Bhagavad Gita: పాఠశాలల్లో బోధనాంశంగా భగవద్గీత ఎందుకు ఉండొద్దు.. గుజరాత్ మంత్రి కీలక వ్యాఖ్యలు
వచ్చే విద్యా సంవత్సరం 2022-23 నుంచి గుజరాత్ (Gujarat) రాష్ట్ర వ్యాప్తంగా 6-12 తరగతుల విద్యార్థుల సిలబస్ లో భాగంగా బోధనాంశంగా భగవద్గీత ఉంటుందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జితు వాఘాని స్పష్టం చేశారు. విద్యా శాఖకు...

వచ్చే విద్యా సంవత్సరం 2022-23 నుంచి గుజరాత్ (Gujarat) రాష్ట్ర వ్యాప్తంగా 6-12 తరగతుల విద్యార్థుల సిలబస్ లో భాగంగా బోధనాంశంగా భగవద్గీత ఉంటుందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జితు వాఘాని స్పష్టం చేశారు. విద్యా శాఖకు బడ్జెట్ కేటాయింపులపై చర్చ సందర్భంగా ఈ వివరణ చేశారు. భగవద్గీత (Bhagavad Gita) అనేది భారత సంస్కృతిలో భాగమని, పాఠశాలల్లో ఈ గ్రంథాన్ని ఎందుకు బోధించకూడదని (Teaching) ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన నూతన విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్వాగతించారు. అంతే కాకుండా గుజరాత్ రాష్ట్ర మంత్రులను విమర్శించారు. ‘‘భగవద్గీతను బోధనాంశంగా చేర్చడం గొప్ప ముందడుగే. అయితే దీనిని ప్రవేశపెట్టినవారు ముందుగా ‘గీత’ ప్రవచించిన విలువలను ఆచరించాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించారు.
అయితే ఈ నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ, సంఘ్ పరివార్ లు భగవద్గీతను బలవంతంగా విద్యార్థుల మెదళ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. నైతిక శాస్త్రం, నీతి, వంటివి తల్లిదండ్రులు బోధిస్తే సరిపోతుందని, ఈ మాత్రం దానికి పాఠశాలల్లో మత గ్రంథాలు బోధించడం దేనికని అభిప్రాయపడ్డారు. మరోవైపు.. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్వాగతించాయి. శ్రీమద్ భగవద్గీతను సిలబస్‌లో చేర్చాలనే నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని గుజరాత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి హేమంగ్ రావల్ అన్నారు. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థులకు మేలు జరుగుతుందని గుజరాత్ ఆప్ అధికార ప్రతినిధి యోగేష్ జద్వానీ పేర్కొన్నారు.
తాజాగా కర్ణాటక కూడా ఇదే నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. విద్యా నిపుణులతో చర్చించి దీనిపై అధికారిక ప్రకటన చేస్తామని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బిసి నగేశ్ వెల్లడించారు. ఇటీవల కాలంలో పిల్లల్లో సాంస్కృతిక విలువలు పడిపోతున్న నేపథ్యంలో, చాలా మంది మోరల్ సైన్స్‌ను పాఠశాలల్లో బోధించాలని కోరుతున్నారని చెప్పారు. కర్ణాటక మంత్రి. గతంలో పాఠశాలల్లో వారానికోసారి మోరల్ సైన్స్ తరగతి ఉండేదని, అందులో రామాయణం, మహాభారతం వంటి వాటిని నేర్పించేవారని వివరించారు. రాజనీతజ్ఞులు కూడా వీటి నుంచి ప్రేరణ పొందినవారేనని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారి అవన్నీ చెప్పడం మానేశారని గుర్తు చేశారు.
Also Read
EPFO E Nomination: మార్చి 31లోగా ఇ-నామినేషన్ చేయండి.. లేదంటే తిప్పలు తప్పవు.. పూర్తివివరాలివే..!
Health Tips: వేసవిలో గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది..!
Tamil Nadu: కండలు చూపి కవ్వించాడు.. చివరకు కటకటాల పాలయ్యాడు.. వీడి వేశాలు తెలిస్తే అవాక్కవుతారు..!