Viral photo: ఈ ఫోటోలో ముందుగా మీకు ఏం కనిపిస్తుందో చెప్పగలరా.. ఠక్కున చూసేదే మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది..
ప్రతి ఒక్కరి ఆలోచన విధానం ఒకే విధంగా ఉండదు.. అలాగే ఇతరుల మాటలు అందరూ ఒకేలా అర్థం చేసుకోలేరు. కేవలం మాటలు మాత్రమే కాదు..
ప్రతి ఒక్కరి ఆలోచన విధానం ఒకే విధంగా ఉండదు.. అలాగే ఇతరుల మాటలు అందరూ ఒకేలా అర్థం చేసుకోలేరు. కేవలం మాటలు మాత్రమే కాదు.. ఒక్కోక్కరి కళ్లు ఒక్కో వస్తువును వేరే విధంగా చూస్తుంటాయి. వారు చూసే చూపు.. హావాభావాలు. వారి ఆలోచనలను బట్టి వారు ఎలాంటివారు.. వారి మనస్థత్వం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు… దీనినే సైకాలజీ అంటారు. సైకాలజీ.. మనిషి కూర్చునే కదలికలు.. నడిచే విధానం.. చూసే చూపు.. మాట్లాడే మాట.. ఇలా ఒక్కటేమిటీ.. మనిషి ప్రతి కదలికను బట్టి వారి మనస్థత్వాన్ని అంచనా వేయవచ్చు. అయితే ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ ఫోటోను చూడగానే మీకు ఠక్కున ఏది కనిపిచిందో అదే మీ మనస్థిత్వాన్ని నిర్ణయిస్తుంది.. ఇందుకు పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు..
పైన ఫోటోను చూశారు కదా.. ఆ ఫోటో చూడగాన్నే ఠక్కున మీరు ఏం అనుకున్నారు. అంటే కొందరికీ చూడగానే చెట్లు కనిపిస్తాయి. మరికొందరు పెదాలు.. ఇంకొందరు చెట్లు వేర్లు.. దట్టమైన అడవి అని చెబుతుంటారు. ఇక ఇవే పదాలు. .. మీ చూపును బట్టి మీరు ఎలాంటి వారు.. ఎలాంటి మనస్థత్వం ఉన్నవారు అనేది చెప్పవచ్చు. అవెంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా.
చెట్లు.. ముందుగా చెట్లు కనిపిస్తే.. మీరు బయటకు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపేవారు. నివేదికల ప్రకారం.. మీరు ఇతరుల అభిప్రాయాల గురించి ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. అంతేకాకుండా.. ఇతరులు మీ గురించి ఏమనుకుంటారో అనే విషయంపై ఎక్కువగా శ్రద్ధ పెడతారు.
మీరు ఇతరులకు మర్యాద ఎక్కువగా ఇస్తారు.. మీరు మీ విషయాలు ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడతారు. సామాజిక పరిస్థితులలో మీరు ఏం ఆలోచిస్తున్నారో అనేది ఇతరులు తెలుసుకోవడం చాలా కష్టం. అంటే మీ సంతోషాలు.. దుఃఖం ఇతరులకు తెలియకుండా జాగ్రత్తగా ఉంటారు. మీ చుట్టూ అనేక మంది స్నేహితులు ఉన్నా కానీ.. కొందరిని మాత్రమే మీరు నిజమైన స్నేహితులుగా భావిస్తారు. వారితోనే నిజాయితీగా ఉంటారు.
వేర్లు.. మీకు ముందుగా వేర్లు కనిపిస్తే మీరు చాలా పిరికి వారని.. అంతర్ముఖ వ్యకులని అర్థం. మీరు విమర్శనలను అంగీకరించడంలో మంచివారు.. మీ చుట్టూ ఉన్నవారికీ స్పూర్తినిచ్చేలా మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ మెరుగుపరుచుకోవడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తారు.
మీరు చాలా మృదు స్వభావులు.. అహంకారం తక్కువగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు చాలా కఠినంగా.. మొండిగా ఉంటారు.. మీరు మొదట కలుసుకునే వ్యక్తులు మీ ప్రతిభ లేదా విప్లవాత్మక లక్షణాలు లేకుండా చాలా సాధారణ వ్యక్తి అని అనుకుంటారు. కానీ వారు మీ గురించి తెలుసుకునే క్రమంలో మీరు చాలా సమర్థులు, ఉత్సాహవంతులు అని తెలుసుకున్నప్పుడు వారి అభిప్రాయం మారుతుంది
పెదవులు.. మీకు ముందుగా పెదాలు కనిపిస్తే మీరు చాలా సాధారణమైన లేదా ప్రశాంతమైన వ్యక్తి అని అర్థం..
మీరు నాటకానికి దూరంగా సాధారణంగా జీవించడానికి ఇష్టపడతారు. సంక్లిష్టతలతో నిర్ధారణ కోసం అనవసరమైన కదలిక తో కలవరపడకుండా ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.
మీరు తెలివైనవారు.. అలాగే నిజాయితీగా కనిపిస్తారు. కొంతమంది మిమ్మల్ని బలహీనంగా.. అవసరం కోసం ఇతరులను ప్రార్థిస్తారని భావించవచ్చు.. కానీ వాస్తవానికి మీరు మీ సమస్యలను సొంతంగానే పరిష్కరించుకోగల సామర్థ్యం ఉన్నవారు.
Also Read: Mehreen Pirzada: జీవితం గురించి మెహ్రీన్ ఎమోషనల్ పోస్ట్.. రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతుంటాయంటూ..
Nagababu: నిహారిక ఇన్స్టా అకౌంట్ పై నాగబాబు ఆసక్తికర కామెంట్స్.. నేనే డియాక్టివేట్ చేశానంటూ..
Naga Chaitanya: సోషల్ మీడియాలో నాగచైతన్య మరో మైలు రాయి.. అసలు విషయం ఏంటంటే..