Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cardiogenic Shock : ముందే మేల్కొంటే ముప్పు నుంచి రక్షణ.. ఆ ప్రమాదం వృద్ధులకే ఎక్కువ..

కార్డియోజెనిక్ షాక్‌ను కార్డియాక్ షాక్‌గా కూడా పిలుస్తారు. మీ గుండె తగినంత రక్తం, ఆక్సిజన్‌ను మెదడుతో ఇతర ముఖ్యమైన అవయవాలకు పంప్ చేయలేనప్పుడు కార్డియాక్ షాక్‌కు గురవుతారు. ఇది ప్రాణాంతకమైన అత్యవసర పరిస్థితి అని వైద్యులు చెబుతున్నారు.

Cardiogenic Shock : ముందే మేల్కొంటే ముప్పు నుంచి రక్షణ.. ఆ ప్రమాదం వృద్ధులకే ఎక్కువ..
Heart Attack
Follow us
Srinu

|

Updated on: Mar 26, 2023 | 5:00 PM

ఇటీవల హైదరాబాద్‌లో 32 ఏళ్ల వ్యక్తి జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడ్డాడు. దీంతో సహచరులు అతనని పరిశీలించి సీపీఆర్ చేసి ఆస్పత్రిలో జాయిన్ చేశారు. వైద్యులు దీనిని కార్డియోజెనిక్ షాక్‌‌గా గుర్తించి చికిత్స చేశారు. పలు నివేదికల ప్రకారం కార్డియోజెనిక్ షాక్‌ను కార్డియాక్ షాక్‌గా కూడా పిలుస్తారు. మీ గుండె తగినంత రక్తం, ఆక్సిజన్‌ను మెదడుతో ఇతర ముఖ్యమైన అవయవాలకు పంప్ చేయలేనప్పుడు కార్డియాక్ షాక్‌కు గురవుతారు. ఇది ప్రాణాంతకమైన అత్యవసర పరిస్థితి అని వైద్యులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం కార్డియోజెనిక్ షాక్ అనేది గుండెపోటు లేదా గుండె వైఫల్యం నేపథ్యంలో తక్కువ రక్తపోటు ఉన్న రోగులకు వచ్చే సిండ్రోమ్ అని అంటున్నారు. ఊపిరితిత్తులలో ద్రవం రద్దీ లేదా ద్రవాలు ఎక్కువగా ప్రవహించే సమస్యలు ఉన్నవారు, శరీర అవయవాలకు రక్త సరఫరా చేసిన సమయంలో ఈ పరిస్థితి తలెత్తుతుందని పేర్కొంటున్నారు. గుండె తగినంత ఆక్సిజన్-రిచ్ రక్తాన్ని శరీరానికి సరఫరా చేయలేకపోతే ఈ ప్రమాదకర పరిస్థితి తలెత్తుతుంది. కార్డియాక్ షాక్‌ను వెంటనే గుర్తించకపోతే తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

కార్డియోజెనిక్ షాక్ యొక్క కారణాలు ఏమిటి?

కార్డియోజెనిక్ షాక్ చాలా తరచుగా తీవ్రమైన గుండెపోటు వల్ల వస్తుంది. కానీ గుండెపోటు ఉన్న ప్రతి ఒక్కరూ దానిని అనుభవించరు. గుండెపోటు సమయంలో ధమనుల ద్వారా రక్త ప్రసరణ పరిమితం అవుతుంది. ఇది క్రమేపి కార్డియోజెనిక్ షాక్‌కు దారి తీస్తుంది.

ఈ సూచనలు కనిపిస్తే అలర్ట్ కావాల్సిందే..

ఊపిరితిత్తులలో రక్తనాళం ఆకస్మికంగా అడ్డుపడటం. గుండె చుట్టూ ద్రవం పేరుకుపోవడం, దాని నింపే సామర్థ్యాన్ని తగ్గడం వల్ల కూడా ఈ పరిస్థితి ఎదురుకావచ్చు. పెరిగిన ఒత్తిడి కారణంగా గుండె కండరాలు సరిగా పనిచేయలేకపోవడం లేదా కొన్ని సందర్భాల్లో దిగువ గదులు ఫైబ్రిలేట్ లేదా వణుకుతున్న అరిథ్మియా వచ్చినా ఈ కార్డియాక్ షాక్ పరిస్థితి ఎదురుకావచ్చు. ముఖ్యంగా మాదకద్రవ్యాల అధిక మోతాదు గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది క్రమేణ కార్డియోజెనిక్ షాక్‌కు దారితీయవచ్చు.

ఇవి కూడా చదవండి

వృద్ధులకు ప్రమాదమెక్కువ

ఆసుపత్రిలో ఉన్న రోగికి కూడా కార్డియోజెనిక్ షాక్ ఏ క్షణంలోనైనా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఒక వ్యక్తి ఆసుపత్రికి చేరుకోవడానికి సమయం తీసుకుంటే లేదా ఒక వ్యక్తి సకాలంలో సరైన చికిత్స పొందలేకపోవడం వంటి సుదూర ప్రాంతాలలో చికిత్స ఆలస్యమైతే వంటి కొన్ని పరిస్థితుల కారణంగా కారణం కావచ్చు. హై-రిస్క్ పేషెంట్లు అంటే వృద్ధులు లేదా మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ లేదా అనేక ఇతర రుగ్మతలు వంటి ఇతర కొమొర్బిడిటీలతో బాధపడుతున్నవారికి ఈ కార్డియోజనిక్ షాక్ ఈజీగా వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. మొదటగా కార్డియోజనిక్ షాక్ వచ్చిన తర్వాతే రోగికి కార్డియాక్ అరెస్ట్ లేదా కార్డియాక్ పల్మనరీ అరెస్ట్‌తో మరణిస్తాడు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి