AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO E Nomination: మార్చి 31లోగా ఇ-నామినేషన్ చేయండి.. లేదంటే తిప్పలు తప్పవు.. పూర్తివివరాలివే..!

EPFO E Nomination: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్( ఈపీఎఫ్‌ఓ ) ఈ-నామినేషన్ ( ఈపీఎఫ్‌ఓ ఇ-నామినేషన్ ) చేయని వారు..

EPFO E Nomination: మార్చి 31లోగా ఇ-నామినేషన్ చేయండి.. లేదంటే తిప్పలు తప్పవు.. పూర్తివివరాలివే..!
Epfo
Shiva Prajapati
|

Updated on: Mar 23, 2022 | 9:19 AM

Share

EPFO E Nomination: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్( ఈపీఎఫ్‌ఓ ) ఈ-నామినేషన్ ( ఈపీఎఫ్‌ఓ ఇ-నామినేషన్ ) చేయని వారు వెంటనే పూర్తి చేయండి. మార్చి 31 చివరి తేదీగా ప్రకటించగా.. మరోసారి పొడగించే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. గడువులోగా EPFOలో ఇ-నామినేషన్ చేయకపోతే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈపీఎఫ్ ఖాతా నిలిచిపోయే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా రెండు విధాలుగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. మరి ఆ సమస్యలేంటి, ఈ నామినేషన్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

1. పీఎఫ్ బ్యాలెన్స్ స్తంభించే అవకాశం.. ఇటీవల, భారత ప్రభుత్వం ఇ-నామినేషన్‌ను తప్పనిసరి చేసింది. ఇంతకుముందు ఈ-నామినేషన్ అవసరం లేకుండే.. కానీ ఇప్పుడు ఇ-నామినేషన్ చేస్తేనే ఈపీఎఫ్ పని చేస్తుంది. దీనిలో భాగంగా ఈపీఎఫ్ ఖాతాలో నామినీని నమోదు చేయాల్సి ఉంటుంది. EPF ఖాతాదారుడు కుటుంబంలోని ఎవరినైనా నామినీగా చేసుకోవచ్చు. నామినీని చేయకపోతే.. ఒకవేళ ఖాతాదారు చనిపోతే, ఈపీఎఫ్‌లో డిపాజిట్ చేసిన మొత్తం డబ్బు నిలిచిపోతుంది. పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు తీసుకోవాలంటే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. ఈ సమస్యలు రావొద్దంటే EPFOలో ఇ-నామినేషన్‌ను ఫైల్ చేయడం తప్పనిసరి.

2. పాస్ బుక్ కూడా చూడలేని పరిస్థితి.. ఈపీఎఫ్‌వోలో ఈ-నామినేషన్‌ చేయకపోతే పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేయలేరు. పైగా పాస్‌బుక్ కూడా ఓపెన్ అవదు. మీరు పాస్‌బుక్ బ్యాలెన్స్ తెలుసుకోవాలన్నా.. PF ఖాతా వివరాలను చూడాలన్నా.. మార్చి 31 లోపు ఇ-నామినేషన్ చేయడం తప్పనిసరి. ఒకవేళ ఈ నామినేషన్ ఫిల్ చేయకపోతే.. మార్చి 31 తర్వాత మీరు EPFO పాస్‌బుక్‌ని చూడటానికి వీలు పడదు. స్క్రీన్‌పై పాప్ అప్ మెసేజ్ వస్తుంది. ఇ-నామినేషన్ జరగలేదని చూపిస్తుంది.

ఈ-నామినేషన్ ఎలా చేయాలంటే.. 1. epfindia.gov.in కు వెళ్లి లాగిన్ అవ్వండి 2 ‘సర్వీసెస్’ ట్యాబ్‌కు వెళ్లి, డ్రాప్-డౌన్ మెనులో ‘ఫర్ ఎంప్లాయిస్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. 3. లాగిన్ చేయడానికి మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని ఉపయోగించండి 4. ‘మేనేజ్‌మెంట్’ ట్యాబ్‌లో ‘ఇ-నామినేషన్’పై క్లిక్ చేసి, ఆపై మీ శాశ్వత, ప్రస్తుత చిరునామాను నమోదు చేయండి. 5. మీ కుటుంబ ఉందా అని పైన అడిగిన ప్రశ్నకు ‘అవును’ సమాధానం ఎంచుకోవాలి. 6. నామినీ వివరాలను నమోదు చేసి, ‘సేవ్’పై క్లిక్ చేయండి. 7. ఆపై ‘ప్రొసీడ్’ క్లిక్ చేయండి. 8. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడిన మీ ఆధార్ నంబర్, వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని నమోదు చేయండి.

Also read:

Vijay Devarakonda: జోరుపెంచిన రౌడీ స్టార్.. ఆ స్టార్ దర్శకుడితో విజయ్ సినిమా చేయనున్నాడా.?

Hyderabad: సికింద్రాబాద్‌లో టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం

Nitin Gadkari: పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. వాహనదారులకు కేంద్రం శుభవార్త.. భారీ ప్రణాళిక