Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APEAPCET BiPC Counselling: ఏటా ఆలస్యంగా ఫార్మసీ కోర్సుల కౌన్సెలింగ్‌.. ఏడాది ముగుస్తున్నా కొలిక్కిరాని ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యేటా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్య మవుతుండటంపై విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఏకంగా విద్యా సంవత్సరం ముగుస్తున్న ఇంకా ఫార్మసీ కోర్సుల కౌన్సెలింగ్ పూర్తి కాలేదు. దీంతో విద్యార్ధులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

APEAPCET BiPC Counselling: ఏటా ఆలస్యంగా ఫార్మసీ కోర్సుల కౌన్సెలింగ్‌.. ఏడాది ముగుస్తున్నా కొలిక్కిరాని ప్రక్రియ
APEAPCET BiPC Counselling
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 27, 2024 | 9:19 AM

అమరావతి, డిసెంబర్‌ 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల కౌన్సెలింగ్‌ ప్రక్రియ మరింత ఆలస్యంగా జరుగుతున్నాయి. దీంతో విద్యా సంవత్సరం ముగింపు వరకు ప్రవేశాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఫలితంగా తరగతులు ఆలస్యంగా మొదలై చివరన పరీక్షలు సకాలంలో పూర్తి కావడం లేదు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో తీత్ర జాప్యం నెలకొంది. ఈ ఏడాది బైపీసీ స్ట్రీమ్‌ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల కన్వీనర్‌ కోటా తుది విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌ డిసెంబరు 24తో పూర్తయింది. ఇందులో ఇంకా యాజమాన్య కోటా, స్పాట్‌ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ పెండింగ్‌లోనే ఉంది. ఇందుకు మరో 10 నుంచి15 రోజులు పడుతుందేమో.

ఫార్మసీ కోర్సులకు సంబంధించి యేటా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాశాఖ అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇవి సకాలంలో రాకపోవడంతో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆలస్యమవుతోంది. విద్యా సంవత్సరం ముగింపునకు చేరుకుంటున్నా కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొలిక్కి రావడం లేదు. ఇలా బైపీసీ స్ట్రీమ్‌ ఇంజినీరింగ్, ఫార్మసీ కౌన్సెలింగ్‌ జాప్యం గత కొన్నేళ్లుగా పరిపాటైపోయింది. కనీసం అక్టోబరుకు అటు ఇటుగా ప్రవేశాల కౌన్సెలింగ్‌ పూర్తయితే విద్యా సంవత్సరం సకాలంలో ముగిసేందుకు అవకాశం ఉంటుంది.

ఇదిలా ఉంటే పాలిటెక్నిక్‌లోని డిప్లొమా ఇన్‌ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్‌ ప్రకటన ఇప్పటి వరకు విడుదల కాకపోవడం మరో వింత. ఇలా కళాశాలల అనుమతులు ఏటా ఆలస్యమవుతుండటంతో ఇతర డిప్లొమా కోర్సులకు పరీక్షలు ముగిసిన తర్వాత వీరికి పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది. రాష్ట్రంలో డీ-ఫార్మసీకి సంబంధించి 50 కళాశాలలు ఉండగా.. వాటిల్లో 30 కళాశాలలకు మాత్రమే అనుమతులు లభించాయి. ఇలాంటి జాప్యాల కారణంగా విద్యా సంవత్సరం ఏప్రిల్, మే నెలలతో పూర్తి కావాల్సి ఉన్నా.. జూన్, జులై వరకు ఫార్మసీ పరీక్షలు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.