AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: రికార్డుల విషయంలో రాజీపడేది లేదు.. రోజు రోజుకు అంచనాలు పెంచుతున్న ఆర్ఆర్ఆర్

కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు యావత్ భారత దేశం మొత్తం మార్కెట్ మీద కన్నేస్తున్నాయి మన సినిమాలు. అయితే ఆర్ఆర్ఆర్ మేకర్స్ మాత్రం మిగతా పాకెట్స్ కంటే ఏపీ ఏరియాలపైనే గట్టిగా పోకస్ చేస్తున్నారు.

RRR Movie: రికార్డుల విషయంలో రాజీపడేది లేదు.. రోజు రోజుకు అంచనాలు పెంచుతున్న ఆర్ఆర్ఆర్
Rrr
Rajeev Rayala
|

Updated on: Mar 22, 2022 | 9:56 AM

Share

RRR Movie: కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు యావత్ భారత దేశం మొత్తం మార్కెట్ మీద కన్నేస్తున్నాయి మన సినిమాలు. అయితే ఆర్ఆర్ఆర్(RRR) మేకర్స్ మాత్రం మిగతా పాకెట్స్ కంటే ఏపీ ఏరియాలపైనే గట్టిగా పోకస్ చేస్తున్నారు. అంచనాల్ని రీచ్ అయ్యే క్రమంలో ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు టీమ్‌ ఆఫ్ జక్కన్న. టిక్కెట్ రేట్ల విషయంలో ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య ఏర్పడ్డ గ్యాప్‌.. తమ సినిమాపై ఎఫెక్ట్ చూపకూడదన్న కమిట్‌మెంట్‌ కనిపిస్తోంది ఆర్ఆర్ఆర్ మేకర్స్ దగ్గర. ఏపీలో కొత్త జీవో ఆలస్యం కావడంతో బ్యాడ్‌లక్ వెంటాడినా, గుడ్ రిజల్ట్‌తో గట్టెక్కింది భీమ్లానాయక్. ఆ తర్వాతొచ్చిన రాధేశ్యామ్ విషయంలో కూడా ఆఖరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగింది. సినిమాకు డివైడ్ టాక్ రావడంతో కలెక్షన్ల మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు. నెక్ట్స్ రాబోయే పెద్ద సినిమా ఆర్ఆర్ఆర్ మాత్రం ఏపీ మార్కెట్‌ని తేలిగ్గా తీసుకోవడం లేదు.

ఇటీవలే సీఎంని ప్రత్యేకంగా కలిసి… తమ సినిమాను గుర్తు చేసి వచ్చారు ఆర్ఆర్ఆర్ దర్శకనిర్మాతలు. ఆతర్వాతరావల్సిన తీపి కబురు కూడా వచ్చేసింది. మొదటి పదిరోజులు టిక్కెట్ రేట్ల పెంపుపై గ్రీన్‌ సిగ్నల్ దొరికేసింది. వితౌట్ రెమ్యునరేషన్స్‌ 336 కోట్లు ఖర్చు పెట్టి తీసిన భారీ సినిమా కనుక.. ఇంకా ఏమేం బెనిఫిట్స్‌ ఇవ్వాలో ఆలోచిస్తున్నాం అంటోంది ఏపీ సర్కార్. రిలీజ్‌కి ముందురోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్‌ ప్లాన్ చేసిన ట్రిపులార్ మేకర్స్.. బిగ్గెస్ట్ ఓపెనింగ్ నంబర్స్‌ని గెయిన్ చేస్తామన్న ధీమాతో వున్నారు.

మార్కెటింగ్‌లోనే కాదు… ప్రమోషన్స్‌ వైపు కూడా పదునైన వ్యూహంతో ముందుకెళుతున్నారు జక్కన్న. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు రెడీమేడ్ క్రేజ్ వుంది కనుక… అదర్‌ సైడ్‌ ప్రమోషన్స్ మీదే కాన్సన్‌ట్రేషన్ పెంచేశారు.ఆమధ్య ముంబైలో గ్రాండ్‌గా ఈవెంట్ నిర్వహించారు. ఈసారి… కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో ఆర్ఆర్ఆర్ వేడుక నిర్వహించారు. దుబాయ్‌లో మొదలుపెట్టి.. బరోడా, వారణాసి, ఢిల్లీ, అమృత్‌సర్‌, జైపూర్… ఇలా రోజుకు రెండు మహానగరాల్ని టచ్ చేస్తూ… దేశవ్యాప్త ప్రచారానికి రోడ్‌మ్యాప్ డిజైన్ చేసుకున్నారు. లెటజ్ మార్చ్ విత్ అజ్ అంటూ… మార్చి 25 వైపు యావత్‌దేశాన్ని కదిలిస్తోంది జక్కన్న బృందం. నాన్ తెలుగు సర్కిల్స్‌ వైపు స్టీరింగ్ తిప్పి… ఆర్ఆర్ఆర్ సినిమాను స్పెషల్‌గా డ్రైవ్ చేస్తున్నారు మేకర్స్. ఏ విషయంలోనూ రాజీ పడకుండా వెయ్యికోట్ల మార్క్‌ని ఛేజ్ చేస్తూ దూసుకెళుతోంది ఆర్ఆర్ఆర్ మూవీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shabaash Mithu: సచిన్, ధోని తర్వాత మరో లెజండరీ క్రికెటర్‌ బయోపిక్.. టీజర్‌ దుమ్మురేపుతోంది..!

Viral Photo: క్యూట్ బుజ్జాయి.. చిలిపి చిన్నారి.. ఈ ఫోటోలోని పాప ఇప్పుడు కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్.! ఎవరో గుర్తుపట్టారా!

Ajith Valimai: ఇక ఓటీటీలో సందడి చేయనున్న అజిత్.. బ్లాక్ బస్టర్ వలిమై స్ట్రీమింగ్ ఎప్పుడంటే..