Sadhguru: సద్గురు జగ్గీ వాసుదేవ్ 100 రోజుల బైక్ జర్నీ.. 27 దేశాలను అనుసంధానిస్తూ ప్రయాణం.. ఎందుకో తెలుసా..

ఆధ్మాత్మిక గురువు, ప‌ర్యావర‌ణ‌వేత్త స‌ద్గురు జ‌గ్జీ వాసుదేవ్ (Sadhguru jaggi vasudev) 30 వేల కిలోమీట‌ర్ల బైక్ జ‌ర్నీకి శ్రీకారం చుట్టారు. లండన్ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ఆయ‌న 100 రోజుల పాటు బైక్‌పై జ‌ర్నీ నిర్వహించనున్నారు. సేవ్ సాయిల్..

Sadhguru: సద్గురు జగ్గీ వాసుదేవ్ 100 రోజుల బైక్ జర్నీ.. 27 దేశాలను అనుసంధానిస్తూ ప్రయాణం.. ఎందుకో తెలుసా..
Sadhguru Jaggi Vasudev
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 22, 2022 | 10:18 PM

ఆధ్మాత్మిక గురువు, ప‌ర్యావర‌ణ‌వేత్త స‌ద్గురు జ‌గ్జీ వాసుదేవ్ (Sadhguru jaggi vasudev) 30 వేల కిలోమీట‌ర్ల బైక్ జ‌ర్నీకి శ్రీకారం చుట్టారు. లండన్ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ఆయ‌న 100 రోజుల పాటు బైక్‌పై జ‌ర్నీ నిర్వహించనున్నారు. సేవ్ సాయిల్ మూమెంట్‌లో(Save Soil Movement ) భాగంగా ఆయ‌న బైక్ జ‌ర్నీ మొద‌లుపెట్టారు. లండన్‌లోని ట్రాఫల్‌గర్ స్క్వేర్ నుంచి ఈ బైక్ జర్నీని ప్రారంభించారు. ఈ ప్రయాణం 27 దేశాల గుండా 30 వేల కిలోమీటర్లు సాగనుంది. భూసారం నాణ్యతను కోల్పోయి నిస్సారంగా ఎడారిగా మారకుండా కాపాడుకోవాలని సద్గురు జగ్గీ వాసుదేవ్ సేవ్ సాయిల్ పేరిట ఉద్యమాన్ని మొదులు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా దీనిపై అవగాహన తీసుకురావాలని సుద్గురు ఈ సంకల్పాన్ని తీసుకున్నారు. ఇందులో భాగంగా  సద్గురు ఒంటరిగా మోటార్ సైకిల్‌పై యూకే, యూరప్, పశ్చిమ దేశాల గుండా ప్రయాణించనున్నారు. చివరకు భారత్‌కు చేరుకుంటారు. అమ్‌స్ట‌ర్‌డామ్‌, బెర్లిన్‌, ప్రాగ్ న‌గ‌రాల మీదుగా BMW K1600 GT బైక్‌పై ఆయ‌న ట్రావెల్ చేస్తారు.

కొన్ని నెలలపాటు సాగనున్న ఆయన ప్రయాణంలో సద్గురు ఎంతో మంది ప్రపంచ నేతలు, మీడియా, ఇతర నిపుణులను కలుసుకుంటారు. పుడమిని రక్షించుకోవడానికి ఆయన వారితో చర్చలు జరపనున్నారు. వారు కూడా అటువైపుగా నిర్ణయాలు తీసుకోవడానికి.. అడుగులు వేయడానికి ప్రోత్సహించనున్నారు.

యునైటెడ్ నేషన్స్ కాన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ ప్రకారం, 90 శాతం భూమి 2050 కల్లా నిస్సారంగా మారిపోయే ముప్పు ఉన్నది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం, నీటి సంక్షోభం ఏర్పడవచ్చని తెలుపుతున్నది. అంతేకాదు, భయానక కరువు కాటకాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని ఆ రిపోర్టు తెలుపుతున్నది. ఇది మానవాళి మనుగడకే ముప్పు. కాబట్టి, ఈ ముప్పును ముందే అడ్డుకునే ప్రయత్నం చేయాలని సద్గురు భావిస్తున్నారు.

ఈ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. నేల తల్లిని కాపాడేందుకు ఆయన చేపట్టిన ఈ ఉద్యమానికి క‌రేబియ‌న్‌ దేశాలు మ‌ద్ద‌తు తెలుపుతున్నాయి. ఈ క్రమంలోనే ప‌లు దేశాలు ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 6 కరేబియన్ దేశాలు సద్గురు నేతృత్వంలోని నేలను రక్షించే ఉద్యమంలో చేరాయి. దీని కోసం ఆయ‌నతో క‌లిసి ముందుకు సాగ‌డానికి అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి.

స‌ద్గురు జ‌గ్గీవాసుదేవ్ తో క‌లిసి నేల‌ను ప‌రిర‌క్షించే ఉద్య‌మంలో ఆరు క‌రేబియ‌న్ దేశాలు.. ఆంటిగ్వా అండ్ బార్బుడా, డొమినికా, సెయింట్ లూసియా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, గయానా, బార్బడోస్ లు చేరాయి. ఆయా దేశాలు నాయ‌కులు స‌ద్గురుతో ప్రారంభించిన సేవ్ సాయిల్ మూమెంట్‌ లో క‌లిసి ముందుకు సాగడానికి ఒప్పందంపై సంత‌కాలు చేశారు.

మట్టి క్షీణతను తిప్పికొడుతూ.. నేల త‌ల్లి ర‌క్ష‌ణ‌కు కృషి చేస్తూ.. దీర్ఘకాలిక ఆహారాన్ని అందించడానికి తమ దేశాలలో ఖచ్చితమైన చర్యను ప్రారంభించాలని ఒప్పందం సంద‌ర్భంగా వారు ప్రతిజ్ఞ చేశారు.

నేల తల్లిని కాపాడేందుకు ఆయన చేపట్టిన ఈ ఉద్యమానికి ఇప్పుడు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ వివ్ రిచర్డ్స్ తో పాటు ఇంగ్లాండ్ లెజెండరీ క్రికెటర్ ఇయాన్ బోథమ్ లు కూడా మద్దతు పలికారు.

ఇవి కూడా చదవండి: Coconut Water: వేసవికాలంలో కొబ్బరి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో తెలుసా..

Axis Bank: ఎఫ్డీలపై వడ్డీ రేట్ల పెంపు.. కీలక నిర్ణయం తీసుకున్న మరో బ్యాంక్.. ఎంత పెరిగాయంటే..