Heat Stroke: హీట్‌ స్ట్రోక్‌ అంటే ఏమిటి..? ఇది వస్తే శరీరంలోని ఏయే అవయవాలు దెబ్బతింటాయి..?

Heat Stroke: భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి గాలుల కారణంగా తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి. వీటిలో వాయువ్య భారతదేశం కొంకణ్‌ తీరం, మధ్య భారతదేశం, తెలంగాణ..

Heat Stroke: హీట్‌ స్ట్రోక్‌ అంటే ఏమిటి..? ఇది వస్తే శరీరంలోని ఏయే అవయవాలు దెబ్బతింటాయి..?
Follow us
Subhash Goud

|

Updated on: Mar 23, 2022 | 9:27 AM

Heat Stroke: భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి గాలుల కారణంగా తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి. వీటిలో వాయువ్య భారతదేశం కొంకణ్‌ తీరం, మధ్య భారతదేశం, తెలంగాణ ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాబోయే కొద్ది రోజుల్లో వేడి గాలులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు రాబోయే వారంలో తీవ్రమైన వేడి గాలులు (Hot Winds) ఉంటాయని తెలిపింది. ఢిల్లీలో సఫ్టర్‌జంగ్‌ స్టేషన్‌లో ఈ సీజన్‌లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 38.3 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. ఇది సాధారణం కంటే ఎనిమిది డిగ్రీలు ఎక్కువగా ఉంది. అయితే తూర్పు ఢిల్లీలోని పితంపుర, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో దాదాపు 40కి చేరింది. మార్చి 21న 39.9 డిగ్రీలుగా నమోదయ్యాయి.

హీట్‌ స్ట్రోక్‌ అంటే ఏమిటి?

హీట్‌ స్ట్రోక్‌.. దీనినే వడదెబ్బ కూడా అంటారు. డాక్టర్‌ పాథక్‌ వివరాల ప్రకారం.. మీ శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడు ఈ అత్యంత తీవ్రమైన వేడి, వడదెబ్బ (Heat stroke) సంభవించవచ్చు. వేసవి నెలల్లో ఈ పరిస్థితి సర్వసాధారణం అని చెబుతున్నారు. వడదెబ్బ రాగానే అత్యవసరంగా వైద్యం అందించాల్సిందే. లేకపోతే ప్రాణాలకే ముప్పు ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

శరీర ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణం ఏమిటి?

వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉండటం కారణంగా శరీర ఉష్ణోగ్రత (40 డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకంటే ఎక్కువ) పెరగడం వల్ల హీట్ స్ట్రోక్‌ అనేది వస్తుంది. అధిక శరీర ఉష్ణోగ్రతను సకాలంలో నిరోధించకపోతే శాశ్వతంగా ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది. మెదడు లేదా మూత్రపిండాలు, మరణాలు కూడా సంభవించవచ్చు అని డాక్టర్ పాఠక్ హెచ్చరిస్తున్నారు. పిల్లలు (5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు), వృద్ధులు (65 ఏళ్లు పైబడినవారు), గర్భిణీ స్త్రీలు, ఊబకాయం ఉన్నవారు హీట్ స్ట్రోక్‌కి గురయ్యే ప్రమాదం ఎక్కవుగా ఉంటుందట. ఈ వేసవిలో వేడిగా ఉన్న ప్రాంతంలో ఎక్కువగా పని చేస్తున్నట్లయితే జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా ఎండా వేడి కారణంగా స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

హీట్‌స్ట్రోక్ లక్షణాలు ఏమిటి?

హీట్ స్ట్రోక్ బారిన పడిన వారు అలసట, తలనొప్పి, తల తిరగడం, వికారం వంటివి సర్వసాధారణం. హీట్‌స్ట్రోక్ రాకముందే తరచుగా చెమటలు పట్టడం వంటివి ఉంటాయి. అలాగే నడవడంలో ఇబ్బంది, మూర్ఛలు లేదా స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు అని అంటున్నారు డాక్టర్ పాఠక్.

ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

మీరు వడదెబ్బతో బాధపడుతుంటే నీడలోకి వెళ్లడం లేదా నీరు తాగడం వంటి సాధారణ శీతలీకరణ చర్యలు పని చేయవు. దీనిని నివారించడానికి ఉత్తమ మార్గం చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉండటం. రోజులో అత్యంత వేడిగా ఉండే సమయంలో ఎండ నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. అది సాధ్యం కాకపోతే చల్లబర్చడానికి చిన్నపాటి విశ్రాంతి తీసుకోండని డాక్టర్ సలహా ఇస్తున్నారు. ఇలాంటి వారు వైద్యులను సంప్రదించడం మంచిది. హీట్‌స్ట్రోక్‌కు గురైతే దుస్తులు తీసివేయాలి. రోగిని ఓపెన్ లేదా ఎయిర్ కండిషన్డ్ వాహనాల్లో తరలించాలి. రోగికి గోరువెచ్చని నీటితో స్ప్రే చేయడం, ఫ్యాన్‌లను ఉపయోగించడం కూడా చాలా మంచిది.

ఇవి కూడా చదవండి:

Health Tips: వేసవిలో గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది..!

Oragen Alert: తెలంగాణలో ఆరంజ్ అలర్ట్..అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు.. అధికారుల హెచ్చరిక

డీఎస్సీ వయోపరిమితి పెంపుపై విద్యాశాఖ కసరత్తులు.. మంత్రి లోకేశ్‌
డీఎస్సీ వయోపరిమితి పెంపుపై విద్యాశాఖ కసరత్తులు.. మంత్రి లోకేశ్‌
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరో అద్భుత నిర్మాణం.. ఎత్తైన శివ మందిరం
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరో అద్భుత నిర్మాణం.. ఎత్తైన శివ మందిరం
నంగనాశిలా నాటకాలు వేసి.. పాపం ఆ అమ్మాయిని అబాసుపాలు చేసి..
నంగనాశిలా నాటకాలు వేసి.. పాపం ఆ అమ్మాయిని అబాసుపాలు చేసి..
ఇక వరదలను ముందుగానే గుర్తించొచ్చు.. గూగుల్ AI సరికొత్త ఇన్వెన్షన్
ఇక వరదలను ముందుగానే గుర్తించొచ్చు.. గూగుల్ AI సరికొత్త ఇన్వెన్షన్
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్న నయనతార.! మరింత గ్లామరస్ గా..
యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్న నయనతార.! మరింత గ్లామరస్ గా..
రోగిని పొదల్లో పడేసిన అంబులెన్స్ సిబ్బంది.. రోగి మృతి
రోగిని పొదల్లో పడేసిన అంబులెన్స్ సిబ్బంది.. రోగి మృతి
క్లాట్ 2025 ప్రవేశ పరీక్ష తేదీఇదే.. వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులు
క్లాట్ 2025 ప్రవేశ పరీక్ష తేదీఇదే.. వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులు
ఎన్టీఆర్ పై అభిమానం.. ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా.. ?
ఎన్టీఆర్ పై అభిమానం.. ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా.. ?
తెలంగాణ నుంచి శబరిమలకు అదనంగా మరో 9 స్పెషల్ ట్రైన్స్..
తెలంగాణ నుంచి శబరిమలకు అదనంగా మరో 9 స్పెషల్ ట్రైన్స్..
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు