Weight Loss Tips: ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఈ మధ్య కాలంలో అధిక బరువు అనేది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. బరువు తగ్గేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ 11 నెలల్లోనే 18 కేజీల బరువు తగ్గి.. అందర్నీ వావ్ అనిపించింది. అంతే కాకుండా అందుకు ఆమె చేసిన డైట్ ప్లాన్ కూడా రిలీవ్ చేసింది..
ప్రస్తుత కాలంలో అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలతో ఎక్కువ మంది బాధ పడుతున్నారు. అధిక బరువు కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బరువును ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. లేదంటే ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ బరువును కంట్రోల్ చేసుకోవడానికి చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఓ మహిళ మాత్రం కేవలం కొద్ది రోజుల్లోనే 18 కేజీల బరువు తగ్గి చూపించింది. అందుకు సంబంధించిన విషయాలు కూడా ఆమె ఇన్ స్టా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు జోరుగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. బరువును ఎలా అదుపు చేయవచ్చో అందుకు సంబంధించిన విషయాలను కూడా సదరు లేడీ వెల్లడించింది. మరి ఇంకెందుకు లేట్ ఆ లేడీ ఎలా బరువు తగ్గింది? అందుకు ఎలాంటి చిట్కాలు పాటించిందో ఇప్పుడు చూసేయండి.
బరువు పెరిగినంత ఈజీగా బరువు తగ్గలేం. అయితే కొంత మంది ఏమీ తినకపోయినా కూడా లావు అయిపోతూ ఉంటారు. ఈ క్రమంలో ఏం చేయాలా అని ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ ఇంటి వద్ద ఉంటూనే మీ డైట్ ప్లాన్‌ని కాస్త మ్యానేజ్ చేసుకుంటే ఈజీగా మీరు బరువు అదుపులో ఉంచుకోవచ్చు. ఈ లేడీ కేవలం 11 నెలల్లో 18 కేజీలు తగ్గింది. అందుకు సంబంధించి నాలుగు స్టెప్పుల ఫార్ములా కూడా వెల్లడించింది. ఆ మహిళ వెయిట్ లాస్ జర్నీ మీరూ తెలుసుకోండి.
వ్యాయామం:
బరువు తగ్గడంలో వ్యాయామం ఎంతో హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలంటే ప్రతి రోజూ ఖచ్చితంగా ఓ గంట పాటు వ్యాయామం చేయాలి. బరువును తగ్గించే వ్యాయామాలు ఎంచుకుని చేయవచ్చు. లేదంటే ప్రతిరోజూ వాకింగ్ చేసినా మంచిదే.
నీరు:
బరువును తగ్గించడంలో వాటర్ కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. ప్రతి రోజూ మీరు రెండు నుంచి 3 లీటర్ల నీటిని తాగేలా ప్లాన్ చేసుకోండి. మొదట్లో కష్టంగా ఉన్నా ఆ తర్వాత ఈజీ అవుతుంది. నీరు తాగితే కొవ్వు కరిగి.. శరీరంలోని వ్యర్థాలు అన్నీ బయటకు వెళ్లిపోతాయి.
ఆహారం:
మీరు తీసుకునే ఆహారం కూడా ఆరోగ్యంగా ఉండాలి. మీరు తీసుకునే ఆహారంలో 80 శాతం పోషకాలు ఉండేలా చూసుకోండి. ఒక 20 శాతం మాత్రమే మీకు ఇష్టమైన ఫుడ్ ఉండేలా చూసుకోవాలి.
ఫొటోలు:
బరువు తగ్గాలి అనుకున్న రోజు నుంచి ప్రతీ 10 రోజులకు ఒకసారి ఫొటో తీసుకోవాలి. ఈ ఫొటోలు మిమ్మల్ని మీలో మరింత ఎనర్జీని నింపుతాయి. ఈ ఫార్ములాతో చక్కగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.
View this post on Instagram
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.