- Telugu News Photo Gallery Business photos Scammers who are extorting money in the name of arrest, Must follow these precautions, Digital Arrest details in telugu
Digital Arrest: అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు.. ఈ జాగ్రత్తలు పాటించడం మస్ట్..!
పెరుగుతున్న టెక్నాలజీ ప్రజలకు కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెస్తుంటే కొందరు కేటుగాళ్లు మాత్రం టెక్నాలజీను ఉపయోగించుకుని ప్రజలను మోసగిస్తున్నారు. సాధారణంగా ప్రజల్లో చాలా మంది అరెస్ట్ అంటే భయపడతారు. ఈ నేపథ్యంలో కొందరు కేటుగాళ్లు అమాయకులకు ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ అనే పేరుతో భయపెట్టి డబ్బులు గుంజుతున్నారు.
Srinu |
Updated on: Dec 26, 2024 | 4:53 PM

ఎవరైనా పోలీసు, సీబీఐ, ఐటీ శాఖ అధికారులు లేదా కస్టమ్స్ ఏజెంట్లు వంటి ప్రభుత్వ సంస్థలకు చెందిన వారమంటూ మీకు కాల్ చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వారు మీరు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మనీలాండరింగ్, పన్ను ఎగవేత లేదా మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాల్లో పాలుపంచుకున్నారని వారు భయపెడతారు.

ముఖ్యంగా ఇలాంటి స్కామర్‌లు వీడియో కాల్ చేసి పోలీసు యూనిఫారంలో ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ లోగోలను ఉపయోగించి నిజమైన పోలీసుల్లో మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. వారు ముఖ్యంగా మీ భయాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి చాలా ధైర్యంగా ఉండాలి.

స్కామర్‌లు వ్యక్తిగత సమాచారాన్ని అడగే అవకాశం ఉంది. లేదా పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయవచ్చు. ముఖ్యంగా ఎలాంటి కేసు అయినా డబ్బు చెల్లిస్తే మాఫీ చేస్తామని వారి విషయంలో వెంటనే పోలీసులను సంప్రదించడం ఉత్తమం. ముఖ్యంగా సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో యూపీఐ ఐడీలకు సొమ్ము బదిలీ చేయాలని కోరే వారిపై జాగ్రత్తగా ఉండడం ఉత్తమం.

మీరు చట్టపరమైన సమస్యల గురించి ఊహించని కాల్‌లు లేదా సందేశాలను స్వీకరిస్తే, వెరిఫై చేయడానికి కొంత సమయం కేటాయించడం మంచిది. జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు 1930 లేదా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అనుమానాస్పద నంబర్‌లను అందించాలి.

ముఖ్యంగా మోసగాళ్లు పంపే మెసేజ్‌లను సేవ్ చేయాలి. స్క్రీన్‌షాట్‌లు, డాక్యుమెంట్ పరస్పర చర్యలను తీసుకోవాలి. మీరు నివేదికను ఫైల్ చేయాల్సి వస్తే ఇది అధికారులకు సహాయపడుతుంది.





























