AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేం ఫాలోయింగ్‌ రా బాబూ!.. గులాబీ పూలతో ఆ హీరో వెంటపడిన అమ్మాయిలు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

Kartik Aaryan: ప్రస్తుతం బాలీవుడ్‌ (Bollywood) లో బాగా క్రేజ్‌ ఉన్న యంగ్‌ హీరోల్లో కార్తిక్‌ ఆర్యన్‌ ఒకడు. ‘ప్యార్‌ కా పంచనామా’ తో వెండితెరకు పరిచయమైన ఈ హ్యాండ్సమ్‌ హీరో సోనీ కి టీటు కీ స్వీటీ, లుకా చుప్పి, పతి పత్నీ అవురో ఓహ్‌, లవ్‌ ఆజ్‌కల్‌ 2, ధమాకా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Viral Video: ఇదేం ఫాలోయింగ్‌ రా బాబూ!.. గులాబీ పూలతో ఆ హీరో వెంటపడిన అమ్మాయిలు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..
Bollywood Actor
Basha Shek
|

Updated on: Mar 23, 2022 | 6:30 AM

Share

Kartik Aaryan: ప్రస్తుతం బాలీవుడ్‌ (Bollywood) లో బాగా క్రేజ్‌ ఉన్న యంగ్‌ హీరోల్లో కార్తిక్‌ ఆర్యన్‌ ఒకడు. ‘ప్యార్‌ కా పంచనామా’ తో వెండితెరకు పరిచయమైన ఈ హ్యాండ్సమ్‌ హీరో సోనీ కి టీటు కీ స్వీటీ, లుకా చుప్పి, పతి పత్నీ అవురో ఓహ్‌, లవ్‌ ఆజ్‌కల్‌ 2, ధమాకా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్న ఈ హ్యాండ్సమ్‌ హీరో అంటే అమ్మాయిలు పడిచచ్చిపోతున్నారు. ఇటీవలే ఓ నెటిజన్‌ రూ. 20 కోట్లు ఇస్తా పెళ్లి చేసుకుంటావా అని కార్తిక్‌ (KartikAaryan) కు మ్యారేజ్ ప్రపోజల్‌ పెట్టిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఇద్దరు అమ్మాయిలు ఈ హీరో ఇంటి దగ్గరకు వచ్చి ‘కార్తిక్ బయటకు రావాలి’ అని రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు ఈ హ్యాండ్సమ్‌ హీరో. కాగా ఇటీవల వేకేషన్‌ కోసం గోవా వెళ్లాడు ఈ యంగ్‌ హీరో. అక్కడి నుంచి తిరిగి వస్తూ ముంబై విమానాశ్రయం వద్ద మీడియా కంటపడ్డాడు.

నా బర్త్ డే అంటూ..

అదే సమయంలో అక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఎర్ర గులాబీలు చేత పట్టుకుని కార్తిక్‌ వెంటపడ్డారు. అయితే వారిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు కార్తిక్‌. అయితే అందులో ఒక అమ్మాయి ‘ఈరోజు నా పుట్టిన రోజు’ అని ఫ్లవర్‌ బొకేను ఇచ్చేందుకు ప్రయత్నించగా.. అందులో కొన్ని గులాబీలు మాత్రమే తీసుకున్నాడు కార్తిక్‌. ఆ తర్వాత వారితో కలిసి ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చాడు. కాగా లేడీ ఫ్యాన్స్ చూపిన అభిమానానికి సిగ్గు పడిపోయాడు ఈ హీరో. చిరునవ్వులు చిందించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరలవుతోంది. ‘సూపర్‌ ఫాలోయింగ్‌’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అలవైకుంఠపురముంలో హిందీ రీమేక్‌ షెహజాదాలో నటిస్తున్నాడు కార్తిక్‌. అదేవిధంగా భూల్‌ భూలయ్యా 2 సినిమా షూటింగ్‌లో కూడా బిజీగా ఉన్నాడు.

Also Read:వేసవిలో కర్బూజ‌తో ఉప‌యోగాలు..

Sadhguru: సద్గురు జగ్గీ వాసుదేవ్ 100 రోజుల బైక్ జర్నీ.. 27 దేశాలను అనుసంధానిస్తూ ప్రయాణం.. ఎందుకో తెలుసా..

Viral Video: కొంపముంచిన బంతి.. క్యాచ్ పట్టాలనుకుంటే దిమ్మతిరిగిపోయింది.. షాకింగ్ వీడియో వైరల్..

విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు
కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు