Women Heart Attack: గుండెపోటు మరణాలు పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువ.. తాజా పరిశోధనలలో సంచలన విషయాలు

Women Heart Attack: ప్రస్తుతమున్న జీవనశైలిలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. తినే ఆహారం, వాతావరణ కాలుష్యం, టెన్షన్స్‌..

Women Heart Attack: గుండెపోటు మరణాలు పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువ.. తాజా పరిశోధనలలో సంచలన విషయాలు
Follow us
Subhash Goud

|

Updated on: Mar 24, 2022 | 2:34 PM

Women Heart Attack: ప్రస్తుతమున్న జీవనశైలిలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. తినే ఆహారం, వాతావరణ కాలుష్యం, టెన్షన్స్‌ తదితర కారణాల వల్ల రోగాలు చుట్టుముడుతున్నాయి. ఇక గుండెపోటు బాధితులు కూడా పెరిగిపోతున్నారు. ఇక పురుషులు, మహిళల్లో గుండె (Heart)కు సంబంధించిన వ్యాధుల ప్రభావం ఇద్దరికీ భిన్నంగా ఉంటుంది. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌ యూనివర్సిటీ ఆస్పత్రి పరిశోధకులు కీలక విషయాలు వెల్లడించారు. పురుషుల కంటే మహిళలు కార్డియోజెనిక్‌కు చికిత్స నుంచి ప్రాణాలతో బయటపడే మార్గాలు తక్కువగా ఉంటాయని వెల్లడించారు. కార్డియోజెనిక్‌ షాక్‌ అనేది ప్రాణాంతక పరిస్థితి. దీనిలో శరీర అవయవాలకు తగినంత ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి గుండె అకస్మాత్తుగా తగినంత రక్తాన్ని పంప్‌ పంప్‌ చేయడంలో విఫలమవుతుంది. ఇది సాధారణంగా పెద్ద గుండెపోటు వల్ల వస్తుంది. అయితే కార్డియోజెనిక్‌ షాక్‌తో బాధపడుతున్న గుండెపోటు రోగుల వివరాలను ఈ అధ్యయనంలో పరిశీలించారు. కార్డియోజెనిక్‌ షాక్‌తో బాధపడుతున్న మొత్తం 1716 మంది గుండెపోటు రోగుల వివరాలను అధ్యయనంలో పరిశీలించారు. వారిలో 438 (26) శాతం మంది మహిళలు ఉన్నారు. పురుషుల కంటే సగటు వయసు 66 సంవత్సరాలతో పోలిస్తే స్త్రీల వయసు 71 సంవత్సరాలుగా ఉంది. అయితే స్త్రీలు స్వల్ప, దీర్ఘకాలికంగా జీవించే అవకాశం పురుషుల కంటే తక్కుగా ఉన్నట్లు పరిశోధకులు తేల్చారు. గుండెపోటు వచ్చిన 30 రోజుల తర్వాత 50 శాతం పురుషులతో పోలిస్తే కేవలం 38 శాతం మంది మహిళలు జీవించి ఉన్నారని తెలిపారు.

పురుషులతో పోలిస్తే స్త్రీలే ఎక్కువ..

అయితే మహిళల్లో ఎక్కువగా కనిపించే రక్తపోటు, దీర్ఘకాలిక లక్షణాలు మినహా రోగుల్లో మిగతా లక్షణాలు సమానంగా ఉంటాయి. ప్రారంభంలో స్థానిక ఆస్పత్రిలో చేరిన వారిలో పురుషుల కంటే స్త్రీలు (41 శాతం మహిళలు, 30 శాతం పురుషులు) ఎక్కువగా ఉన్నారు. పరిశోధకుల నివేదిక ప్రకారం.. ఇక పురుషులతో పోలిస్తే స్త్రీలలో స్వల్ప, దీర్ఘకాలికంగా జీవించే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు అధ్యయనం ద్వారా స్పష్టం చేశారు. గుండెపోటు వచ్చిన 30 రోజుల తర్వాత పరిశీలిస్తే పురుషుల్లో 50శాతం మంది మాత్రమే జీవించి ఉండగా, కేవలం 38 శాతం మంది మహిళలు బతికి ఉన్నారు. 8.5 సంవత్సరాల వయస్సులో, 39 శాతం మంది పురుషులతో పోలిస్తే 27 శాతం మంది మహిళలు ప్రాణాలతో ఉన్నట్టు తెలింది.

గుండె జబ్బులున్న రోగుల్లో కార్డియోజెనెక్‌ షాక్‌..

ఇక తీవ్రతరంగా వచ్చే గుండె సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్న వారిలో పురుషుల కంటే మహిళలు శ్వాస ఆడకపోవడం, వికారం, వాంతులు, దగ్గు, అలసట, వెన్ను, దవడ, మేడ నొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. మహిళల్లో ఛాతీ నొప్పి కాకుండా ఇతర లక్షణాలు గుర్తించడం వలన రోగ నిర్ధారణ, చికిత్సలో జాప్యాలను తగ్గించవచ్చు పరిశోధకులు చెబుతున్నారు. గుండెపోటు ఉన్న రోగుల్లో 10 శాతం వరకు కార్డియోజెనెక్‌ షాక్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. కార్డియోజెనెక్‌ షాక్‌ వచ్చిన వారిలో ఎక్కువ మరణాలు సంభవించే అవకాశాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Betel Leaf: ఎండకాలంలో పాన్ తింటే ఎన్నో ప్రయోజనాలు.. తమలాపాకులతో ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..

Heat Stroke: హీట్‌ స్ట్రోక్‌ అంటే ఏమిటి..? ఇది వస్తే శరీరంలోని ఏయే అవయవాలు దెబ్బతింటాయి..?