Coffee Addiction: కాఫీ కప్పులకు కప్పులు అతిగా తాగేస్తున్నారా…అయితే గుండెకు ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే…

ప్రతిరోజూ కాఫీ అతిగా తాగడం వల్ల తీవ్రమైన అధిక రక్తపోటు ఉన్నవారిలో గుండె పోటుకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి పరిశోధన ఫలితాల ప్రకారం, అధిక రక్తపోటు అతిగా కాఫీ తాగడం మానుకోవాలి.

Coffee Addiction: కాఫీ కప్పులకు కప్పులు అతిగా తాగేస్తున్నారా...అయితే గుండెకు ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే...
Coffee
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 27, 2023 | 9:59 AM

ప్రతిరోజూ కాఫీ అతిగా తాగడం వల్ల తీవ్రమైన అధిక రక్తపోటు ఉన్నవారిలో గుండె పోటుకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి పరిశోధన ఫలితాల ప్రకారం, అధిక రక్తపోటు అతిగా కాఫీ తాగడం మానుకోవాలి. ఎందుకంటే కాఫీలోని కెఫీన్ లాంటి హానికరమైన రసాయనాలు గుండె పోటు ప్రమాదాన్ని పెంచుతాయి.

కాఫీతోనే చాలా మంది దినచర్య మొదలవుతుంది. అయితే రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే ఆరోగ్యానికి ఎంత హాని కలుగుతుందో తెలుసా. అధిక రక్తపోటు సమస్యలకు కాఫీ ప్రాణాంతకం కావచ్చని ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ నివేదించింది. రక్తపోటు 160/100 కంటే ఎక్కువ ఉన్నవారిలో గుండె జబ్బుల నుండి మరణించే ప్రమాదాన్ని కాఫీ రెండింతలు చేస్తుంది.

అయితే గ్రీన్ టీ తీసుకోవడం వల్ల గుండె జబ్బులకు సంబంధించిన మరణాల ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఇదే పరిశోధనలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రెండు పానీయాలలో కెఫిన్ ఉన్నప్పటికీ. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ప్రకారం ఒక కప్పు గ్రీన్ టీలో 30-50 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. అదే కప్పు కాఫీలో 80 నుండి 100 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. అందుకే రోజుకు ఒక కప్పు కాఫీ తాగడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చని తేలగా, రెండు కప్పులు తాగితే మాత్రం. గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అంతేకాదు అతిగా కాఫీ వినియోగం టైప్ 2 డయాబెటిస్, సహా కొన్ని క్యాన్సర్‌ల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచవచ్చని, ఆకలిని నియంత్రించడంలో, సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే, ఈ ప్రభావం కెఫీన్ వల్ల వస్తుందా లేదా కాఫీకి ఏదైనా కారణం ఉందా అనే దానిపై క్లారిటీ లేదు. అయినప్పటికీ, ఎక్కువ కాఫీ తాగడం వల్ల రక్తపోటు గణనీయంగా పెరుగుతుంది.

మరణ ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది:

పరిశోధన ఫలితాల ప్రకారం, కాఫీ తాగని వారితో పోలిస్తే 160/100 రక్తపోటు ఉన్నవారిలో రోజుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల కాఫీ తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుంది. రోజుకు ఒక కప్పు కాఫీ తాగుతున్నప్పుడు, రక్తపోటు ఏ వర్గంలోనైనా గుండె జబ్బుతో మరణించే ప్రమాదం ఎక్కువగా కనిపించదు. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల గుండె జబ్బుల వల్ల మరణించే ప్రమాదం లేదని పరిశోధనలు చెబుతున్నాయి. అధిక రక్తపోటు ఉన్నవారు ఎక్కువగా కాఫీ తాగడం మానుకోవాలి. ఎందుకంటే కాఫీలో ఉండే కెఫిన్ హానికరమైన ప్రభావాల వల్ల మరణ ప్రమాదం పెరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి