AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: మంచినీళ్లు ఎప్పుడు తాగాలో.. ఎప్పుడు తాగకూడదో తెలుసా?.. చాణక్య చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం..

Chanakya Niti: ఆచార్య చాణక్యుడి గురించి తెలియని భారతీయుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రజలకు జీవన మార్గాన్ని నిర్దేశించిన మార్గదర్శకుడు..

Chanakya Niti: మంచినీళ్లు ఎప్పుడు తాగాలో.. ఎప్పుడు తాగకూడదో తెలుసా?.. చాణక్య చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం..
Chanakya Neeti
Shiva Prajapati
|

Updated on: Mar 23, 2022 | 7:57 AM

Share

Chanakya Niti: ఆచార్య చాణక్యుడి గురించి తెలియని భారతీయుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రజలకు జీవన మార్గాన్ని నిర్దేశించిన మార్గదర్శకుడు ఆయన. ఒక జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ఏ విధమైన జీవన శైలిని అనుసరించాలి. ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, వంటి అనేక అంశాలను ప్రస్తావిస్తూ నీతి శాస్త్రాన్ని రచించారు. ఇందులో భాగంగానే మనిషికి అత్యంత ముఖ్యమైన నీటిని ఏ సమయంలో తాగాలో కూడా వివరించారు. ఏం సమయంలో నీరు తాగితే ఆరోగ్యానికి మంచి చేస్తుంది? ఏ సమయంలో నీరు తాగితే హానీ చేస్తుంది? అనే అంశాలను క్లియర్‌గా వివరించారు.

నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుందని ఆచార్య విశ్వసించారు. ఇది మీ జీర్ణవ్యవస్థను మెరుగ్గా పని చేయడానికి ప్రేరేపిస్తుంది. శరీరం నుండి విష పదార్థాలను తొలగిస్తుంది. అజీర్తితో బాధపడుతున్నట్లయితే.. ఉదయం సమయంలో నీరు తాగితే ప్రయోజనం ఉంటుంది. ఉదర సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి.

భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో కొన్ని నీళ్లు మాత్రమే తాగితే అది మీ శరీరానికి అమృతంలా పనిచేస్తుంది. పెద్ద ప్రేగులో ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇలా తాగడం వల్ల అతిగ తినలేరు. ఫలితంగా మీరు తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మీ పొట్టను మంచి ఆకృతిలో ఉంచుతుంది.

అయితే, ఆహారం తీసుకునేటప్పుడు ఎక్కువ నీరు తాగినా, ఆహారం తిన్న తారువాత ఎక్కువ నీరు తాగినా.. అది శరీరంలో విషంలా పని చేస్తుంది. ఇది మీ జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగిస్తుంది. ఉదర సంబంధిత సమస్యలు మొదలవుతాయి. పొట్ట పెరుగుతుంది. కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. శరీరంలోని సగం వ్యాధులకు ఇదే ప్రధాన కారణంగా పరిగణించబడుతుంది. అందుకే.. భోజనం చేసిన అరగంట, గంట తర్వాత వరకు నీళ్లు తాగొద్దు.

Also read:

Vijay Devarakonda: జోరుపెంచిన రౌడీ స్టార్.. ఆ స్టార్ దర్శకుడితో విజయ్ సినిమా చేయనున్నాడా.?

Hyderabad: సికింద్రాబాద్‌లో టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం

Nitin Gadkari: పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. వాహనదారులకు కేంద్రం శుభవార్త.. భారీ ప్రణాళిక