- Telugu News Photo Gallery What Happens to Your Body When You Eat Strawberries Every Day In Telugu Lifestyle News
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు బోలెడన్నీ బెనిఫిట్స్..
అందరూ ఇష్టంగా తినే పండ్లలో స్ట్రాబెర్రీ ఒకటి. స్ట్రాబెర్రీలు చాలా రుచిగా ఉంటాయి. అంతేకాదు.. అనేక ప్రయోజనకరమైన పోషకాలు నిండివున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అన్ని కాలాల్లోనూ సమృద్ధిగా లభించే ఈ పండు... సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. ఆరోగ్యంతో పాటుగా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా స్ట్రాబెర్రీ అద్భుత మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీల వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Dec 26, 2024 | 5:44 PM

స్ట్రాబెర్రీ తినడం వల్ల బరువు తగ్గవచ్చు. ఇందులోని పీచు ఆకలిని నియంత్రిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు స్ట్రాబెర్రీలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

స్ట్రాబెర్రీ పండ్లలోని విటమిన్లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. ఇందులోని పీచు పదార్థం శరీరంలోని కొవ్వును కరిగించి బరువును అదుపులో ఉంచడంలో ఉపయోగపడుతుంది. స్ట్రాబెర్రీలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు షుగర్‌ని నియంత్రించడంలో స్ట్రాబెర్రీలు మేలు చేస్తాయి. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరం నుండి మలినాలను, బ్యాక్టీరియాను తొలగిస్తుంది. స్ట్రాబెర్రీలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె ఆరోగ్యం, స్ట్రోక్‌లను నివారిస్తుంది. గర్భిణీ స్త్రీలకు కూడా ఇది ఉత్తమమైన పండు.

స్ట్రాబెర్రీలను ఉపయోగించి ఫేస్ ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఒత్తిడి, వాపు నుండి రక్షిస్తుంది. స్ట్రాబెర్రీలు క్యాన్సర్, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తాయి. స్ట్రాబెర్రీ జ్యూస్ చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి అనువైనది. ఇది నల్లటి వలయాలు, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.

స్ట్రాబెర్రీలో విటమిన్ సి, ఫైబర్ కంటెంట్, కేలరీలు, ఫైబర్, పొటాషియం, ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. అలాగే ఇది వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా నిరోధిస్తుంది. దీర్ఘకాలం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. స్ట్రాబెర్రీ లో షుగర్ శాతం తక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా హాయిగా తినొచ్చు. స్ట్రాబెర్రీస్‌తో జ్ఞాపక శక్తి పెరగటానికి దోహదం చేస్తుంది.




