AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dr Manmohan Singh: ఆర్థికవేత్తగా భారత భవిష్యత్తును మార్చిన మన్మోహన్ సింగ్‌.. విప్లవాత్మక నిర్ణయాలతో సంచలనం..!

సింగ్‌ ఈజ్‌ కింగ్‌. డాక్టర్ మన్మోహన్‌ సింగ్. సంస్కరణలకు కేరాఫ్ అడ్రస్. భారత ఆర్థిక రూపశిల్పి. దేశ ఆర్థిక ప్రగతికి పునాదులువేసిన ఆర్థికవేత్త. దశాబ్ద పాలనలో విప్లవాత్మక నిర్ణయాలతో దేశాన్ని తిరుగులేని శక్తిగా మార్చారు మన్మోహన్ సింగ్. భారత ఆర్థిక విధానాలపై బలమైన, చెరగని ముద్ర వేసిన వైతాళికుడు మన్మోహన్ సింగ్. ప్రతి భారతీయ పౌరుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించాలనే లక్ష్యంతో మన్మోహన్ సింగ్ హయాంలో ఆధార్ పథకం ప్రారంభించారు.

Dr Manmohan Singh: ఆర్థికవేత్తగా భారత భవిష్యత్తును మార్చిన మన్మోహన్ సింగ్‌.. విప్లవాత్మక నిర్ణయాలతో సంచలనం..!
Manmohan Singh
Balaraju Goud
|

Updated on: Dec 27, 2024 | 7:28 AM

Share

భారత విశిష్ట నేతల్లో మన్మోహన్‌ సింగ్ ఒకరు.. మన్మోహన్‌ సింగ్ భారత ఆర్థిక విధానాలపై బలమైన, చెరగని ముద్ర వేశారు.. ఈ మాటలన్నది ప్రతిపక్ష యూపీఏ కూటమి నేతో లేదా కాంగ్రెస్ నేతో కాదు. భారతీయ జనతా పార్టీ నేత, భారత ప్రధాని నరేంద్రమోదీ. అదీ మన్మోహన్‌ సింగ్ లెవెల్‌. ఆర్థిక వేత్తగా, ప్రధానిగా మన్మోహన్‌సింగ్‌ దేశానికి చేసిన సేవలు అలాంటివి మరి. దివాలా తీసిన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు మన్మోహన్ సింగ్‌. ఆర్థిక వ్యవస్థను సరళీకరించి భారతదేశం ప్రపంచంలోనే ఆర్థిక సూపర్ పవర్‌గా మారడానికి మార్గం సుగమం చేశారు.

1991లో ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థికవేత్త అయిన మన్మోహన్‌సింగ్‌ను ఏరికోరి కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఆ నమ్మకాన్ని మన్మోహన్ సింగ్ నిలబెట్టకున్నారు. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు మన్మోహన్ సింగ్‌. ఆర్థిక వ్యవస్థను సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ దిశలో తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర పోషించారు. దిగుమతి-ఎగుమతి విధానాన్ని సంస్కరించారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు. మన్మోహన్ సింగ్‌-పీవీ నరసింహరావు తీసుకున్న నిర్ణయాల వల్లే భారత దేశం క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కింది.

2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ దేశంలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారు. పైకి మృదుస్వభావిలా కనిపించినా దేశం కోసం తీసుకునే నిర్ణయాల్లో అత్యంత కఠినంగా వ్యవహరించారు మన్మోహన్ సింగ్‌. 2008లో చారిత్రాత్మకమైన భారతదేశం-అమెరికా పౌర అణు ఒప్పందంపై సంతకం చేశారు మన్మోహన్ సింగ్. భారతదేశం ప్రపంచ అణు మార్కెట్లోకి ప్రవేశించడానికి, ఇంధన సంక్షోభాన్ని అధిగమించడానికి ఈ ఒప్పందం దోహదపడింది. యూపీఏ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇచ్చిన లెఫ్ట్‌ పార్టీలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. మద్దతు ఉపసంహరించుకున్నాయి. అయినా మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు.

దేశంలో పేదవాళ్ల ఆకలి తీర్చేందుకు 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్. పాలనలో పారదర్శకతను తీసుకొచ్చేలా.. అధికారులు గుట్టుగా ఉంచే సమాచారాన్ని సామాన్యులు సైతం పొందేందుకు సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది కూడా మన్మోహన్‌ సింగే. ప్రతి భారతీయ పౌరుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించాలనే లక్ష్యంతో మన్మోహన్ సింగ్ హయాంలో ఆధార్ పథకం ప్రారంభించారు. ఇప్పుడు అన్నింటికీ ఆధారం ఆధార్‌ కార్డే అయింది. జాతీయ ఆహార భద్రతా చట్టం-2013ని తీసుకొచ్చారు.

2009లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉచిత, నిర్బంధ విద్య కోసం బాలల హక్కు చట్టాన్ని అమలు చేసింది. సింగ్‌ హయాంలో భారతదేశం అధిక ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేసింది. భారతదేశ GDP వృద్ధి రేటు 2004-2008 మధ్య 8 శాతం కంటే ఎక్కువగా నమోదైంది. రోడ్లు, విద్యుత్, నీటి సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మన్మోహన్ సింగ్ భారత్ నిర్మాణ్ యోజనను ప్రారంభించారు. జననీ సురక్ష యోజన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వంటి పథకాలను తీసుకొచ్చారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు మన్మోహన్ సింగ్‌.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్