Women Health: అమ్మబాబోయ్.. సంవత్సరం పాటు మూత్ర విసర్జన చేయని మహిళ.. కారణమిదేనట..!

సాధారణంగా స్త్రీ అయినా పురుషులు అయినా 3 గంటలకోసారో, 4 గంటలకోసారో లేదంటే కనీసం రోజుకు రెండుసార్లైనా మూత్ర విసర్జన చేస్తారు. అలాకాకుండా అతిగా మూత్ర విసర్జన చేస్తే.. మధుమేహమో, కిడ్నీ వ్యాధో కారణం అయి ఉంటుంది. మరి ఒక పూట కాదు, ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఏకంగా సంవత్సరం పాటు మూత్ర విసర్జన చేయని వారు ఉన్నారంటే నమ్ముతారా?

Women Health: అమ్మబాబోయ్.. సంవత్సరం పాటు మూత్ర విసర్జన చేయని మహిళ.. కారణమిదేనట..!
Women
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 25, 2023 | 10:19 PM

సాధారణంగా స్త్రీ అయినా పురుషులు అయినా 3 గంటలకోసారో, 4 గంటలకోసారో లేదంటే కనీసం రోజుకు రెండుసార్లైనా మూత్ర విసర్జన చేస్తారు. అలాకాకుండా అతిగా మూత్ర విసర్జన చేస్తే.. మధుమేహమో, కిడ్నీ వ్యాధో కారణం అయి ఉంటుంది. మరి ఒక పూట కాదు, ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఏకంగా సంవత్సరం పాటు మూత్ర విసర్జన చేయని వారు ఉన్నారంటే నమ్ముతారా? ఉన్నారు. ఓ మహిళ ఏడాది కాలంగా మూత్ర విసర్జన చేయలేదు. అవును ఇది నిజంగా నిజం. ఈ కేసు ఇంగ్లాండ్‌లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

లండన్ నివాస్ అయిన ఎల్లే ఆడమ్స్(30) ఏడాదికిపైగా మూత్ర విసర్జన చేయలేదు. ఎల్లే ఆడమ్స్ అక్టోబర్ 2020 నుంచి మూత్ర విసర్జన చేయలేదు. ఎన్ని వాటర్, డ్రింక్స్ తాగినా టాయిలెట్ మాత్రం పోలేదట. అయినప్పటికీ ఆమె సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటం ఇక్కడ విశేషం. ఒక రోజు ఉదయాన్నే నిద్రలేచి టాయిలెట్‌కి వెళ్లింది ఎల్లే. అయితే, ఆమె మూత్ర విసర్జన చేయలేకపోయిందట. కొద్ది రోజులు అలాగే జరగడంతో ఆందోళనకు గురైన ఎల్లే ఆడమ్స్.. వైద్యులను సంప్రదించింది. పరీక్షలు జరిపిన వైద్యులు.. ఎల్లే మూత్రాశయంలో లీటరు టాయిలెట్ ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా మూత్రాశయం స్త్రీలలో 500 ml, పురుషులలో 700 ml మూత్రాన్ని మాత్రమే నిల్వ సామర్థ్యం ఉంటుంది. దాంతో మూత్ర విసర్జన చేసేందుకు ఆమెకు ఒక ట్యూబ్ అమర్చారు. అలా ఆ సమయానికి సమస్య పరిష్కారం అయ్యింది. కానీ, ఆ తరువాత కూడా సమస్య పరిష్కారం అవలేదు.

అలా ఒక సంవత్సరానికి పైగా మూత్ర విసర్జన చేయడానికి కాథెటర్ ట్యూబ్ పరికరం సహాయం తీసుకోవాల్సి వచ్చింది ఎల్లే ఆడమ్స్. దాదాపు 14 నెలల తరువాత అనేక పరీక్షలు చేయగా.. ఆమెకు ‘ఫౌలర్స్ సిండ్రోమ్’ ఉన్నట్లు నిర్ధారించారు. ఎల్లే తన జీవితాంతం కాథేటర్ ట్యూబ్‌ను ఉపయోగించి మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి కారణంగా.. ఎల్లే మూత్రం పోయలేకపోతోందని, ఈ అరుదైన పరిస్థితి ఎక్కువగా మహిళలను ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనికి కారణం ఇంకా కనిపెట్టలేదని, మందులు వాడినా ప్రయోజనం ఉంటుందని చెప్పలేమంటున్నారు వైద్యులు.

ఇవి కూడా చదవండి

అయితే, నరాల సంబంధిత చికిత్స, మూత్రాశయం, ప్రేగు సమస్యలకు చికిత్స తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ఎల్లే ఆడమ్స్‌కి జనవరి 2023లో చికిత్స ప్రారంభమైంది. మెడిసిన్ వినియోగం, పైన పేర్కొన్న చికిత్స అనంతరం దాదాపు 50 శాతం నయం అయిందని ఎల్లే చెబుతోంది. ప్రస్తుతం చాలా బెటర్‌గా ఉందని చెబుతోంది. కాథేటర్ ట్యూబ్‌ని చాలా తక్కువగా ఉపయోగిస్తున్నానని చెబుతోంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..