AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hot Water Benefits in Summer: వేసవి కాలంలో వేడి నీటితో స్నానం మంచిదేనా? షాకింగ్ విషయాలు మీకోసం..

Hot Water Benefits in Summer: వేసవి కాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు..

Hot Water Benefits in Summer: వేసవి కాలంలో వేడి నీటితో స్నానం మంచిదేనా? షాకింగ్ విషయాలు మీకోసం..
Hot Water Shower
Shiva Prajapati
|

Updated on: Mar 23, 2022 | 10:08 AM

Share

Hot Water Benefits in Summer: వేసవి కాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు జనాలు. అయితే, ఈ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది చన్నీళ్లగా స్నానం చేస్తుంటారు. స్విమ్మింగ్ పూల్స్‌లో, బావులు, చెరువులలో ఈత కొడుతుంటారు. అయితే, కొందరు వేసవి కాలంలోనూ వేడి నీటితో స్నానం చేయడానికి ఇష్ట పడుతారు. మరికొందరు వేడి నీటి స్నానం చేయాలా? వద్దా? అని సందేహపడుతారు. ఈ నేపథ్యంలోనే మనం ఇవాళ వేసవిలో వేడి నీటితో స్నానం చేస్తే కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కండరాల రిలీఫ్.. మనం రోజంతా పని చేయడం వల్ల కండరాల్లో నొప్పి వస్తుంది. ఒళ్లంతా పట్టేసినట్లుగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో వేడి నీటితో స్నానం చేయడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఇది కండరాలకు రిలాక్స్ ఇస్తుంది. నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.. వేసవి కాలంలో ఎయిర్ కండీషనర్ ఆన్‌ చేసి హాయిగా నిద్రపోతారు. అయితే మరుసటి రోజు తుమ్ములు, దగ్గులతో సతమతం అవుతారు. తీవ్రమైన ఆందోళన మనసులో అలజడి రేపుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే.. వేసవి కాలంలో వేడి నీటితో స్నానం చేయడం ఉత్తమం. ఒత్తిడి తగ్గించి, గాఢ నిద్ర పట్టాలంటే వేడి నీటితో స్నానం ఉత్తమం.

చర్మాన్ని శుభ్రపరుస్తుంది.. వేడి నీరు మీ చర్మాన్ని మరింత మెరుగ్గా శుభ్రపరుస్తుంది. వేడి నీరు శ్వేద రంద్రాలను తెరుచుకునేలా చేస్తుంది. ఈ శ్వేద రంద్రాలు శుభ్రంగా ఉంటే.. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి.

మైగ్రేన్, తలనొప్పి నుంచి ఉపశమనం.. వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఋతుస్రావం సమయంలో వచ్చే తిమ్మిర్లు, మైగ్రేన్, తలనొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.

Also read:

EPFO E Nomination: మార్చి 31లోగా ఇ-నామినేషన్ చేయండి.. లేదంటే తిప్పలు తప్పవు.. పూర్తివివరాలివే..!

Chanakya Niti: మంచినీళ్లు ఎప్పుడు తాగాలో.. ఎప్పుడు తాగకూడదో తెలుసా?.. చాణక్య చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం..

Viral Video: ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసో!.. హృదయాలను దోచుకుంటున్న బ్యూటీఫుల్ వీడియో..!