Andhra Pradesh: అలా అయితే ఆయన చాలాసార్లు చెప్పుతో కొట్టుకోవాలి.. మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్స్..!
Andhra Pradesh: పశ్చిమగోదావరి జిల్లా విభజన విషయంలో వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు తీరుపై మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Andhra Pradesh: పశ్చిమగోదావరి జిల్లా విభజన విషయంలో వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు తీరుపై మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అభ్యంతరాలు ఉంటే సీఎంకు, ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. నరసాపురం ఎమ్మెల్యేగా ప్రసాదరాజును గెలిపించుకుని తప్పు చేశానంటూ సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకుని నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ చర్యను మంత్రి పేర్ని నాని తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీలు మారినప్పుడల్లా సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకుంటున్నారని విమర్శించారు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రసాదరాజును రాజకీయంగా పతనం చేసేందుకే సుబ్బారాయుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సుబ్బారాయుడు బాధ్యతాయుతమైన పదవులెన్నో నిర్వహించారు. చాలాకాలంగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నారు. ఆయన ఇలా మాట్లాడితే ఆయన విలువే తగ్గిపోతుందని నాని చెప్పారు.
రాజకీయాలు కావాలంటే ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చని హితవు చెప్పారు మంత్రి పేర్ని నాని. భీమవరం కేంద్రంగా నరసాపురం జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అందులో ఎమ్మెల్యేకి ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారాయన. 7 నియోజకవర్గాలకు అందుబాటులో ఉంటుందని భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఎంపిక చేశాం. దీనిపై సుబ్బారాయుడికి ఏవైనా అభ్యంతరాలుంటే సీఎంను కలిసి వివరిస్తే అది పద్ధతిగా ఉంటుందన్నారు. అంతేకానీ చెప్పుతో కొట్టుకోవడం ఏమిటన్నారు నాని. ప్రసాదరాజుని రాజకీయంగా అడ్డు తొలగించుకుందామని సుబ్బారాయుడు ఆలోచన చేస్తే ప్రజలన్నీ గమనిస్తుంటారని చెప్పారు. మనకు నచ్చనప్పుడల్లా చెప్పుతో కొట్టుకోవాలంటే సుబ్బారాయుడు చాలాసార్లు చెప్పుతో కొట్టుకోవాలన్నారు పేర్ని నాని.
Also read: