Naga Chaitanya: సోషల్ మీడియాలో నాగచైతన్య మరో మైలు రాయి.. అసలు విషయం ఏంటంటే..

అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya).. జోష్ సినిమా ద్వారా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్

Naga Chaitanya: సోషల్ మీడియాలో నాగచైతన్య మరో మైలు రాయి.. అసలు విషయం ఏంటంటే..
Nagachaitanya
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 22, 2022 | 2:54 PM

అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya).. జోష్ సినిమా ద్వారా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత వచ్చిన ఏమాయ చేసావే మూవీతో మరోసారి హిట్ అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత చైతూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. అలాగే.. చాలాసార్లు చై మూవీస్.. డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం చైతూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల బంగార్రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మరోవైపు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఇటీవల థ్యాంక్యూ సినిమా షూటింగ్ పూర్తిచేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటున్నాడు చై. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పోస్ట్స్ చేస్తూ ఫాలోవర్లను అంట్రాక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఇన్‏స్టాలో మరో మైలురాయిని దాటాడు..

యంగ్ హీరో నాగచైతన్య తన ఇన్‏స్టా ఖాతాలో 7 మిలియన్స్ పైగా ఫాలోవర్లను రీచ్ అయ్యాడు. దీంతో చైతూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెష్ తెలియజేస్తున్నారు. చైతూ ఇన్‏స్టా అకౌంట్ చూస్తే అతని అభిరుచులు స్పష్టంగా అర్థమవుతుంటాయి. అతను ఎక్కువగా ఆటోమొబైల్స్.. బైక్స్.. కార్స్ గురించి పోస్ట్ చేస్తుంటాడు. చైతూకు ఎక్కువగా కార్ రేసింగ్ అంటే చాలా ఇష్టం.. కార్ రేసింగ్‏లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తాడు. ప్రస్తుతం చైతూ డిజిటల్ ఎంట్రీకి కూడా సిద్ధమయ్యాడు.. ధూత అనే వెబ్ సిరీస్‎లో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. భారీ బడ్జెట్‏తో ఎన్నో అంచనాల మధ్య ఈ సిరీస్ తెరకెక్కించనున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు చైతూ..

Also Read: Sundaram Master: నవలాలోకంలో నిశీధి.. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సుందరం మాస్టారు

RRR Movie : ఆర్ఆర్ఆర్ థియేటర్ దగ్గర హైటెన్షన్.. ఆత్మహత్యాయత్నం చేసిన తారక్ అభిమాని..

Viral Photo: త్వరలో మమ్మీగా ప్రమోషన్‌ అందుకోనున్న.. ఈ అందాల తార ఎవరో గుర్తు పట్టారా.?

RRR Movie: రికార్డుల విషయంలో రాజీపడేది లేదు.. రోజు రోజుకు అంచనాలు పెంచుతున్న ఆర్ఆర్ఆర్