AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కారు ఆపి తనిఖీ చేసిన పోలీసులు.. పూర్తి వివరాలు..

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. హైదరాబాద్‏లో

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కారు ఆపి తనిఖీ చేసిన పోలీసులు.. పూర్తి వివరాలు..
Ntr
Rajitha Chanti
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 21, 2022 | 5:15 PM

Share

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. హైదరాబాద్‏లో బ్లాక్ ఫిలింతో ప్రయాణిస్తున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‏స్పెక్టర్ ముత్తు ఆధర్వంలో జూబ్లీహిల్స్ చెక్‏పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో పలు వాహనాలను గుర్తించి నలుపు తెరలు ఉన్నవాటిని తొలగించారు. ఇందులో భాగాంగ.. జూనియర్ ఎన్టీఆర్ వాహనాన్ని తనిఖీ చేసి అనంతరం అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను తొలగించారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో కారులో డ్రైవర్‏తోపాటు.. ఎన్టీఆర్ తనయుడు.. మరో వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచరం. అలాగే..గువ్వల బాలరాజు పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్.. మేరాజ్ హుస్సేన్… ఏపీకి చెందిన శ్రీధర్ రెడ్డి పేరుతో స్టిక్కర్ ఉన్న వాహనాలను గుర్తించి బ్లాక్ ఫిలిం తలగించారు.. నిబంధనలు పాటించని వాహనాలను .. నంబర్ ప్లేట్ సరిగ్గా లేని వాహనాలను గుర్తించి ఫైన్ వేశారు పోలీసులు.. జూబ్లీహిల్స్ కారు ప్రమాదం ఘటన నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు.

జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్నవారు తప్ప ఇతరులెవరూ వాహనాలపై బ్లాక్ ఫిలిం ఉపయోగించడానికి అనుమితి లేదని పోలీసులు తెలిపారు.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాహనం లోపల విజిబులిటీ సరిగ్గా ఉండాలని.. వాహనాలపై అనుమతి లేకుండా బ్లాక్ ఫిలిం వేయొద్దని పోలీసులు హెచ్చరించారు..మరో రెండు రోజులపాటు..ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగనుందని తెలిపారు..

ఇదిలా ఉంటే.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‏లో బిజీగా ఉన్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో రామ్ చరణ్.. ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో గత మూడు. నాలుగు రోజులుగా వరుసగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు జక్కన్న అండ్ టీం. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్.. స్టార్ హీరో అజయ్ దేవగణ్.. శ్రియాసరన్ కీలకపాత్రలలో నటించగా.. డీవీవీ ఎంటర్ట్నైమెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మించాడు.

Also Read: RRR in Delhi: తారక్, చెర్రీలతో కలిసి నాటు నాటు సాంగ్‌కు స్టెప్స్ వేసిన అమీర్ ఖాన్.. నెట్టింట్లో వీడియో వైరల్

Sonam Kapoor: త్వరలోనే తల్లి కాబోతున్న బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న బేబీ బంప్‌ ఫొటోలు..

OTT & Theater Movies: ఈ వారం మూవీ లవర్స్ కు పండగే.. థియేటర్లు/ ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు ఇవే..