AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎడా పెడా డోలో 650 వాడేస్తున్నారా…అయితే జాగ్రత్త…ఈ లక్షణాలు కనిపిస్తే ప్రమాదమే..

గత రెండేళ్లలో కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. కోవిడ్-19 కొత్త వేరియంట్‌లు నిరంతరం బయటకు వస్తున్నాయి. కరోనా చాలా సందర్భాలలో, జలుబు, దగ్గు, జ్వరం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి లక్షణాలు మాత్రమే రోగుల్లో కనిపించాయి.

ఎడా పెడా డోలో 650 వాడేస్తున్నారా...అయితే జాగ్రత్త...ఈ లక్షణాలు కనిపిస్తే ప్రమాదమే..
Dolo 650
Madhavi
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 26, 2023 | 10:04 AM

Share

గత రెండేళ్లలో కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. కోవిడ్-19 కొత్త వేరియంట్‌లు నిరంతరం బయటకు వస్తున్నాయి. కరోనా చాలా సందర్భాలలో, జలుబు, దగ్గు, జ్వరం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి లక్షణాలు మాత్రమే రోగుల్లో కనిపించాయి. దీంతో కరోనాకు ఖచ్చితమైన చికిత్స నేటికీ లేదనే చెప్పాలి. అందుకే వైద్యులు కూడా ఇప్పటివరకు కరోనా లక్షణాల ఆధారంగా చికిత్స చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా సోకినప్పుడు జలుబు, జ్వరం కారణంగా, చాలా మంది వైద్యుల సలహా లేకుండా కూడా మందులను ఎడా పెడా ఉపయోగించారు. అలాంటి మందుల్లో డోలో-650 ఒకటి అనే చెప్పవచ్చు. పారసిటమాల్ మూలకం 650 ఎంజీ మోతాదునే డోలో 650గా మార్కెట్లో లభిస్తోంది.

ఈ మందును ఎక్కువగా జ్వరం, ఒళ్లు నొప్పుల కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చాలా మంది నిపుణుల సలహా లేకుండానే ఈ మందును వాడేస్తున్నారు. అయితే ఇతర మందుల మాదిరిగానే Dolo-650 రోగులపై కూడా దుష్ప్రభావాలు చూపింది. అందుకే వైద్యుని సలహా లేకుండా ఈ మందును వేసుకోకూడదు. డోలో -650లో ఉండే పారాసెటమాల్ జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కరోనా ప్రధాన లక్షణాలలో ఒకటి జ్వరం. దీనితో పాటు, డోలో-650 తలనొప్పి, పంటి నొప్పి, వెన్నునొప్పి, నరాల నొప్పి, కండరాల నొప్పిలో కూడా ఉపశమనాన్ని అందిస్తుంది,

అయితే ఈ ఔషధం దుష్ప్రభావాల గురించి మాట్లాడుకుంటే మెదడుకు పంపే నొప్పి సంకేతాలను ఇందులోని పారాసిటమాల్ తగ్గిస్తుంది, ఇది రోగులకు ఉపశమనం అందిస్తుంది. ఈ ఔషధం ఉపయోగం మన శరీరంలో విడుదలయ్యే ప్రొస్టాగ్లాండిన్స్ అనే రసాయనాన్ని కూడా నిరోధిస్తుంది. ఈ రసాయనం వల్లనే శరీరంలో జ్వరం వచ్చినప్పుడు శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

Dolo-650 సాధారణ దుష్ప్రభావాలు:

1. వికారం.

2. తక్కువ రక్తపోటు.

3. కళ్లు తిరగడం.

4. బలహీనంగా అనిపించడం.

5. అధిక నిద్ర (నిద్ర).

6. అనారోగ్యంగా అనిపించడం.

7. మలబద్ధకం.

8. మూర్ఛ.

9. నోరు ఎండిపోవడం.

తీవ్రమైన దుష్ప్రభావాలు:

1. నెమ్మదిగా గుండె కొట్టుకోవడం.

2. స్వర పేటిక వాపు.

3. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్.

4. శ్వాస ఆడకపోవడం.

5. నాడీ వ్యవస్థ ప్రభావితమవడం.

6. గుండె దడ లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

అలాగే రోజుకు 1800 ఎంజీ పారాసిటమాల్ శరీరానికి హాని కలిగిస్తుంది. అంతే కాదు లివర్ ను సైతం డ్యామేజీ చేస్తుంది. అంతేకాదు కడుపులో అల్సర్ వంటి వ్యాధులు వచ్చేందుకు కూడా ఇది కారణం అవుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి