మందుబాబులు ఇది విన్నారా..? స్టీల్‌ గ్లాస్‌లో మద్యం తాగితే ఏమవుతుందంటే.. ! నిపుణుల వివరణ..!!

స్టీలు గ్లాసుల్లో మద్యం తాగడం మంచిది కాదని చాలా మంది భావిస్తుంటారు. అందుకు కారణం ఏంటీ..? ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదా..? ఇది నిజమేనా..? స్టీల్‌ గ్లాసులో వైన్‌ తాగడం ఆరోగ్యానికి మరింత హానికరమా..? అనే సందేహలు

మందుబాబులు ఇది విన్నారా..? స్టీల్‌ గ్లాస్‌లో మద్యం తాగితే ఏమవుతుందంటే.. ! నిపుణుల వివరణ..!!
Drink Alcohol
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 25, 2023 | 4:09 PM

స్టీలు గ్లాసులో మద్యం సేవించకూడదని, అది ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని చాలా మంది చెప్పడం మీరు వినే ఉంటారు. అలాగే, ప్రపంచం మొత్తం మీద ఎక్కువ శాతం మందుబాబులు మద్యం తాగేందుకు ప్రత్యేకమైన గ్లాసులనే వాడుతుంటారు. అయితే, స్టీలు గ్లాసుల్లో మద్యం తాగడం మంచిది కాదని చాలా మంది భావిస్తుంటారు. అందుకు కారణం ఏంటీ..? ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదా..? ఇది నిజమేనా..? స్టీల్‌ గ్లాసులో వైన్‌ తాగడం ఆరోగ్యానికి మరింత హానికరమా..? అనే సందేహలు తరచూ చాలా మందిలో వినిపిస్తుంటాయి. అయితే, నిజానికి స్టీల్ గ్లాసులో మద్యం తాగటం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యం దృష్ట్యా స్టీల్ గ్లాసుల్లో మద్యం సేవించడం వల్ల ఎలాంటి హాని ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం మద్యం తయారీ వ్యవస్థలో ఎక్కువ శాతం స్టీల్‌ పాత్రలనే వినియోగిస్తుంటారు. మద్యాన్ని పులియబెట్టే ట్యాంక్‌ల నుండి ఫిల్టరింగ్‌ పరికరాల వరకు ప్రతిదీ ఉక్కుతో తయారు చేయబడినవే ఉంటాయి. స్టీల్‌ గ్లాసులో వైన్‌ పోయడం వల్ల దాని రసాయన స్వభావం గానీ, లేదంటే మద్యం రుచిని గానీ ప్రభావితం చేస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అంటే స్టీల్‌ గ్లాస్‌లో మద్యం ఖచ్చితంగా సురక్షితమైనదే. మార్కెట్లో కొన్ని స్టైలిష్‌ బీర్‌ మగ్‌లు కూడా ఉన్నాయి. వీటిని స్టెయిన్‌ లెస్ స్టీల్‌తో తయారు చేస్తారు. అంతేకాకుండా, కాక్టెయిల్స్‌ తయారీకి షేకర్లు , ఇతర మిక్సింగ్‌ పరికరాలు కూడా స్టెయిన్‌లెస్ స్టీల్‌తోనే తయారు చేస్తారు. అందుకే స్టీల్ గ్లాసులలో మద్యం తాగడం ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి హానికరం కాదనీ అది కేవలం వారి అపోహ మాత్రమేనని చెప్పాలి.

ఇక స్టీల్ గ్లాస్ లో ఎందుకు తాగరు అనే విషయానికి వస్తే స్టీల్ గ్లాస్ లో మద్యం తాగడం వల్ల తాగే వారికి ఆల్కహాల్ తాగుతున్న అనుభూతి కలగదట. అదే గాజు గ్లాసులో మద్యం పోసుకొని తాగడం వల్ల గ్లాసులోంచి ఆ మద్యం మరింత అందంగా కనబడుతుంది.. దానిని చూస్తూ తాగడం వల్ల వారు సరికొత్త అనుభూతిని పొందుతారని, అందుకే గాజు గ్లాసులోనే మద్యం తాగుతారని నిపుణుల అంచనా. అలాగే గాజు గ్లాసులో మద్యం తాగడం స్టేటస్ సింబల్ గా కూడా భావిస్తారట. అందుకే చాలామంది మద్యం గాజు గ్లాసులలో తాగడానికి ఇష్టపడతారు. ఇక బయట ఎక్కడైనా తాగేవారు ప్లాస్టిక్ గ్లాసులలో కూడా మద్యం తాగుతుంటారు. ఇక్కడ మరోక కారణం ఏంటంటే.. స్టీల్‌ గ్లాసులో మద్యం తాగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాసన తెలస్తుందట. అదే గాజు గ్లాసులో అయితే, ఎలాంటి వాసన రాకుండా ఉంటుందట. అంతేకాదు,  గాజు గ్లాసులో ఖరీదైన మందు పోసుకుని సోడా, ఐస్ కలుపుకుని ఆ పూర్తి మిశ్రమాన్ని చూసుకుంటూ తాగితే ఆ కిక్కే వేరుగా ఉంటుందని మందుబాబుల ఫీల్.  అలాగే గాజు గ్లాస్‌లో మద్యం సేవించే రిచ్ క్యారెక్టర్స్ ని అనేక సినిమాల్లోనూ చూసే ఉంటారు. అందుకే గాజు గ్లాసులో మందు తాగటం ఇక్కడ స్టేటస్ సింబల్ గా కూడా మారింది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..