OTT & Theater Movies: ఈ వారం మూవీ లవర్స్ కు పండగే.. థియేటర్లు/ ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు ఇవే..

కరోనా థర్డ్‌వేవ్‌ కారణంగా వాయిదా పడిన పెద్ద సినిమాలన్నీ ఒక్కొక్కటి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే భీమ్లానాయక్‌, రాధేశ్యామ్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చి కావల్సినంత వినోదాన్ని అందించాయి.

OTT & Theater Movies: ఈ వారం మూవీ లవర్స్ కు పండగే.. థియేటర్లు/ ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు ఇవే..
Rrr Movie
Follow us
Basha Shek

|

Updated on: Mar 21, 2022 | 1:08 PM

కరోనా థర్డ్‌వేవ్‌ కారణంగా వాయిదా పడిన పెద్ద సినిమాలన్నీ ఒక్కొక్కటి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే భీమ్లానాయక్‌, రాధేశ్యామ్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చి కావల్సినంత వినోదాన్ని అందించాయి. ఇక టాలీవుడ్‌తో పాటు యావత్‌ సినిమా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR). రామ్‌చరణ్‌ (Ram charan) , ఎన్టీఆర్‌(NTR) హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఈ పాన్‌ఇండియా చిత్రం మార్చి 25న గ్రాండ్‌గా రిలీజ్‌కానుంది. దీంతో దాదాపు థియేటర్లన్నీ ఈ సినిమాతోనే నిండిపోనున్నాయి. ఇక ఓటీటీ వీక్షకుల కోసం కూడా రెండు బ్లాక్‌బస్టర్ల సినిమాలు వెయిట్‌ చేస్తున్నాయి. మరీ ఈవారంలో థియేటర్లు, ఓటీటీల్లో రిలీజ్‌ కానున్న సినిమాలేంటో తెలుసుకుందాం రండి.

ఆర్‌ఆర్‌ఆర్‌పైనే అందరి దృష్టి.. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది ఆర్‌ఆర్‌ఆర్‌. రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్‌, హాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఒలివియా మోరీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్‌దేవ్‌గణ్‌, శ్రియాశరణ్‌, సముద్ర ఖణి తదితరలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సీతారామరాజు పాత్రలో చెర్రీ, కొమురం భీం క్యారెక్టర్లలో తారక్‌లను చూసేందుకు సినిమా ప్రియులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ వారం తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు థియేటర్లన్నీ ఈ సినిమాతోనే నిండిపోనున్నాయి.

Rrr Movie

ఓటీటీలోనూ ఫుల్‌ ఎంటర్‌టెన్‌మెంట్‌..

భీమ్లానాయక్‌

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రానా హీరోలుగా తెరకెక్కిన చిత్రం భీమ్లానాయక్‌. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సిల్వర్‌స్ర్కీన్‌పై ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమైంది. ఏకంగా రెండు ప్రముఖ ఓటీటీలు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌ చేయనుండడం విశేషం. ఆహాతో పాటు డిస్నీ+హాట్‌స్టార్‌ల వేదికగా మార్చి 25 నుంచి భీమ్లానాయక్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

Bheemla Nayak

Bheemla Nayak

వలిమై

తమిళ నటుడు అజిత్‌ హీరోగా నటించిన చిత్రం వలిమై. టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ విలన్‌గా నటించాడు. ఖాకీ ఫేం హెచ్‌. వినోద్‌ తెరకెక్కించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా బైక్‌ సీక్వెన్స్ లు ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురిచేశాయి. ఇప్పుడు డిజిటల్‌ మాధ్యమం వేదికగా అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో మార్చి 25 నుంచి వలిమై స్ట్రీమింగ్‌ కానుంది.

Valimai

Valimai

ఇవికూడా..

* డ్యూన్‌ (హాలీవుడ్‌)- అమెజాన్‌ ప్రైమ్‌-  మార్చి 25

* పారలెల్స్‌ (ఒరిజినల్‌ మూవీ) – డిస్నీ+హాట్‌ స్టార్‌-  మార్చి 23

* బ్రిడ్జిటన్‌ (వెబ్‌సిరీస్‌2)- నెట్‌ఫ్లిక్స్‌- మార్చి 25

* రూహానియత్‌ (హిందీ)- ఎంఎక్స్‌ ప్లేయర్‌-  మార్చి 23

* హలో (వెబ్‌సిరిస్‌) – ఊట్‌- మార్చి 23

Also Read:Punjab: పంజాబ్‌ ఆప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఫిజిక్స్ ప్రొఫెసర్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కేజ్రీవాల్

Telangana: తెల్లారితే తమ్ముడికి, ఆడపడుచుకి పెళ్లి.. ఊహించని పని చేసిన వివాహిత

RRR: అమృత్‌సర్‌లో ట్రిపులార్‌ టీమ్‌.. గోల్డెన్‌ టెంపుల్‌లో ప్రత్యేక ప్రార్థనలు