Chiranjeevi: జాతీయ సాంస్కృతిక మహోత్సవాల సక్సెస్‌కు మెగాస్టార్‌ పిలుపు.. ఉత్సవాలు ఎప్పటినుంచంటే..

జానపద, గిరిజన కళలు, సంగీతం, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రోత్సహించాలనే తలంపుతో కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహిస్తోన్న సంగతి తెలుస్తోందే.

Chiranjeevi: జాతీయ సాంస్కృతిక మహోత్సవాల సక్సెస్‌కు మెగాస్టార్‌ పిలుపు.. ఉత్సవాలు ఎప్పటినుంచంటే..
Chiranjeevi
Follow us
Basha Shek

| Edited By: Rajeev Rayala

Updated on: Mar 23, 2022 | 6:07 AM

జానపద, గిరిజన కళలు, సంగీతం, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రోత్సహించాలనే తలంపుతో కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహిస్తోన్న సంగతి తెలుస్తోందే. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలు ఈ ఉత్సవాలకు ఆతిథ్యం ఇస్తున్నాయి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈనెల 26, 27 తేదీల్లో, వరంగల్‌లో 29, 30న, హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 1 నుంచి 3 వరకు ఈ మహోత్సవాలు జరగనున్నాయి. కాగా ఈ సాంస్కృతిక ఉత్సవాలకు మెగాస్టార్‌ చిరంజీవి (CHiranjeevi) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈమేరకు కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి (Kishan Reddy) స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి ఉత్సవాలకు రావాలని మెగాస్టార్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తాజాగా ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను విడుదల చేసిన చిరంజీవి అఖిల భారత సాంస్కృతిక మహోత్సవాల (Rashtriya sanskriti mahotsav)ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

‘భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే దేశం మనది. ఆ మహోన్నత సంస్కృతిని ప్రతిబింబిచేలా జాతీయ సాంస్కృతి మహోత్సవాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈసారి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉత్సవాలు జరగనుండడం తెలుగు ప్రజలుగా మనందరికీ గర్వకారణం’ అని ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు చిరంజీవి. ఇక సినిమాల విషయానికొస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ నటించిన ఆచార్య ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. కాజల్‌, పూజాహెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Also Read:వేసవిలో కర్బూజ‌తో ఉప‌యోగాలు..

Andhra Pradesh: అలా అయితే ఆయన చాలాసార్లు చెప్పుతో కొట్టుకోవాలి.. మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్స్..!

Tamil Nadu: కండలు చూపి కవ్వించాడు.. చివరకు కటకటాల పాలయ్యాడు.. వీడి వేశాలు తెలిస్తే అవాక్కవుతారు..!