చేతి గోళ్లను అందంగా పెంచి, రంగురంగుల నెయిల్ పాలిష్ వేసి మురిసిపోతుంటారు మగువలు. అయితే నెయిల్ పాలిష్‌లో ఉండే వివిధ రకాల రసాయనాలు గోళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటున్నారు నిపుణులు
TV9 Telugu
నిజానికి, గోళ్లకు రంగులు వేయడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి..? నెయిల్ పాలిష్ అమ్మాయిల అలంకరణలో ఒకటి. అమ్మాయిలు తమ గోళ్లను అందంగా మార్చుకోవడానికి వివిధ రంగుల నెయిల్ పాలిష్‌ను ఉపయోగిస్తుంటారు
TV9 Telugu
అందుకే అమ్మాయిలు.. పిల్లల నుంచి పెద్దల వరకు గోళ్లకు అందంగా నెయిల్ పాలిష్ అలంకరించుకుంటూ ఉంటారు. కానీ నెయిల్ పాలిష్ ఎక్కువగా వేయడం వల్ల కొన్ని తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
తమ గోళ్లు అందంగా కనిపించేందుకు రకరకాల నెయిల్ పాలిష్ వేసుకుంటారు. నెయిల్ ఆర్ట్ ఫ్యాషన్‌లో భాగంగా లెక్కకు మించినన్ని సార్లు నెయిల్ పాలిష్‌లను వినియోగిస్తుంటారు
TV9 Telugu
నెయిల్ పాలిష్ తరచుగా ఉపయోగించడం గోళ్లకు చాలా హానికరం. దీని అధిక వినియోగం మూత్రపిండాలు, కాలేయం, గుండె సమస్యలకు దారి తీస్తుంది
TV9 Telugu
నెయిల్ పెయింట్స్‌లో టోలున్, డిప్రోపైల్ థాలేట్, ఫార్మాల్డిహైడ్ వంటి హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మ అలెర్జీలకు కారణం అవుతాయి. పైగా గోళ్లను కూడా బలహీనం చేస్తుంది
TV9 Telugu
ఈ రసాయనాలన్నీ గోళ్లు పసుపు రంగులోకి మారుతాయి. క్యాన్సర్, సంతానలేమి సమస్యలు, ఇతర తీవ్రమైన వ్యాధులు కలిగిస్తాయి. నెయిల్ పాలిష్‌లో ఉండే టొల్యూన్ తలనొప్పి, తల తిరగడం, వికారం కలిగిస్తుంది
TV9 Telugu
ఇది నాడీ వ్యవస్థపై చెడు ప్రభావాలను చూపుతుంది. ఫార్మాల్డిహైడ్ అనేది రంగులేని వాయువు. దీని వల్ల స్కిన్ అలర్జీ వస్తుంది. డిప్రోపైల్ థాలేట్ గోరు నష్టంతో పాటు సంతానలేమి సమస్యలను కలిగిస్తుంది