Andhra News: ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్‌లు నిత్యావసర వస్తువులుగా తయారయ్యాయి. వాటిని కరెక్ట్‌గా వాడకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాటిని సరిగ్గా వినియోగించకపోయినా, రెగ్యులర్‌గా చెక్ చేయకపోయినా ఇబ్బందులు తప్పవు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి గ్రామంలో సాంబయ్య ఇంట్లో ఫ్రిజ్ పేలి ఇంటిలో సామాన్లన్నీ కాలిపోయాయి. ఫ్రిజ్ కంప్రెషర్ పెరగడం వల్ల ప్రేలుడు సంభవించినట్లు ఫైర్ సిబ్బంది గుర్తించారు.
నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్‌లు నిత్యావసర వస్తువులుగా తయారయ్యాయి. అయితే వాటిని సరిగ్గా వినియోగించకపోయినా, రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉండకపోయినా ఆ ఇంటి యజమానుల పట్ల అవే యమపాశాలుగా మారే అవకాశం ఉంది. తాజాగా ఏలూరు జిల్లా ఆగిరిపల్లి గ్రామంలో సాంబయ్య ఇంట్లో ఫ్రిజ్ పేలి ఇంటిలో సామాన్లు అన్నీ కాలిపోయాయి. ఫ్రిజ్ కంప్రెషర్ పెరగడం వల్ల ప్రేలుడు సంభవించినట్లు ఫైర్ సిబ్బంది గుర్తించారు. అయితే కంప్రెషర్ పేలుడు సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ తరహా ఘటనలు పలు చోట్ల ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో అనేక చోట్ల ఫ్రిడ్జ్, ఏసీలో కంప్రెషర్‌లు అకస్మాత్తుగా పేలి తీవ్ర ఆస్తి నష్టం, ప్రాణనష్టం కలుగుతున్నాయి.
దీనికి ప్రధాన కారణం ఫ్రిడ్జ్‌లు పదేపదే డోర్లు తీసి వాడడం, డోర్లు సరిగ్గా వేయకపోవడం వలన ఈ ప్రమాదాలు జరగవచ్చు అని టెక్నీషియన్ల చెప్తున్నారు. అంతేకాక ఏసీ లేదా రిఫ్రిజిరేటర్‌లో పనిచేయడానికి ముఖ్యమైన పరికరం కంప్రెషర్. ఇది ఒక రకమైన యాంత్రిక పరికరం. ఇది ఫ్రిజ్‌లో వాయువు లేదా గాలి ఒత్తిడిని పెంచడానికి ఉపయోగించబడుతుంది. గాలి కంప్రెష్ చేయడానికి ఉపయోగించడం ద్వారా గాలి పరిమాణాన్ని తగ్గించడం ద్వారా గాలి ఒత్తిడి పెరుగుతుంది. ఈ కంప్రెషర్లను రిఫ్రిజిరేటర్లు, ఏసీలు రెండింటిలోనూ ఉపయోగిస్తారు. కంప్రెసర్ రిఫ్రిజిరేటర్ వెనుక భాగంలో ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. రిఫ్రిజిరేటర్‌లో అమర్చిన కంప్రెషర్‌లో పంపు, మోటారు ఉంటుంది. ఈ మోటారు పంపు ద్వారా రిఫ్రిజిరేటర్ వాయువును కాయిల్స్‌కు పంపుతుంది. ఈ వాయువు చల్లబడి ద్రవంగా మారిన వెంటనే, అది రిఫ్రిజిరేటర్ నుండి వేడిని సంగ్రహిస్తుంది. లోపల ఉంచిన ప్రతిదాన్ని చల్లబరుస్తుంది.
సాధారణంగా పాత రిఫ్రిజిరేటర్‌లు పేలడానికి అవకాశం ఉంది. ఇవి పేలడానికి ముందు కంప్రెషర్ చాలా వేడిగా ఉంటుంది. రిఫ్రిజిరేటర్ మొత్తం పేలదు. దానిలోని కంప్రెసర్ పేలుడు మాత్రమే జరుగుతుంది. సాధారణంగా ఈ రకమైన సమస్య పాత రిఫ్రిజిరేటర్లలో కనిపిస్తుంది. అందువల్ల, మీ ఫ్రిజ్ పాతది, వేడిగా ఉంటే జాగ్రత్తగా ఉండండి. అంతేకాక రిఫ్రిజిరేటర్ నుండి శబ్దం రావడం ప్రారంభించినట్లయితే, మీరు ధ్వని ద్వారా పేలుడు ప్రమాదాన్ని గుర్తించవచ్చు. నిజానికి రిఫ్రిజిరేటర్ సరిగ్గా పనిచేసినప్పుడు కంప్రెషర్ నుండి పెద్దగా సౌండ్ వస్తుంది. కానీ మీ రిఫ్రిజిరేటర్ వేరే రకమైన పెద్ద శబ్దం చేస్తే లేదా అస్సలు శబ్దం చేయకపోతే, కాయిల్‌లో సమస్య ఉందని భావించండి. కాయిల్ అడ్డుపడితే రిఫ్రిజిరేటర్‌లో పేలుడు సంభవించే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ రిఫ్రిజిరేటర్ కండెన్సర్ కాయిల్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రపరచడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి