Ajith Valimai: ఇక ఓటీటీలో సందడి చేయనున్న అజిత్.. బ్లాక్ బస్టర్ వలిమై స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

సినీ ప్రియులకు ఈవారం డబుల్ బోనాంజా రాబోతుంది.. ఓవైపు థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమా సందడి చేయనుండగా.. మరోవైపు ఓటీటీలో అజిత్ రచ్చ చేయడానికి సిద్ధమాయ్యాడు.

Ajith Valimai: ఇక ఓటీటీలో సందడి చేయనున్న అజిత్.. బ్లాక్ బస్టర్ వలిమై స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Ajith Valimai
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 21, 2022 | 7:31 PM

సినీ ప్రియులకు ఈవారం డబుల్ బోనాంజా రాబోతుంది.. ఓవైపు థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమా సందడి చేయనుండగా.. మరోవైపు ఓటీటీలో అజిత్ రచ్చ చేయడానికి సిద్ధమాయ్యాడు. తమిళ్ స్టార్ హీరో అజిత్ (Ajith) నటించిన వలిమై (Valimai) ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. డైరెక్టర్ హెచ్.. వినోద్ దర్శకత్వం వహించిన వలిమై మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ప్రతినాయకుడిపాత్రలో నటించి అదరగొట్టాడు.. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ ఆల్ టైం రికార్డ్స్ సాధించింది..

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఈ సినిమా మార్చి 25న స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. జీ స్టూడియోస్‌తో క‌లిసి బే వ్యూ ప్రాజెక్ట్స్‌పై బోనీ క‌పూర్ ఈ మూవీని నిర్మించారు. హ్యుమా ఖురేషి కీ రోల్ పోషించింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత అజిత్​ నటించిన ఈ సినిమా థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదలై రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం అజిత్.. మళ్లీ డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు.

ట్వీట్..

Also Read: Aamir Khan: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ఆమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మన చరిత్రకు నిదర్శనమంటూ..

Krithi Shetty: బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న బేబమ్మ.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో..

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కారు ఆపి తనిఖీ చేసిన పోలీసులు.. పూర్తి వివరాలు..

BSNL: కస్టమర్లకు గుడ్‏న్యూస్ అందించిన బీఎస్ఎన్ఎల్.. ఇకపై సరికొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్.. ప్రయోజనాలెన్నంటే..