాటర్ బాటిళ్ల మెయింటెనెన్స్ అనేది చాలా కీలకం.

స్టీల్, ప్లాస్టిక్, మెటల్… మెటీరియల్ ఏదైనా వాడే వాటర్ బాటిళ్లు క్లీన్ చేయడం అనేది దినచర్యగా మార్చుకోవాలి. వాటర్ బాటిల్‌ను కనీసం రోజుకు ఒకసారి సబ్బుతో, వేడి నీళ్లతో కడగాలి. వారానికి ఒకసారి తప్పనిసరిగా శానిటైజ్ చేయాలి. కడిగిన తర్వాత ఎండలో కొంతసేపు ఆరనివ్వాలి. అలా చేయడం ద్వారా వాసనతో పాటే అందులోని బ్యాక్టీరియా కూడా నాశనమౌతుంది.

అన్నిటికంటే గాజు సీసాలు సురక్షితం. ఇందులో సందేహం లేదు. కానీ బరువైనవి కనుక వాటికెప్పుడో మంగళం పాడేశాం. విధిలేని పరిస్థితుల్లో ప్లాస్టిక్ బాటిళ్ల మీదే ఆధారపడుతున్నాం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ సైన్సెస్ ప్రకారం, నాసిరకం ప్లాస్టిక్ బాటిళ్ల తయారీలో BPA అనే రసాయనాన్ని వాడతారు. అందుకే… తక్కువ ధరకు లభించే ప్లాస్టిక్ బాటిళ్లను కాకుండా నాణ్యమైన బాటిల్‌ను వాడితే మంచిదట. స్కూలుకెళ్లే పిల్లలు వీలైనంతవరకు ప్లాస్టిక్ బాటిల్స్ వాడకపోతేనే బెటర్.

లాలాజలం గాలికి తగిలి దానిపై క్రిములు ఏర్పడి… బాటిల్ మూత భాగంలో పేరుకుపోయే ఛాన్సుంది. వీటికి తోడు ఇ.కోలి వంటి బ్యాక్టీరియాలు నీళ్ల బాటిళ్లలోనే పెరుగుతుంటాయ్. దగ్గు, జలుబుతో బాధపడేవారు అదే చేతులతో సీసాని పట్టుకోవడం వల్ల కూడా బాక్టీరియాలు ఏర్పడతాయ్. అందుకే… మన నోరు క్రిములకు కేరాఫ్ అవుతోందనేది నిపుణుల హెచ్చరిక. కానీ… జనంలో మాత్రం ఆ సీరియస్‌నెస్ అస్సలు కనిపించదు.

రీయూజబుల్ బాటిళ్లతో ఎంత ప్రమాదం పొంచివుందనే అవేర్‌నెస్ జనంలో కల్పించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పైగా… మన గృహోపకరణాల్లో కలిసిపోయిన నిత్యావసర వస్తువు వాటర్ బాటిల్. దాని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత కూడా మనదే. లేకపోతే… నట్టింట్లోనే కాలకూట విషాన్ని దాచుకుని… మనమే అనారోగ్యాల్ని కొనితెచ్చుకున్నవాళ్లమవుతాం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
తెలంగాణలో వికృత క్రీడ సాగుతోంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణలో వికృత క్రీడ సాగుతోంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్