Vijay Devarakonda: జోరుపెంచిన రౌడీ స్టార్.. ఆ స్టార్ దర్శకుడితో విజయ్ సినిమా చేయనున్నాడా.?

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లైగర్  డిఫరెంట్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

Vijay Devarakonda: జోరుపెంచిన రౌడీ స్టార్.. ఆ స్టార్ దర్శకుడితో విజయ్ సినిమా చేయనున్నాడా.?
Vijay Devarakonda
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 23, 2022 | 7:12 AM

Vijay Devarakonda: క్రేజీ హీరో విజయ్ దేవరకొండ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్(Puri Jagannadh) ఇద్దరు కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లైగర్(liger )డిఫరెంట్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ మూవీలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాదు ఈ మూవీలో లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.ఆమె ఈ మూవీలో విజయ్ కు తల్లిగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి పూరి దర్శకత్వలోనే సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాకు జనగణమన అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ మూవీలో విజయ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడట.

ఇదిలా ఉంటే విజయ్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని ఆమధ్య వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఎక్కడ టాక్ వినిపించడం లేదు. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గానటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది. స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో విజయ్ సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది.  రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయబోతున్నారని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలీదు కానీ వీరిద్దరి సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు అంటున్నారు. ఇక త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా చేయనున్నాడు. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే మహేష్ త్రివిక్రమ్ తో చేతులు కలపనున్నాడు. త్రివిక్రమ్ తో మహేష్ బాబు చేస్తున్న సినిమా ఈ ఏడాది చివరి వరకు పూర్తవుతుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఏంజరుగుతుందో.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Raashi Khanna: బొద్దుగా ఉన్నందుకు అలా వెటకారంగా పిలిచేవారు.. బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌ను గుర్తు చేసుకున్న రాశి..

Viral Video: ఇదేం ఫాలోయింగ్‌ రా బాబూ!.. గులాబీ పూలతో ఆ హీరో వెంటపడిన అమ్మాయిలు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

Chiranjeevi: జాతీయ సాంస్కృతిక మహోత్సవాల సక్సెస్‌కు మెగాస్టార్‌ పిలుపు.. ఉత్సవాలు ఎప్పటినుంచంటే..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?