Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Degree Courses: ఇకపై డిగ్రీ థర్డ్‌ ఇయర్‌లో లాంగ్వేజ్‌ సబ్జెక్టులుండవ్‌.. అన్నీ కోర్‌ సబ్జెక్టులే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులకు అలర్ట్.. ఇకపై డిగ్రీ మూడో సంవత్సరంలో ల్యాంగ్వేజ్ సబ్జెక్టులను పూర్తిగా తొలగించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి రానుంది..

Degree Courses: ఇకపై డిగ్రీ థర్డ్‌ ఇయర్‌లో లాంగ్వేజ్‌ సబ్జెక్టులుండవ్‌.. అన్నీ కోర్‌ సబ్జెక్టులే
Degree Courses
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 27, 2024 | 8:53 AM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 26: తెలంగాణ ఉన్నత విద్యామండలి డిగ్రీ విద్యావిధానంలో కీలక మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా థర్డ్‌ ఇయర్‌లో లాంగ్వేజెస్‌కు స్వస్థి చెప్పేందుకు సిద్ధమైంది. థర్డ్‌ ఇయర్‌లో కేవలం కోర్‌ సబ్జెక్టులకే పరిమితం చేయనుంది. ఇందుకోసం డిగ్రీ మూడో సంవత్సరంలో లాంగ్వేజెస్‌ను పూర్తిగా తొలగించింది. దీంతో ఇకపై డిగ్రీ ఫస్ట్‌, సెకండియర్‌లోనే ల్యాంగ్వేజ్‌ సబ్జెక్టులు చదవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయంపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది కూడా. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.

నిజానికి ఇదేమీ కొత్త విధానం కాదు. ఇది గతంలోనూ అమలైంది. కానీ 2021లో డిగ్రీ కోర్సులను సంస్కరించడంలో భాగంగా ఉన్నత విద్యామండలి థర్డ్‌ ఇయర్‌లో లాంగ్వేజెస్‌ను తిరిగి అమలు చేయడం ప్రారంభించింది. అయితే ఈ విధానం ప్రారంభించి నాలుగేళ్లు దాటకుండానే ఈ నిర్ణయంపై ఉన్నత విద్యామండలి యూ టర్న్‌ తీసుకుంది. అయితే అప్పుడు నిర్ణయం తీసుకున్న వారిలో ఒక్కరు కూడా ప్రస్తుతం ఉన్నత విద్యామండలిలో లేరనే విషయం మాత్రం స్పష్టం అవుతుంది.

ల్యాంగ్వేజెస్‌కు బదులు డిగ్రీ థర్డ్‌ ఇయర్‌లో ప్రాజెక్ట్‌ వర్క్‌ను ఉన్నత విద్యామండలి తప్పనిసరి చేసింది. ప్రాక్ట్రికల్స్‌కు బదులుగా ప్రాజెక్ట్‌ను అంతర్భాగం చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి ఇంజినీరింగ్‌ సహా కొన్ని కోర్సుల్లో మాత్రమే ప్రాజెక్ట్‌ వర్క్‌ను అమలుచేస్తున్నారు. ప్రాజెక్ట్‌ వర్క్‌కు కూడా క్రెడిట్స్‌ ఉంటాయి. ఆ క్రెడిట్స్‌ను విద్యార్థులు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ మార్పులు ఏడాది ముగింపులో ఇచ్చే మార్కులకు కలుపుతారు. మూక్స్‌-స్వయం, ఎన్‌పీటీఎల్‌ వంటి ఆన్‌లైన్‌ వేదికల ద్వారా అభ్యసించిన కోర్సుల క్రెడిట్స్‌ను సైతం క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఇవ్వాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..